Others

మితంగా ఉన్నపుడే హితం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు
యుక్తస్వప్నా బోధస్య యోగో భవతి దుఃఖహా
... గీత చెప్పినట్లుగా మితాహారము, కర్మలందు మితమైన ప్రవర్తన, మితమైన నిద్ర ఏదైనా మితంగా ఉన్నపుడే హితంగా ఉంటాయి. అదేపనిగా నిద్రపోయినా, తిన్నా, తాగినా, తిరిగినా కూడా మంచికన్నా చెడు ఫలితాలే వస్తాయి. అట్లానే పూజలు పునస్కారాలు కూడా మితంగానే ఉండాలి. భగవంతుని పూజ అంటే కేవలం పూలు పండ్లు నివేదనలతోను, లేక అష్టోత్తర శతనామాలతోనో అట్టహాసంగా కైంకర్యం చేయడమే కాదు తోటివారిపట్ల దయాదాక్షిణ్యాలు కలిగి ఉండడమూ భగవంతుని సేవే అవుతుంది. మానవత్వాన్ని మరిచిపోకుండా తన ఎదుటివారి బాధను పోగొట్టడానికి తాను కూడా సహాయపడితే అదే భగవంతుని సేవ అవుతుంది. ఈ విషయానే్న రామాయణంలో లక్ష్మణ, హనుమన్నలు చెప్పారు. భారతంలోను ఈవిషయమే ఉన్నా అక్కడ కర్ణుని ద్వారా ఎవరికి ఏ సేవ చేయకూడదో మనకు తెలుస్తుంది. మంచివారికి ఏ సేవ చేసినా అది మంచి ఫలితాన్ని ఇచ్చి మనజీవితాన్ని కూడ ఉజ్వలంగామారడానికి సాయం చేస్తుంది. అదే చెడునడతకలిగిన వారికి మనం సాయం చేస్తే వారితోపాటుగా మనలను అథఃపాతాళానికి తీసుకొని వెళ్తుంది. అందుకే సేవ కూడా ఆలోచించి అర్హత కలిగిన వారికే సాయం చేయాలి.