Others

పాపమే రోగంగామారవచ్చుసుమా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నాళ్లు గడిచినా, ఎన్ని జన్మలెత్తినా కూడా పాపరాశి అట్లానే ఉంటూ ఉంటుంది. ఎంత పుణ్యం చేసినా ఆ పుణ్యానికి ఫలితం ఇచ్చినట్లే విధి పాపానికి శిక్ష అనుభవించమనే చెబుతుంది.
కాశ్మీర దేశానికి రాజు బహు ధర్మవేత్త అని ప్రజల చేత కీర్తించబడేవాడు. అతడు తన రాజ్యాన్ని సర్వ సుభిక్షంగా ఉండేట్లుగా పాలన చేశాడు. అతడు సర్వసుఖాలను పొంది తన కొడుకు యవ్వనంలోకి వచ్చాడని అతడికి వివాహాది కార్యాలను జరిపించాడు. ఇక తాను వాన ప్రస్థాశ్రమానికి వెళ్తానని చెప్పి రాజ్యాన్ని తన కుమారునికి అప్పగించాడు.
వనాలకు వెళ్లి వాసుదేవ మంత్రాన్ని జపిస్తూ కూర్చున్నాడు. మనసు చిత్తాన్ని ఏకాగ్రం చేసి నిశ్చలస్థితిలో వాసుదేవ మంత్రాన్ని జపించసాగాడు. ఉన్నట్టుండి అతని శరీరంనుంచి ఒక వికృతరూపుడు బయటకు వచ్చాడు. అతడు కాశ్మీర రాజును తాను ఏం చేయాలో చెప్పమని అడిగాడు. ‘అసలు నీవు ఎవరు? ఎక్కడ్నుంచి వచ్చావు?’అని అడిగాడు.
అపుడు ఆ వికృత రూపుడు.
‘అయ్యా నేను బ్రహ్మహత్యాపాతకాన్ని. నీవు క్రితం జన్మలో పౌండ్రక వంశంలో రాజుగా పుట్టావు. అపుడు బ్రహ్మస్థాన పురం అనేది నీ రాజధానిగా ఉండేది. అపుడు నీవు ఒకరోజు వేటకు వెళ్లి ఒక ముని నదిలో నీరు ముంచడాన్ని లేడి నీరు త్రాగడమని భ్రమపడి ఆ మునిని చంపితివి. ఆ పాపాన్ని పొగొట్టుకొనడానికి ఎన్నో పూజలు చేశావు. కాని ఆ పాపరాశి తగ్గింది కాని నీకు ఉదరశూల రోగంగామారి నీ శరీరంలోకి చేరింది. ఆ ఉదరశూలంతో నీవు అనేక బాధలు పడ్డావు. ఆతరువాత నీ అంత్యదశలో ప్రాణాలు పోతుండగా మాత్రం నీ భార్యయైన నారాయణీ ని పిలవాలన్న నెపంతో పదిసార్లు ఆ నామాన్ని పలికావు. అంతలో నీ ఆయుష్షు అయిపోయింది. కాని నేను నిన్ను ఆక్రమించుతుండగా విష్ణుదూతలు వచ్చి నన్ను మోది నిన్ను వైకుంఠానికి తీసుకొని వెళ్లారు. తరువాతి జన్మలో బ్రాహ్మణుడుగా పుట్టావు. కాని అపుడు కూడా నీవు బ్రాహ్మణుడివైనా నీ ధర్మాన్ని పక్కన పెట్టి వేటకు వెళ్లావు. చేసిన తప్పునే చేశావు’ అని ఆ కర్మఫలం చెప్పింది. అదిగో ఆ బ్రహ్మహత్యాదోషం వల్లనే నాకీ జన్మ వచ్చింది. కాని నేను చేసిన పుణ్యకార్యాచరణ వల్ల నాకు పూర్మజన్మ స్మృతి ఉంది. కనుక ఈ జన్మలో నేను ఎంతో జాగ్రత్తగా ఉన్నాను. ఎవరి ధర్మాన్ని వారు ఆచరించాల్సిందే. ఇతరుల పట్ల సమబుద్ధితో వ్యవహరించాలి. అన్ని ప్రాణులను పరమాత్మ స్వరూపంగానే చూడాలి. మానవత్వంతో చరించాలి. అపుడే మానవ జన్మకు ప్రయోజనం కలుగుతుంది. కాని కేవలం పూజలు పునస్కారాలు వల్ల పాపరాశి దగ్ధమవదు. ఒకవేళ తీవ్రత తగ్గుతుందేమోకాని పాపాభారాన్ని మాత్రం మోయవలసిందే. పశ్చాత్తాపపడి తిరిగి ఎటువంటి చెడు పనులు చేయకుండా ఉండడమే పాపరాశిని తగ్గించుకొనే ఉపాయం అని ధర్మవ్యాధుడు కౌశికునకు చెప్పాడు. కౌశికుడు ‘అయ్యా! ధర్మవ్యాధా! నీ జన్మల వృత్తాంతాన్నంతావిన్నాను. నాకు నేను చేయవలసిన విధి ఏమిటో తెలసింది. కనుక ఇప్పట్నుంచి నాకర్తవ్యాన్ని నేను విస్మరించకుండా నా జీవనగమనాన్ని నేను నిర్దేశించుకుని ప్రయాణాన్ని చేస్తాను’అని చెప్పి కౌశికుడు నిష్క్రమించాడు. ధర్మవ్యాధుని కాలం అయిపోయిందని వైకుంఠ వాసులు వచ్చి స్వర్గానికి ధర్మవ్యాధుని తీసుకొనివెళ్లారు.
*
ఇంకా ఉంది

- డా. రాయసం లక్ష్మి