AADIVAVRAM - Others

నియమ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డోంట్ ఫీడ్ ది ఏనిమల్స్-
గోడమీది ఆ బోర్డ్‌ని ఎవరూ చూడకుండా ఉండరు. తల్లిదండ్రులతో జూకి వచ్చిన రాజసిరి కూడా దాన్ని చూశాడు కాని ఏనుగుల ఎంక్లోజర్ దగ్గరికి వచ్చాక ఏనుగు పిల్లకి తన చేతిలోని వేరుశెనగ పప్పుని పెట్టాలని అనిపించింది. ఓసారి అటు, ఇటు తల తిప్పి చూశాడు. తనని ఎవరూ గమనించడం లేదని గ్రహించాక ఓ గుప్పెడు వేరుశెనగ పప్పుని పిల్ల ఏనుగు వైపు విసరబోయాడు.
రాజసిరి తల్లి వాడి చేతిని పట్టుకుని ఆపి అరిచింది.
‘ఏం చేస్తున్నావు? ఇందాక ఆ బోర్డ్‌ని చదవలేదా?’
‘కొనే్న పెడుతున్నానమ్మా’
‘ఏది చెయ్యకూడదో దాన్ని చెయ్యనే కూడదు. ముందు అది నేర్చుకో. ఇక్కడ వాహనాలు నిలుపరాదు. ఇక్కడ ఉమ్మి వేయకూడదు. ఇక్కడ పొగ తాగరాదు. స్ర్తిల సీట్లు. ఒన్ వే ఓన్లీ’ ఇలా నీకు ప్రతీ రోజు అనేక హెచ్చరికలు కనిపిస్తూంటాయి. వాటిని చెయ్యకపోవడం నేర్చుకో. ఎవరూ చూడనప్పుడు వాటిని చేయాలనిపిస్తుంది. ఆ వ్యామోహాన్ని తొలగించుకోకపోతే నువ్వు కష్టాల్లో పడటం గేరంటీ’
జూ నించి ఇంటికి వెళ్లాక రాజసిరి తల్లి ఓ దినపత్రికలోని వార్తని చదివి వినిపించింది. ఎవరో ఓ జంతువుకి చాక్లెట్ పెడితే అది తిన్న ఆ జంతువు మరణించింది. తల్లి చూపించిన విదేశీ కుక్క ఫొటోని చూసి రాజసిరి చెప్పాడు.
‘అయ్యో!’
‘చాక్లెట్స్ కుక్కలకి విషం. ప్రతీ జంతువుకి రోజుకి ఎంత, ఏది తినిపించాలో అది తినిపించడం జూ సిబ్బంది పని. చూడటం మన పని. అందుకే సందర్శకులు వారికి ఏం పెట్టకూడదనే నియమాన్ని విధించారు. అవి మరణిస్తే ఇక చూడటానికి జూలో అవి ఉండవు. చాలా ఖరీదు పెట్టి వాటిని ఎక్కడెక్కడ నించో కొని విమానాల్లో, ఓడల్లో జూకి తెప్పిస్తారు. పోతే మళ్లీ కొనడానికి జూకి డబ్బుండదు’
‘అర్థమైంది’
‘ఆ పిల్ల ఏనుగుకి అవసరమైంది జూ వాళ్లు తినిపిస్తారు. ఏ నియమాన్నైనా రెండు కారణాలకి పాటించాలి. మొదటిది నీకు ఆ నియమం తెలుసు కాబట్టి దాన్ని పాటించాలి. రెండో కారణం, దాన్ని అతిక్రమిస్తే నీకు శిక్ష పడచ్చు కాబట్టి. వ్యామోహం ఎప్పుడూ మనిషిని వద్దన్న దాన్ని చేయించాలని ప్రయత్నిస్తుంది. అందువల్ల ఏ ప్రమాదం జరగదని అది మనల్ని భ్రమ పెడుతుంది. అలాంటి అన్ని రకాల వ్యామోహాలని వదిలించుకోవాలి’ రాజసిరి తల్లి చెప్పింది.

మల్లాది వెంకట కృష్ణమూర్తి