Others

రుద్రుడే హనుమంతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రుద్రావతారో భగవాన్ భక్తోద్ధారకస్సవై
హనూమాన్స మహావీర్యో రామకార్య కరస్సదా
అని శివపురాణం వర్ణిస్తుంది. మనల్ని ఉద్ధరించుటకై స్వయంగా రుద్రుడే హనుమంతుడుగా అవతరించాడు. అతడు మహావీరుడు, శ్రీరామకార్య సంపాదకుడు. శివునికి ఉన్న ఎనిమిది మూర్తులలో మొదటి రూపం రుద్రుడు. క్రమంగా మిగతా భవుడు, శర్వుడు, ఈశానుడు, పశుపతి, భీముడు, ఉగ్రుడు, మహాదేవుడు. ఆంజనేయ సహస్ర నామావళిలో ఒక నామం ‘రుద్రవీర్య సంభకాయైనమః’ అనేది ఈ సత్యానే్న మరోసారి ప్రకటిస్తుంది. ఆంజనేయస్వామివారిని తలచుకుంటే చాలు బుద్ధి బల, యశస్సు, నిర్భయత్వం, ఆరోగ్యం, మంచి సంభాషణాశక్తి ఇలా అనేకం లభిస్తాయన్నది ఆర్షవాక్యం. ఆ స్వామిని పలువురు కవి పండితులు స్తోత్రం చేసి ముక్తి పొందారు.
దండకాలు, అష్టకాలు, స్తోత్రాలు, గద్యలు, వచనాలు.. ఇలా అనేకం. ‘నక్షత్రమాల’ అనే ప్రక్రియా రూపంలో ఆంజనేయస్వామిని చంపక, ఉత్పల పుష్పాలతో అర్చించి, శివసాయుజ్యం పొందిన విద్వత్కవులు కీ.శే. ముట్నూరి యజ్ఞనారాయణ శర్మగారు వారిలో ఒకరు. వారి రచన ఆరవ ముద్రరణ పొంది నేడు మళ్లీ మన ముందు నిలిచింది. ఈ చిరుపొత్తంలో హనుమత్ సుప్రభావం కూడా చోటుచేసుకోవడం ఒక విశేషం.
కవి గురించి
కీ.శే. శ్రీముట్నూరి యజ్ఞ నారాయణ శర్మగారు మంచి పండితులు, కవి, గాయకులు. ఒక్కమాటలో సంగీత సాహిత్య నిధి. సుప్రసిద్ధ హరికథకులు కూడా! ఆనాటి కాలంలో 1940వ దశకంలో హెచ్.ఎం.వి గ్రామ ఫోను రికార్డు సంస్థ వారు వీరిని మద్రాసుకు పిలిపించుకుని మరీ, వీరి ‘నందనార్’ హరికథను రికార్డు చేయడం ఒక నిదర్శనం. కర్ణాటక సంగీతంలోనే కాక హిందూస్తానీ సంగీతంలో కూడా చక్కని ప్రవేశం ఉన్న శర్మగారికి ఈ ‘నందనార్’ హరికథకు సహకార వాయిద్యం అందించినవారు, సుప్రసిద్ధ సంగీత విద్వాంసులు, అనేక చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన మాస్టర్ వేణుగారు. అదీ శర్మగారి గొప్పదనం.
నక్షత్ర మాలిక
పద్యం అల్లికతో కావ్యాలు సృష్టించారు కవులు. దైవాన్ని స్తోత్రం చేయడంలో ఆ పద్యానే్న హృద్యంగా మలచి అయిదు పద్యాలలో పంచరత్నాలుగా, ఇరవై ఏడు పద్యాలలో నక్షత్రమాలగా గుదిగుచ్చి, పుష్పార్చన చేశారు. నక్షత్ర మండలంలోని అశ్వని, భరణి.. రేవతి అనేవి కోటాను కోట్ల నక్షత్ర సమూహాలకు సంజ్ఞలుగా ఉన్నాయి. ఇవి ఇరవై ఏడు. వీటికే ప్రతీకాత్మకంగా స్వీకరించి, సంఖ్యామానంగా దైవాన్ని స్తుతించడం నక్షత్రమాలిక. ఈ రచనలో పువ్వులకు ప్రతీకలుగా ఉన్న ఉత్పలమాల, చంపకమాల వృత్తాలను మాత్రమే స్వీకరించి కవి రచన పూర్తిచేశారు.
శర్మగారి ఈ నక్షత్రమాలలో ప్రత్యేకతలు
ఒక ఇరవై ఏడు సంఖ్యామానాన్ని ప్రధానంగా స్వీకరించక, దానితో పాటు మరికొన్ని విశేషాలనూ శ్రీ శర్మగారీ రచనలో పొందుపరిచారు. రచనను రెండు భాగాలుగా చేసి మొదటి భాగం పదహారు పద్యాలు, రెండవ భాగం పదకొండు పద్యాలు, ఇలా మలిచారు. తెలుగు భాషలో అచ్చులను ప్రాణాలు అని పిలుస్తాం. ఇవి పదహారు అ, ఆ, ఇ, ఈ, ఉ, ఊ, ఋ, ఎ, ఏ, ఐ, ఓ, ఔ, అం, అః అని తన రచనకు స్వీకరించి వీటిని ప్రారంభాక్షరాలుగా ఉత్పలములుగా మార్చి స్వామిని సేవించారు. సాధారణంగా ఏ రచన అయినా శ్రీకారంతో ప్రారంభం అవుతుంది. శర్మగారు అసమ తపః ప్రభావ.. అని మొదటి పద్యంరాసి, పదిహేడవ పద్యంగా శ్రీ రఘురామ పాదసరసీరుహ సంశ్రీత.. ఇలా సంపుటీకరణం చేశారు.
ఆంజనేయ మహామంత్ర రహస్యం ఇందులో నిక్షిప్తం చేశారు. ఇకనుండీ పద్యారంభ అక్షరాలు ‘శ్రీరామ దూతాయ ఆంజనేయాయ’ అనే పదకొండు అక్షరాలుగా మనకు ఈ రచనలో అగుపిస్తాయి. ఈ పదకొండు ఏకాదశ రుద్రులకు ప్రతీకలు. ఇది ప్రాణంతో, సజీవంతో ఉన్న రచన.
ఈ పద్యాలను నిరంతరం పారాయణం చేస్తుంటే వారు హనుమను ఉపాసించడం ద్వారా పార్వతీ పరమేశ్వరులను సేవించినట్లవుతుంది. మొదటి భాగం ప్రకృతి- అమ్మవారు తరువాయి శివుడు- అయ్యవారు.
కవి స్వయంగా సంగీతోపాశకుడు కూడా అయినందువల్ల పద్యాల నడక హార్మణీయం మెట్లపై సరిగమలను పలికించినట్లు మధురంగా సాగుతుంది. హనుమ పంచముఖుడు. వానర, నారసింహ, ఖగ, క్రోధ, అశ్వ ముఖాలతో ఈ పాంచభౌతిక ప్రపంచాన్ని నిర్వహించువాడు, మనకు రక్ష.
మంత్ర శాస్త్రం
ఐదు మొగంబులై పృథివి యప్పనలా నిలవ్యోమముల్, గదన్
కైదువునుం గ్రహించి వడిగాఢ త్రివిక్రమ విక్రంబునన్
పై దుముకంగ నొక్కగది బర్వెడు భూత పిశాచరాశి క్ర
వ్యాద గణంబులా యముని పాలికి నిన్గని యంజనా సుతా
ఇదీ విశేషం. అసమ తపః ప్రభావ- ఆకటజిక్కి- ఇమ్ముగ బార్థుగూర్చి- ఈశ్వర తేజ- ఉదరక రాము కార్యమున- ఊసరి లింగజేసెడి- ఋజువొనరించినావట- ఐలిత మనస్కుడన్- ఎచ్చటజూచినన్-
ఏమని ప్రస్తుతింపదగు- ఐదు మొగంబులై - ఒక్క ముహూర్తమా- ఓ మహనీయ తేజ- ఔచితి నీగుణంబు- అందముజిందు -అహమను చీకటింబడి - శ్రీరఘురామ- రాలువరాలు- మననము- దూతవు- తావరయైన- యమునికి- ఆంగిరసుండు జూచి- జనకజ రాము కార్యమున నేమము తోడ-యాత్రలు సేయజాల- యమివగుచున్ అంటూ ప్రారంభమయ్యే ఈ సప్తవింశతి రత్నాలు ‘అంజనాసుతా’ అనే మకుటంతో వెలుగొందుతున్నాయి.
హనుమదుపాసకులకు హస్త్భూషణం ఈ గ్రంథ రాజం. అనేక మంత్ర రహస్యాలను నిక్షిప్తం చేసుకున్న ఈ గ్రంథం కొండను అద్దంలో చూపినట్టు ఆంజనేయస్వామి వారి దివ్య మంగళ విగ్రహాన్ని, సుందర స్వరూపాన్ని మన ముందు సాక్షాత్కరింపజేస్తుంది. సుప్రభాంతో కూడి ఉండడం ఒక కొసమెరుపు.
ఈ నక్షత్ర పూజ చేస్తే ముందు మన మనస్సు హనుమకు పూజా సుమమై అర్పితవౌతుంది. ఆ పిదప మనమే హనుమంతులవారిమన్న ధీమా వస్తుంది. హనుమగా మారి రామనామ స్మరణ చేస్తుందా మనస్సు.
జయత్యతి బలోరామో లక్ష్మణశ్చ మహాబలః
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాభిపాలితః
దాసోహం కోసలేంద్రస్య రామాస్యా క్లిష్ట కర్మణః
హనూమా ఞ్ఛత్రు సైన్యానాం నిహంతా మారుతాత్మజాం.
శ్రీరామాచరణారవిందార్పణం-

- డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి