Others

కలవరపెడుతున్న కుల ఘర్షణలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భారత సమాజం అభివృద్ధి కుల నిర్మూలనతోనే సాధ్యమని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. ఆధునికత పెరిగేకొద్దీ కులం గోడలు బలహీనపడతాయని ఆశించారు. అయితే దురదృష్టవశాత్తూ దేశం ఆ దిశగా పనియంచడం లేదు. అందుకు పూర్తి వ్యతిరేక దిశలో కుల స్థిరీకరణ దిశగా సాగుతోంది. కులాన్ని కానీ, మతాన్ని కానీ ఒక అస్తిత్వ చిహ్నంగా భావించినంతవరకూ ఏ గొవడా లేదు. ఎవరి అభిప్రాయం వారిది అని సరిపెట్టుకోవచ్చు. అయితే ఆ పేరుతో సమాజంలో ద్వేషం పెరిగేలా చర్యలుంటే సామాజిక శాంతికి భంగకరం. అలాంటి పెడ ధోరణులు తలెత్తకుండా ప్రభుత్వాలు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ప్రభుత్వాల్ని నడిపే పార్టీలకు గానీ, ఎదురు నిలిచే పార్టీలకు గానీ ఆ చిత్తశుద్ధి లేదు. రాజకీయ పక్షాలు నిలవడానికైనా, నడవడానికైనా కులం అన్నది ఒక ఊతకర్రలా తయారైంది. అభివృద్ధి, సేవ తదితర మార్గాల ద్వారా మనగలగడం కన్నా, సులభమార్గంలో కులాల కూడికలు, తీసివేతల కార్యక్రమాల ద్వారా అధికారం అందుకోవడమే ముఖ్యమైపోయింది. అందువల్ల దేశాన్ని కుల నిర్మూలన దిశగా ముందుండి నడపించాల్సిన రాజకీయ పార్టీలు, బాధ్యతారహితంగా కులాల కుంపట్లను రాజేసి, తాత్కాలికంగా చలి కాచుకుంటున్నాయి. దేశానికి శాశ్వత నష్టాన్ని కలుగజేస్తున్నాయి. ఉపాధి అవకాశాలు తగ్గినప్పుడు సాధారణంగానే పౌరుల్లో అభద్రత నెలకొంటుంది. విద్య, ఉద్యోగ అవకాశాలు అందరికీ పెంచేందుకు అవసరమైన వనరులు దేశంలో ఉన్నాయి. అవినీతి లేకుండా, సమర్ధవంతంగా వనరుల్ని ఉపయోగించుకోగలిగితే దేశంలో అందరికీ అభివృద్ధి ఫలాల్ని అందజెయ్యొచ్చు. ఆ రకమైన భరోసా ప్రభుత్వాలు ప్రజల్లో కలిగించాలి. ఆ నమ్మకం లోపించడం వల్లనే అభివృద్ధి చెందిన వర్గాలు కూడా రిజర్వేషన్ల కోసం అడిగే పరిస్థితులు ఉత్పన్నవౌతున్నాయి. సామాజిక సమానత్వం సాధించడానికి ఉద్దేశించబడిన వెసులుబాట్లు రాజకీయ పక్షాల హామీలుగా మారుతున్నాయి. ఈ ధోరణి ప్రమాదకరం. మహారాష్టల్రో కోరేగాం సంబంధిత ఆందోళనలు పూర్తిగా నివారించతగ్గవి. నిష్పక్షపాత ధోరణిలో, కొంచెం ముందుచూపుతో అక్కడి ప్రభుత్వం వ్యవహరించి వుంటే సమస్య ఏర్పడేదే కాదు. దళితులు, అగ్రవర్ణాలకు చెందినవారి మధ్య 200 క్రితం జరిగిన యుద్ధంలో అసువులు బాసిన నిమ్నవర్గాల వారి స్మృతిగా నిర్వహించే వార్షిక కార్యక్రమం ఇన్నాళ్లూ చడీచప్పుడూ లేకుండా సాగిపోయేది. కానీ ఇప్పుడే ఎందుకు వివాదంగా మారింది. స్థానికంగా ఉన్న దళిత, అగ్రవర్ణాల మధ్య విభేదాలు, రాజకీయాలు, ఉపాధి కల్పనలో అంతరాలు వివాదానికి ఆజ్యం పోశాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో మహారాష్ట్ర ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యలు తీసుకుని ఉంటే పరిస్థితి ఇలా మారేది కాదు. సమాజంలో కుల, మతాల వారీ గొడవలు పెరగకుండా ఉండాలంటే ముందుగా రాజకీయ పక్షాల ఆలోచనా దృక్పథంలో మార్పు చాలా అవసరం.

-డా.డి.వి.జి.శంకరరావు