Others

మాతృభాష... ఆత్మఘోష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగునేలకు సోకిన ఇంగ్లీషు తెగులు
మాతృభాషను మంచాన పడేసింది.
లెస్సగా వెలిగిన తెలుగు వెలుగుల
దీపం కొడిగట్టింది.. కొండెక్కుతోంది
తెలుగు భాషావైభవం నిండుకుంటోంది..
అక్షరవైభవం కోసం తెలుగుతల్లి పరితపిస్తోంది..
మనకెందుకీ పరభాషా వ్యామోహం
దొరసాని మురిపిస్తోంది.. అమ్మను దూరం చేస్తోంది
తెలుగుతల్లి ఎదురు చూస్తోంది
రేపటి ఉషస్సు కోసం.. రేపటి ఉగాది కోసం
కవికోకిలలు, కవిరాజులు, కవి సమ్రాట్టులు
కవిసార్వభౌములు తెరమరుగయ్యారు
పురాణప్రబంధాలు, శతకకీర్తనలు,
అష్టకాలు, జానపదాలకు ఇది కష్టకాలం
తేట తెనుగు తెల్లబోయి చూస్తోంది
తెలుగు పలుకుబడి వెలవెలాబోతోంది
అమ్మభాషకు అవిటితనం రావొద్దు
అక్కాచెల్లెళ్లూ, అన్నాదమ్ములూ
అఆలను అక్కున చేర్చుకుందాం
అమ్మ ఋణం.. అమ్మభాష ఋణం తీర్చుకుందాం

-అలంకారం విజయకుమార్ రాజు