Others

విధి విచిత్ర లీలావిలాసి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వీరి పక్కనే కృష్ణుడు గీసిన గిరిలోనే పశువులు పచ్చికను ఆదమరిచి తింటున్నాయి. కొన్ని తిన్నవాటిని హాయిగా చెట్ల నీడలో కూర్చుని నెమరేస్తున్నాయి. కాని ఏ గోవు గిరి దాటి ఇవతల వచ్చే ప్రయత్నమేమీ చేయడంలేదు.
సరస్వతి దీని నంతా చూస్తూ ‘ఆహా! ఇది కృష్ణావతారమా! లేక భూలోకవాసులను ఉద్ధరించడానికి నీకై నీవు దిగి వచ్చి చేస్తున్న మాయనా .. అయినా వీరెంత అదృష్టవంతులు పరబ్రహ్మతోనే ఆటలు పాటలు పరబ్రహ్మకు, వీరికి తేడా లేదు కదా జీవాత్మ పరమాత్మతో ఆటలు ఆహా’ అంది.
చతుర్ముఖుని మోము చిన్నబోయింది. ఎర్రగా కందింది. ‘లేదు లేదు శారదా ఇది నీ భ్రమ. నీవు నా భార్యవు అయి ఉండి కూడా మాయామోహితురాలివి అయ్యావు. వీరంతా నేను సృష్టించిన జనమే సుమా. ఇందులో పరబ్రహ్మ లేనేలేడు. అయినా పరబ్రహ్మ ఈ పామర గోపజనంతో కలసి ఆటలు ఆడుతాడా. ఈ యశోదమ్మ కొడుకు ను మీరు పరబ్రహ్మగా తలచడం ఏమిటి అంతా మాయ’అన్నాడు.
నారదుడు ‘నలువా! నీకు పరబ్రహ్మ సంగతి తెలిసీ ఇలా మాట్లాడడం బహు చిత్రంగా ఉంది సుమా.’అయినా పరమేశుడు ఏం చేయాలనుకొన్నాడో చూద్దాం అన్నాడు నారదుడు.
ఇదిగో చూడండి. ఇపుడు నేను చేయబోయే దానికి ఈ పరబ్రహ్మ అనుకొనే కృష్ణుడు ఏం చేస్తాడో చూస్తాను. అని కనులు మూసుకొన్నాడు చతుర్ముఖుడు.
సరస్వతి, నారదులు చతుర్ముఖుని ఆలోచన ఏమిటో అనుకొన్నారు. కొద్దిసేపటికి కృష్ణుడిని, గోపబాలురను,గోవులను అందరినీ తీసుకొని వేరొక ప్రదేశానికి వెళ్లాడు. ఆయన్ను నారద సరస్వతులు అనుసరించారు. మీరు వెళ్లండి నేను మిమ్ముల్ని తర్వాత కలుసుకొంటాను అంటూ బహ్మ్ర వేగంగా వెళ్లిపోయాడు.
కృష్ణుడు బ్రహ్మ చేసిన పనికి చిరునవ్వు నవ్వాడు. సాయం సమయం అయింది. గోపకాంతలు తమతమ బిడ్డలకోసం ఎదురుచూసే సమయం ఇది అనుకొన్నాడు. అంతే తానే గోపబాలురుగాను, గోజనంగాను, గోవులుగాను, గోవత్సములుగాను మారిపోయాడు. యథావిధిగా కృష్ణుడు అనేకగోపాలురుగా మారి ఆ కృష్ణుని రూపాలైన గోవులను తోలుకొని ఎవరిండ్లకు వాళ్లు పోయారు.బృందావనంలో గోపకాంతలు తమ తమబిడ్డలు వచ్చారనుకొని వారిని ఆదరించారు. వారికి స్నానపానాదులు చేయించారు. తినడానికి పెట్టారు. పశువులకు దాణా వేశారు. అంతా సజావుగా సాగింది. ఇలానే ఎన్నో రోజులు, నెలలు కూడా దాటాయి. సంవత్సరం కాబోతోంది.
చతుర్ముఖుడు రోజంతా అయిపోతోంది. మరి ఈ పరబ్రహ్మ అని చెప్పిన ఆ యశోద తనయుడు, గోపబాలుడు ఏమి చేస్తున్నాడో బృందావన వాసులు తమ తమ పిల్లలు కనబడ్లేదని ఎంతగా అలమటిస్తున్నారో ఇపుడు ఈ శారదాదేవికి, ఆ త్రిలోక సంచారికి విషయం అర్థమవుతుంది అనుకొని తను కృష్ణ పరివారాన్ని దాచిన స్థలాన్ని చూశాడు. వారంతా ఆటలు ఆడుతూనే ఉన్నారు. మరలా ఈ బృందావనం లోని కృష్ణుని వైపు చూశాడు. అందరి ఇండ్లల్లోను గోపబాలురున్నారు. వారి వారి పశువులూ ఉన్నాయి. యశోదమ్మ గారం చేసి చేసి కృష్ణుని వెన్నముద్దలు తినిపిస్తోంది. చతుర్ముఖునికి అయోమయం ఏర్పడింది. అంతా మళ్లీ మళ్లీ చూశాడు. కళ్లు నులుముకుని చూశాడు. కాని జరుగుతున్నది వేరు. జరగాలనుకొన్నది వేరు జ్ఞానోదయం అయ్యింది. ‘ఈశ్వరా! నేను అయోమయానికి గురైయ్యాను. బ్రహ్మ నై ఉండి కూడా నీ మాయను తెలుసుకోలేకపోయాను. చెబుతున్నా అహంకారంతో విర్రవీగాను. అజ్ఞానంతో మసలాను. నా తప్పును నీవు క్షమించు కృష్ణా పరమాత్మ ’అంటూ పరుగు పరుగున బృందావనానికి విచ్చేసాడు. పరమాత్మ కృష్ణయ్య ఒక్కడే కూర్చుని పిల్లన గ్రోవి ఊదుకొంటున్నాడు.. సరాసరి వచ్చి బ్రహ్మ కృష్ణుని పాదాలపై పడ్డాడు. కృష్ణా కృష్ణా అంటూ పలవరిస్తున్నాడు.
అంతా మాయ.. మరేం లేదు .. అంటూ చిన్నగా నవ్వాడు కృష్ణుడు. అక్కడికి వచ్చిన నారదుడు, సరస్వతి కూడా అంతా కృష్ణమాయ అంటూ చేతులెత్తి కృష్ణునికి మొక్కారు.
****

- చరణ శ్రీ