Others

మన తెలుగు.. ఒక వెలుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాలకు మంగళస్నానం చేయించి
పదాలకు పట్టుపరికిణీలు తొడిగి
భావాలకు కస్తూరి తిలకాలు దిద్ది
భావుకత్వ సామ్రాజ్యంలో,
హంసతూలికా తల్పాలపై
అరమోడ్పు కన్నులతో ఒకప్పుడు
అలవోకగా శయనించిన
అనంత సౌందర్యరాశి మన తెలుగు
అలనాటి రాజరాజు కంటికొసల
పసిడిపూల కలలమాల మన తెలుగు
పువ్వులలో, పసిపాపల నవ్వులలో
అమ్మ ప్రేమనయనమ్ముల మేల్‌దివ్వెలలో
కమ్మని పాల బువ్వలలో వెలిగే
మువ్వపు నుడికారపు రవ్వ మన తెలుగు
గువ్వల సవ్వడిని మించే మురిపించే
మువ్వ మన తెలుగు
పూతపూసిన చిరుమావి వాసన మన తెలుగు
తెలుగు వైభవానికి చుక్కాని మహాసభల సంరంభం

-కామిడి సతీష్‌రెడ్డి