Others

దివ్యపథగామిని ..మార్గళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ర వి, ధనుర్రాశిలో ప్రవేశించినపుడు వచ్చేది- ధనుర్మాసం. ధనూరాశికి అధిపతి - బృహస్పతి. జ్ఞానప్రదాత ఈ మాసంలో జగన్మాత గోదాదేవిగా విల్లి పుత్తూరులోని విష్ణుచిత్తునికి పూదోటలో లభ్యమైంది. ఆ విష్ణుచిత్తునికి తన ఆటపాటలతో అలరించింది. తనభక్తుని కోర్కె ఆ విధంగా తీర్చిందా తల్లి. ఇక పరమాత్మ తన దైవం అయన స్వామిని భక్తవత్సలతను ప్రకటించడానికి విష్ణుచిత్తుని నోటి నుండి ప్రతిరోజు విష్ణుకథలను వినేది. తాను హరికథల పట్ల ఆకర్షితురాలవుతున్నట్టు విష్ణుచిత్తుని భ్రమింప చేసింది. ఆ తరువాత తన తండ్రితో పాటు ఈ మానవులం దరికీ మార్గోపదేశం చేసి పరమాత్మ పై మనసును ఎలా నిలపాలో చెప్పాలని తలిచింది. ఆ తల్లి తనకు తానై తులసిని, పూలను సేకరించి మాలలు కట్టి తాను ధరించి వాటిని ఆ రంగని సేవకు పంపేది. అంతేకాదు ఆ తల్లి ద్వాపరయుగం లోని గోపికలు చేసిన కాత్యాయని వ్రత నెపంతో తాను కూడా మార్గళి వ్రతాన్ని చేసి చూపించింది. గోదా దేవి ప్రేమకు వశుడైన రంగనాథుడు విష్ణుచిత్తునికి స్వప్న దర్శనమిచ్చాడు. తానేనీకు అల్లుడిని అవుతానని మాటిచ్చాడు. రంగడు చెప్పినట్లుగా నే విష్ణుచిత్తుడు తన తనయ గోదాను వధువుగా అలంకరించి వివాహమహోత్సవాన్ని జరిపించాడు. ఆరోజు భోగాలను అందించిన భోగి పండుగ. ఆతల్లి విష్ణుదేవుని హృదయ పీఠాన్ని అలంకరించింది. అధివసించిన ఆ తల్లి విష్ణువుతో కూడా మానవులందరికీ ఆశీస్సులను అందచేసింది ఆ గోదాకల్యాణానే్న స్మరించుకుంటూ ప్రతి ధనుర్మాసంలో కన్యలే కాదు ప్రతివారు గోదాపాశురాలను అనుసంధానిస్తారు. .గోదా రంగనాథుల అనుగ్రహం కావాలనుకొన్నవారంతా మార్గళీ వ్రతాచరణులు కావాలి. అపుడే ఆ తల్లి తత్వం అర్థమవుతుంది. భగవంతుని సాయుజ్యం లభ్యమవుతుంది. మానవునిగా పుట్టి దివ్యాచరణలతో మసలిన ప్రతివారికి విష్ణుసన్నిథి సులభంగా అందుతుంది.

- వాణి