Others

ప్రకృతే పాఠ్యాంశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శిశువుకు మాటలు రాగానే ఎందుకు? అనే ప్రశ్న మొదలవుతుంది. ప్రశ్నించడం ఒకరు నేర్పేది కాదు. అది సహజసిద్ధమైంది. ఆకాశాన్ని చూస్తాడు. ఈ చుక్కలు ఎట్లా వెలుగుతున్నాయని ప్రశ్నించుకుంటాడు. ఆకాశం నీలిరంగుగా ఎలా ఉంది? ఎందుకు ఉంది? అన్న ఊహల్లోకి పోతారు. శరీరంపై ఈ పుట్టుమచ్చలు ఎలా వచ్చాయని ప్రశ్నించుకుంటారు. కాళ్లు లేని పాము చెట్టు ఎలా ఎక్కుతుందని తండ్రిని అడుగుతాడు. ఈ రాస్తున్న రాతలు ఎవరు కనుక్కున్నారని పిల్లలు అడుగుతారు. ఇవన్నీ ఎవరో చెబితే అడిగిన ప్రశ్నలా? ప్రకృతే పెద్ద తరగతి గది. కుటుంబమే ఒక గురువు. పిల్లలు విశాలమైన ప్రపంచపు తరగది గది ఒడి నుంచి నాలుగు గోడలున్న తరగతి గదికి వస్తున్నారు. గురువులు మారుతున్నారు. ఆలోచనే గురువును, శిష్యులను, తోటి పిల్లలను బాధిస్తుంది. విద్యార్థికి నేనే అక్షరజ్ఞానం నేర్పించానని ఉపాధ్యాయుడు అనుకోవలసిన అవసరం లేదు. అక్షరంకన్నా మొదలే భావన వచ్చింది. ఆ భావనకు తరగతి గది ఒక స్వరూపం ఇస్తుంది. ప్రకృతి మొదటి గురువు. ప్రకృతే తరగతి గది. ప్రకృతే పాఠ్యాంశం.
ఆకాశం జ్ఞాన నిధి...
తరగతి గదికి కాల నిబంధన ఉండదు. ఒక అమావాస్య రాత్రి ఒక పిల్లగాడు పక్కలో పడుకుని ఆకాశాన్ని చూస్తాడు. ఆకాశం అతనికి గురువు. లెక్కించలేనన్ని నక్షత్రాలను ఆకాశం చూపుతుంది. అదే పిల్లగాడు పదేళ్ల తరువాత ఆ ఆకాశానే్న టెలిస్కోప్ సహాయంతో చూస్తే ఆనాడు తాను చూసిన దానికంటే మరిన్ని ఎక్కువగా నక్షత్రాలు కనిపిస్తున్నాయంటాడు. గణితం తరగతిలో సంఖ్యాశాస్త్రం చెబుతున్నప్పుడు నక్షత్రాల ఉపమానం తీసుకుంటారు. నెంబర్స్ ఆర్ అన్‌కౌంటబుల్ (లెక్కించలేనటువంటివి). అదెట్లా అని పిల్లలు అడుగుతారు. ఆకాశంపైన నక్షత్రాలని ఉపాధ్యాయుడు చెబుతాడు. దగ్గరగా ఉండే ఏ రెండు నక్షత్రాలైనా తీసుకో నీ లెక్కకురాని మరో నక్షత్రం కనిపిస్తుందని బోధన చేస్తారు. అనగా రెండు వాస్తవ సంఖ్యల మధ్యన మరొక వాస్తవ సంఖ్య ఉంటుంది. వాస్తవ సంఖ్యలు ఆకాశంపై నక్షత్రం తీరుగా ఉండాయని టీచర్ పాఠం చెబుతారు. ఆకాశంలో నక్షత్రాలే గణితానికి మూలం. ప్రకృతి తరగతి గదికి కొన్నిసార్లు బ్లాక్‌బోర్డుగా, కొన్నిసార్లు కంప్యూటర్‌గా ఉపయోగపడుతుంది. ఆకాశాన్ని పరిశీలించిన కొద్దీ కొత్త జ్ఞానం ఆవిష్కరించబడుతుంది.

-డాక్టర్ చుక్కా రామయ్య