Others

పండిత శిక్షణకు పక్క రాష్ట్రాలే దిక్కు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుభాష పండుగను దిగ్విజయంగా నిర్వహించారు. తెలంగాణ కీర్తిని తెలుగు ప్రపంచ మహాసభల ద్వారా ప్రపంచానికి చాటిచెప్పారు. స్వయంగా కవి, రచయిత, విద్యావేత్త అయిన ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రిగా పరిపాలన సాగిస్తుండడం అదృష్టమని చాలామంది భావిస్తున్నారు. అయితే ప్రభుత్వ విధానమో, అధికారుల తప్పుడు సమాచారమో తెలియదు కానీ గత మూడు సంవత్సరాలుగా తెలంగాణలో భాషా పండిత శిక్షణ కళాశాలలు మూసివేశారు. దాదాపు 11వేల మందికి శిక్షణ నిలిచిపోయింది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. తెలంగాణలోని 31 జిల్లాల్లో 22 తెలుగు పండిట్ ట్రైనింగ్ కళాశాలలు, 27 హిందీ పండిట్ శిక్షణ కాలేజీలు, ఒక ఉర్దూ పండిట్ శిక్షణ కళాశాల ఉన్నాయ. తెలుగు భాష పరిరక్షణ కోసం ఎన్నో వినూత్న పథకాలను ప్రవేశపెట్టబోతున్న తెలంగాణ ప్రభుత్వం లాంగ్వేజి పండిట్ ట్రైనింగ్ (ఎల్‌పిసెట్) నోటిఫికేషన్లను వేయడం లేదు. 2015-18 సంవత్సరాలు జీరో సంవత్సరాలుగా మారాయి. మూడేళ్ల నుంచి తెలుగు, హిందీ, ఉర్దూ భాషల్లో శిక్షణ ఇచ్చే కళాశాలలకు తాళాలు పడ్డాయి. ఆయా కళాశాలల్లో ఉద్యోగాలు చేసి ఉపాధి పొందుతున్న 5వేల మంది నిరుద్యోగులు బజారున పడ్డారు. ప్రభుత్వం నుంచి నేడో రోపో అనుమతి లభిస్తుందనే గంపెడు ఆశతో లాంగ్వేజ్ శిక్షణ కళాశాల యాజమాన్యాలు లక్షలాది రూపాయల అద్దె చెల్లించి భవనాలను ఉంచుకున్నారు. టిపిటి, హెచ్‌పిటి కళాశాలలు దాదాపు 20 వరకు అద్దె భవనాల్లోనే ఉన్నాయ. తెలంగాణ ప్రభుత్వం ఎడ్‌సెట్, లాసెట్, ఎంసెట్, ఎంబిఎసెట్, డైట్‌సెట్, పాలిసెట్ వంటి అన్ని నోటిఫికేషన్లు ఇస్తోంది. కానీ ఎల్‌పిసెట్ మాత్రం నిర్వహించడం లేదు. ఇలా ఎందుకు చేస్తున్నదో తెలియడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అప్పులపాలై 43 భాష శిక్షణ కళాశాలలు మూతపడ్డాయి. 1995కు ముందు తెలంగాణ జిల్లాల నుండి గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి వంటి పట్నాలకు వెళ్లి శిక్షణ పొందవలసి వచ్చేది. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితి ఏర్పడుతోంది.
ప్రతి సంవత్సరం 1700 మంది తెలుగు, 2050 మంది హిందీ, 50 మంది ఉర్దూ కళాశాలల్లో శిక్షణ పొందేవారు. ఒక్కో ఏడాది 3800 మంది చొప్పున మూడేళ్లలో 11,400 మంది శిక్షణను పూర్తి చేసుకునేవారు. కానీ పాలకుల విధానం వల్ల భాష శిక్షణ మూలన పడింది. ఈ విషయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఎల్‌పిసెట్ నిర్వహించాలని కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేదు. 2014 నుంచి ఆయా కళాశాలలకు ఫీజు రీయెంబర్స్‌మెంటు కూడా చెల్లించలేదు. సర్ట్ఫికెట్లు రాక శిక్షణ పొందిన విద్యార్థులు నష్టపోతున్నారు. మూడేళ్లుగా ఆగిపోయిన పండిత శిక్షణ కార్యక్రమం మళ్లీ గాడిలో పడితే పొరుగు రాష్ట్రాలపై ఆధారపడే అవకాశం ఉండదు. భాషపై మమకారం కేవలం మాటల్లో కాకుండా ఆచరణలో కూడా చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. తక్షణం ఎల్‌పిసెట్ నోటిఫికేషన్ ఇచ్చి పండిత శిక్షణ కార్యక్రమం మళ్లీ మొదలుపెట్టాలి.

-రావుల రాజేశం