Others

లక్కీ ‘న్యూ ఇయర్’ పాప! (వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొత్త సంవత్సరం 2018లో అర్థరాత్రి చెవులు చిల్లులు పడే హ్యాపీ న్యూఇయర్ కేక్‌లమధ్య బంగలూరులోని రాజాజీనగర్‌లోని డాక్టర్ నాగరాజా మెమోరియల్ ఆసుపత్రిలో పుష్పా అనే మధ్యతరగతి ఇల్లాలు ఆడపిల్లకి జన్మనిచ్చింది. బాలిక క్యార్ క్యార్‌లే హ్యాపీ న్యూఇయర్ అనుకున్నారు కాని, తండ్రి ఎం.గోపి మొహం అంత వికసించలేదు కాని, మర్నాడు పొద్దునే్న సిటీ మేయర్ గారొచ్చారు పాపని చూద్దామని. తల్లి సంభ్రమాశ్చర్యంగా పాపని అందించింది. మేయరు వెనుకనే డిప్యూటీ మేయరమ్మ కూడా లక్ష్మి పుట్టింది అని ముద్దాడారు. నా బొంద అనుకున్నాడు తండ్రి. కాని మేయరుగారు ఐదు లక్షల రూపాయల చెక్కుని ప్రెజెంటు చేశారు.. దీని చదువుకోసం అన్నారు.
ఆసుపత్రి అంతా సంతోషించారు. అసలు సంగతి ఏమిటీ అంటే- న్యూ ఇయర్ ఘడియలతోనే మునిసిపల్ పరిధి ఆసుపత్రిలో పుట్టిన ఆడపిల్లలకి ఐదు లక్షల ఎడ్యుకేషనల్ సాయం నగదుగా ఇస్తామని, బృహన్ బంగాలూరు మునిసిపల్ అధికారులు ప్రకటించారు. ఈ పైకం పేరెంట్స్ కమిషనరుల జాయింట్ అకౌంట్లో వేశారు. బళ్ళో వేశాక ఇస్తారు. అదృష్టలక్ష్మి అని పేరెట్టండి అన్నారంతా..