Others

తెలుగు ముత్యాలు(ప్రపంచ తెలుగు మహాసభలు )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నవరత్నముల వలె ప్రకాశించెను నా తెలుగు అక్షరములు
నలుదిశల నదుల వలె పొంగి పొరలెను నా తెలుగు అలలు

తెలుగువాడి తేట తెలుగు మాటల పలకరింపులు
పసిడికి దిద్దిన మెరుగులే నా తెలుగు అందాలు

నింగిలో ఉరిమే ఉరుములు, మెరిసే మెరుపులు
పాల నురగల అలలు నా తెలుగు పదాల సొబగులు

పరిమళ కవన గజమాలలు అద్భుత పదప్రయోగ జతులు
అవని సిగలో విరిసిన విరులు నా తెలుగు అక్షర కుసుమాలు

కలము కదిపిన చాలు తెలుగు మది చెలములో ఊరును
తెలుగు ముత్యాలు, అందమైన పద్య కవన కావ్యహారాలు

గుడి గోపురమున కవి కోయలమ్మ పాడెను సప్తస్వరాలు
నా తెలుగు అక్షర సరిగమ పదనిసలు, సుస్వరనాదాలు

- డా. శారదారెడ్డి వకుల