Others

ఎవరైనా సమ్మోహనమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘అదిగోరా ! జగన్మోహిని వస్తోంది. మోహినీ నీవెంత అందంగా ఉన్నావు’’అంటూ కొమ్ములు పెట్టుకుని రాక్షసుల వోలె కూర్చున్న పిల్లలు అన్నారు.
‘‘నిజం నిజం ఓ భామా ! బలేగున్నది నీ వాలుజడ ఇటు రమ్ము ఇదిగో ఈ పూవు నీకోసమే ’’అంటూ పక్కనే ఓ గడ్డిపూవును తీసి ఇవ్వచూపుతూ దేవతలమని కూర్చున్న వారు అన్నారు. కృష్ణు డు కూడా కిలా కిలా నవ్వుతూ కూర్చున్నాడు.
గోపబాలురంతా నవ్వుతున్నారు. మోహినీ వేషం కట్టిన గోపాలుడు హోయలు వొలికిస్తూ తన చేతిలోని గినె్నలోంచి తీసి పిండి వంట ఒక్కొక్కరికి అందిస్తున్నాడు. ఇంతలో రాక్షసుల మని కూర్చున్న గోపబాలురలో ఒకడు వచ్చి ‘ఒరేయ్ అమృతాన్నంతా దేవతలకే పంచుతోంది రా ఇదిగో మనమూ తిందాం రండి’ అంటూ వారిని రెచ్చగొట్టి మరీ ఆ మోహినీ వేషగాడి చేతిలోంచి గినె్నను లాక్కో చూసారు. ఆ గోపాలుడు ‘కాదు కాదు మీరు వ్యామోహ పడుతున్నారు. మీకూ పంచుతా కూర్చోండి అంటూ వారి వైపు చూస్తూ వారి వంక నడిచాడు. ‘అమ్మో అమృతం రాక్షసులు తింటే ఇక ఏమన్నా ఉందా ఇపుడే మనలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. వారికి బలం అధికం అయితే ఇక మన సంగతి దేవాదిదేవుడే చూడాలి’అంటూ వీరు లేచారు. ‘అందరి సంగతి చూసేది చేసేది ఆ దేవాదిదేవుడు. మీకెందుకుకంగారు అంటూ మరలా ఆ మోహినీవేషగోపాలుడు దేవతలవైపు తిరిగాడు. అంతలో ‘ఒరేయి వీడి ఆవకాయ చూడండి ఎంత బాగుందో కృష్ణా ఇది నీవు తిని చూడు’ అంటూ ఒకడు దూసుకొచ్చి కృష్ణుని నోరు తెరిచి పెట్టేశాడు. మరొకడు ‘కృష్ణా అది కారంగా ఉంటుంది. ఇదిగో ఈ తియ్యని పదార్థం భుజించు ఎంత బాగుందో’అంటూ మరొకడు లేచి తన తినే పదార్థాన్ని కృష్ణుని నోట్లో పెట్టేశాడు. కృష్ణుడి దగ్గరకు పోయి వచ్చే లోపు ఒకని తినుబండారాన్ని ఒకడు తినేశాడు. ‘చూడు కృష్ణా ! వీడు నా ఆహారాన్ని లాగేసుకున్నాడు ’ అంటూ ఫిర్యాదు చేసేలోపు ‘ఇదిగో తిను తిను ఇది నీకు బాగుంటుంది ’అంటూ ఒకడు ఫిర్యాదు చేసి వానినోట్లో పెట్టాడు. ఒక గోపాలుడు చూడకుండా మరొక గోపాలుడు తినేపదార్థాన్ని లాక్కొంటున్నాడు. ‘కృష్ణా ! నీకు యశోదమ్మ ఏమేమి పెట్టింది అంటూ కృష్ణుని చల్దిని తీసి చూస్తున్నారు. నా పదార్థాలే చాలా పసందుగా ఉన్నాయని ఒకడు చెబుతున్నాడు. ఒకడు వేరేవానిది లాక్కొని తింటున్నాడు. ఒకడు మరొకరి దగ్గర నుంచి తీసుకొని వచ్చి కృష్ణునికి తినిపిస్తున్నాడు. కృష్ణుని పదార్థాలనే తీసి కృష్ణుని కి తినిపిస్తున్నారు. ఇలా అందరూ తన్మయత్వంతో కృష్ణుని ఆసరా చేసుకొని అంతా ఆయనకే చెబుతూ ఆనందిస్తున్నారు. కృష్ణుడూ వారితో ఆడుతూ పాడుతూ ఆయన ఒక గోపబాలునిగానే కనిపిస్తున్నాడు.
***

- చరణ శ్రీ