Others

ఇరవై ఏళ్లనాటి మాట...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

క్లాప్ కొట్టిన రెండు దశాబ్దాలకు సినిమా రిలీజ్ అయినట్టు, రెండు దశాబ్దాల క్రితం చెప్పిన రాజకీయ రంగ ప్రవేశం ముహూర్తం ఇప్పటికి ఖరారైనట్టే. అది కూడా వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి, అంటే సాధారణంగా అయితే మరో మూడేళ్ల తరువాత పూర్తి పిక్చరు వస్తున్నట్టు. ఈలోగా సినీ పరిభాషలో చెప్పాలంటే ప్రీ ప్రొడక్షన్, రీరికార్డింగ్, ట్రైలర్ రిలీజు.. అంతేనన్నమాట. ఏదైమైనా సినీ ‘బాషా’ వాడుతున్న రాజకీయ పరిభాష ఎంతో తాజాగా అనిపిస్తూ వీనులకు హాయిగా ఉంది. ఆ విషయంలో ఆయనకు అభినందనలు. ఈ మధ్యకాలంలో రాజకీయ భాష పూర్తిగా దిగజారిపోయింది. భాష మాత్రమే కాదు, భావజాలం కూడా. తమిళనాడులో మరీనూ. వ్యక్తిగతంగా సమగ్రత, మంచితనం ఉన్న వ్యక్తిగా రజనీకి ఇమేజ్ ఉంది. అభిమానుల బలంతోపాటు ఆయన రాకకి వాతావరణం కూడా అనుకూలంగానే ఉన్నట్టుంది. జయలలిత మరణం తరువాత ఏఐడీఎంకే నాయకత్వ లేమితో ఉంది. డిఎంకే బలంగానే ఉన్నా కొంత అన్నదమ్ముల పోరు, మరికొంత అధికార లేమివల్ల వచ్చే ఇబ్బందుల్లో ఉంది. బీజేపీ, కాంగ్రెస్‌లవి గౌరవ అతిథి పాత్రలే అక్కడ, పైగా ఈ మధ్య అవినీతి, బంధుప్రీతి, కుర్చీ కుమ్ములాటలు, హస్తిన తోలుబొమ్మలాటలతో అక్కడి ప్రజలు విసిగిపోయి ఉన్నారు. కాబట్టి రజనీ రంగప్రవేశానికి ఇంతకుమించిన ముహూర్తాల్లేవు. లేటు చేస్తున్నకొద్దీ అధికమాసాలు, మూఢమాసాలే. అయితే రజనీ కొన్ని విషయాల్లో మరింత స్పష్టతనివ్వాలి. ఆయన ఆదర్శాలకు కార్యాచరణ చూపగలగాలి. ఏ మతంతోనూ సంబంధం లేని ఆధ్యాత్మిక రాజకీయాలు పరిచయం చేస్తామంటున్నారు. అదెంతమేరకు సాధ్యం? మత ప్రభావాలకు దూరంగా ఉన్న హేతువాదాల రాజకీయాలదే పైచేయి అక్కడ. రజనీ రాజయోగ ముద్రలుగానీ, హిమాలయ యాత్రలుగానీ ఆయన్ని భక్తిపరుడైన హిందువుగానే చూపిస్తాయి. అయినా మతం వ్యక్తిగతం, అందరి శ్రేయస్సు కోరే ఆధ్యాత్మికత ఆయన మంత్రం అన్నది నిర్ద్వంద్వంగా చెప్పగలిగే, చూపగలిగే ప్రవర్తన కావాలి. సమయం తక్కువ కావున అసెంబ్లీ ఎన్నికల వరకూ పోటీ చెయ్యనంటున్నారు. అయితే అక్కడ నెలకొన్న పరిణామాల దృష్ట్యా ఎన్నికలు ఎప్పుడైనా ముంచుకురావొచ్చు. ఆయన సిద్ధంగా ఉండాల్సిందే. తాను రాజకీయాలు మాట్లాడనంటున్నారు. తిట్లు, శాపనార్థాలు, దిగజారుడు వ్యాఖ్యలు నిషిద్ధమైతే ఓకే కానీ ఏమీ మాట్లాడనంటే అది నష్టదాయకమే. దిశానిర్దేశం అవసరమైన చోట చెయ్యాల్సిందే. ఏమైనా రజనీకాంత్ రాక తమిళనాడు రాజకీయాలను మేలిమలుపు తిప్పాలని ఆశిద్దాం.

-డా. డి.వి.జి.శంకరరావు, పార్వతీపురం