Others

కష్టమైనా, సుఖమైనా కృష్ణనామమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాళ్లందరినీ చూసి బ్రహ్మాది దేవతలు పుష్పవృష్టి కురిపించారు. ఆహా ఈ గోపాలుర అదృష్టమే అదృష్టం. పరమాత్మకు వీరికి ఏమాత్రం భేదం లేదు సుమా అనుకొన్నారు. రంభాదులు ఆనందంతో నృత్యం చేస్తున్నారు.
గోపబాలురంతా కృష్ణుని మెచ్చుకుంటూ ఆ చచ్చిన అఘాసురుని తిట్టుకుంటూ తమ నివాసాలకు చేరారు. వారి తల్లులతో కృష్ణుని గొప్పతనాన్ని వర్ణించి వర్ణించి చెప్పారు. పెద్దలు జరిగిన విషయం తెలుసుకొని అయ్యో ఎంతో ముప్పు తప్పినట్లు ఉంది. లేకుంటే ఆ కొండ చిలువ నోటిలోకి మన పిల్లలంతా వెళ్లిపోయారు. ఏదేవుడో మనలను కాపాడాడు. మన వంశాన్ని నిలిపాడు అనుకొన్నారు. ఎవరికి వారు దేవాదిదేవునికి కృతజ్ఞతలు చెప్పారు.
తమ పిల్లలకు దిష్టి తీసేశారు. ఎంత దూరం వచ్చి నివసిస్తున్నా కూడా ఇంకా రాక్షసుల పీడ వదలనందుకు బాధపడ్డారు. యశోదమ్మకూ కృష్ణుని జాగ్రత్తలు చెప్పారు. బలరామకృష్ణులు చేసిన వైనాన్ని విన్న రోహిణీ యశోదలు ఎంతో బాధపడ్డారు. తమ పిల్లలను ఆ దేవుడే కాపాడాడు అనుకొంటూ వారికి దిష్టి తీసేశారు. ఎన్నో జాగ్రత్తలు చెప్పారు. రేపట్నుంచి మీరు అడవికి వెళ్లకండి. మేమే పెద్దవారిమే వెళ్తాం అన్నారు. కాని పిల్లలంతా ఎంతో గొడవ చేశారు. ఇక మాకు ఆడుకునేది అంటూ ఏదీ ఉండదని వాపోయారు. కృష్ణబలరాములు కూడా తాము ఇక ఏదైనా ఆపద వస్తే పరుగెత్తుకుంటూ మీ దగ్గరికి వచ్చేస్తాము. కాని మమ్ములను పశువులు మేపడానికి పంపకుండా ఉండవద్దు అని బతిమాలుకున్నారు. మేము ఎల్లప్పుడూ మీ దాపులల్లోనే ఉంటామని చెప్పారు. నానావిధ విషయాలు పెద్దలకు చెప్పి వారిని తిరిగి వీరు పశువులు మేపడానికి ఒప్పించారు. తెల్లారింది. గోపబాలురలో ఎంతో సంతోషం వచ్చింది. ఇక బలరామ కృష్ణులతో కలసి హాయిగా తిరగవచ్చు అని అనుకొన్నారు. కృష్ణా అన్న పిలుపుతోవారు సూర్యునికి నమస్కరించారు. కృష్ణుడు కూడా లేచీ లేవగానే వేణువును ఊదాడు. అందరి మనస్సులూ తేలిక అయ్యాయి. చల్ది మూటలు కట్టించుకొని వాటిని భుజాన తగిలించు గోపాలురంతా అడవికి బయలుదేరారు. వారు గోవులతో సహా ఆడుతూ పాడుతూ వెళ్తున్నారు. వారికి దారిలో నెమళ్ల క్రేకారాలు వినిపించాయి. కృష్ణుడు అదిగో మయూరాలు మనలను పిలుస్తున్నాయి అంటూ వాటిలాగే క్రేకార ధ్వనిని చేస్తూ ముందుకు వెళ్లాడు. కృష్ణునికి బదులుగా నెమళ్లు క్రేకారాలు చేస్తున్నాయి. వాటితో పాటు గోపబాలురు అరుస్తున్నారు. ఆనందంతో కేరింతలు కొట్టుతున్నారు. దీన్ని చూసిన రామచిలుకలు, ఇతర పక్షులన్నీ వాటి వాటి అరుపులతో కృష్ణనామాన్ని పలుకుతున్నాయి. వాటికి బదులుగా కృష్ణుడూ వాటి అరుపులలాగే తాను అరుస్తూ ముందుకు వెళ్తున్నాడు. బలరాముని చూస్తూ కృష్ణుడు ‘అన్నా! చూశావా! ఈ వృక్షరాజం నీకు నమస్కరిస్తోంది. తాను పండిన పండ్లుతినమని వంగుతోంది. తన ఫలాలను కోసుకోమని చెబుతోంది. మమ్ము కరుణించావా ’అని అడుగుతున్నట్లే అనిపిస్తుంది అంటూ ఎన్నో విషయాలు మాట్లాడుకుంటూ పోతున్నారు. వారికి ఉన్నట్టుండి మంచి మాగిన తాటిపండ్ల వాసన ముక్కుపుటాలకు తగిలింది. ‘అబ్బా! ఎంత మంచి తాటిపండ్ల వాసన వస్తోంది. ఎక్కడ్నుంచి ’అంటూ వారు మరింత వడివడిగా అడుగులు వేస్తూ ముందుకు పోతున్నారు. అపుడు శ్రీదాముడు అన్న గోపాలుడు ముందుకు వచ్చాడు.
* * *

- చరణ శ్రీ