Others

గృహస్థాశ్రమంలోనే ఓర్పు, క్షమ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మీ ధర్మపత్ని, మీవారసులు వీరందరికీ మీరు చేయవలసిన కర్తవ్యాన్ని విడిచి మీరుతపస్సులో ఉన్నందువల్ల మీకు తెలియకుండానే మీలో అసహనమూ, కోపం వచ్చింది. మీరు తపశ్శక్తిని సాధించినా కోపాన్ని జయించలేకపోయారు. మీ కర్తవ్యాన్ని నిర్వర్తించి ఉంటే, గృహసాథ్రశమంలో మీరు ఉండి ఉంటే మీలో సహనం, క్షమ, ఓర్పు అనేగుణాలు వచ్చి ఉండేవి. దానివల్ల మీకు ప్రశాంతి కలిగేది అంటూ ధర్మవ్యాధుడు ఎన్నోవిషయాలు కౌశికునకు చెప్పాడు.
ఓర్పు, క్షమ, లేకపోతే ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా, ఎన్ని పుణ్యకథలు విన్నా, ఎంత తపస్సు ఆచరించినా కూడా అది మంచి ఫలితాన్ని ఇవ్వవు. ఓర్పు లేనందున తృటిలో కోపం కలిగి ఆ కోపం వల్ల వివేకం నశించి చివరకు చేసుకొన్న పుణ్యాన్ని కాస్త కోపం చెరిపేస్తుంది.
నిజమే కాని, ఇంత ధర్మం తెలిసి ఉండి పరధర్మాన్ని ఎందుకు ఆశ్రయించారు. అది ఎపుడో నాకు చెప్పండి అని అడిగిన కౌశికునకు ధర్మవ్యాధుడు తన పూర్వజన్మ గురించి చెప్పనారంభించాడు.
పూర్వజన్మలో నేనొక బ్రాహ్మణుడిని. నేను వేదం చదువుకున్నాను. నా వృత్తివిద్యను పూర్తిగా నేర్చుకున్నాను. కాని, నాకు ఆ రాజ్యమేలే రాజు, కుమారుడు నాస్నేహితుడు. అతనితో కలసి నేను ధనుర్విద్యను కూడా నేర్చుకున్నాను. ఆ ధనుర్విద్య వల్ల రాజకుమారుడు నేను ఒకరోజు మృగయావినోదానికి వెళ్లాము. అక్కడ మేమిద్దరమూ ఎన్నో జంతువులను చంపాము. ఎంతో ఆనందంగా తిరిగాము. చివరలో శబ్ద్భేది విద్యతో నేనొక బాణ ప్రయోగం చేశాను. ఆ బాణం వెళ్లిన కొద్దిసేపటికే ‘‘అమ్మా’’అన్న కేక విని నేనూ రాజకుమారుడు పరుగెత్తి వెళ్లాము.
అక్కడ జరగరాని ఘోరం జరిగిపోయింది. నేను వేసిన బాణం ఒక మునివృత్తిని అవలంబించి తపస్సు చేసుకొంటున్న తపశ్శాలికి తగిలింది. అతడు నన్ను చూడగానే క్రుద్ధుడయ్యాడు.
ఒక సద్బాహ్మ్రణ వంశంలో జన్మించికూడా శూద్రుని వలె వ్యవహరించావు కనుక నీవు మాంసాన్ని విక్రయిస్తూ జీవించెదవు కాక అని శపించాడు.
నేను విచారగ్రస్తుడినయ్యాను. వేదనతో ఆ తాపసి ఎన్నోవిధాలుగా వేడుకున్నాను. నా తప్పిదాన్ని మన్నించమని అడిగాను. కాని చేసిన తప్పుకు శిక్ష అనుభవించాల్సిందే గదా
ఆ శాపఫలితమే ఈ ధర్మవ్యాధుని జన్మ. కాని ఈ ధర్మవ్యాధుని పుట్టుకకు మరో కారణమూ ఉంది.
కారణం లేనిదే కార్యం లేదు కనుక ఆ ముని నాకు ఒక వరాన్ని చ్చాడు. నీవొక దేశపు రాజుగా కూడా పుట్తావు. ధర్మవ్యాధునిగా ఉన్నప్పుడు నీకు తల్లిదండ్రులకు సేవ చేసుకొనే భాగ్యం దొరుకుతుంది. నీకు పూర్వజన్మ జ్ఞానముండి ధర్మసూక్ష్మగ్రహణ చేయగల శక్తి ఉంటుందని ఆ ముని నాకు వరాన్నిచ్చాడు. కౌశికుని మనసు చదివేశక్తి ఉన్న ధర్మవ్యాధుడు 3అయ్యా నేను రాజుగా ఏమి చేశానో కూడా మీకు నేను వివరిస్తున్నాను అని కౌశికుడు ఇంకా ఏమీ అడగకముందే చెప్పాడు.
ఎదుటివారి మనస్సు చదివే శక్తి నాకు తల్లిదండ్రులసేవ వలనే వచ్చింది మునివర్యా అని ధర్మవ్యాధుడు కౌశికునికి వివరణ ఇచ్చాడు.

- రాయసం లక్ష్మి