Others

పురుషోత్తమన్‌కి ఎనిమిదిమంది! (వార్తావాఖ్య )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాలేజీ లెక్చరర్‌గా ‘వెళ్లొర్’ (తమిళనాడు)లో పనిచేస్తున్న శ్రీమతి ఇందిరా గాంధీ (45) తన మొగుడు పేరు పురుషోత్తమన్- తన సొమ్ము కోటిన్నర రూపాయలు పట్టుకొని ఉడాయించాడని ఫిర్యాదు చేసింది. అంతలో మరో కుముదవతి తన భర్త (57) ఒక సివిల్ కేసులో తాను గెలిస్తే 17 కోట్ల రూపాయలు వస్తాయని చెబితే- పొలాలన్నీ అమ్మేసి మూడు కోట్ల రూపాయలు ఇచ్చి పంపానని మొత్తుకుంటున్నది. నిజానికి పురుషోత్తమన్‌కి సంపన్న వనితల్ని- ముఖ్యంగా విడాకులవాళ్ళని, వితంతువుల్ని బురిడీకొట్టించే సమ్మోహన శక్తి పుష్కలంగా వుంది, అతని అసలు భార్య పోయింది. పద్ధెనిమిది ఏండ్ల కూతురు, వృద్ధమాతా వున్నారు. కానీ వేరే బిజినెస్ విఫలం కాగా కోయంబత్తూరులో వున్న ఒక మ్యారేజీ బ్యూరోని పట్టాడు. దాన్ని నడిపించే వనజా, మోహన్‌లు, వీడూ తోడుదొంగలు అయ్యారు. బాగా డబ్బున్న స్ర్తిలను- తానొక బడా వ్యాపారిని అని అలా ఇలా మభ్యపెట్టి పెళ్లి చేసుకునేవాడు. ఆనక బుడబుడ దీర్ఘాలు తీసి- ఇంత పైకంతో అప్పులు తీరిస్తే మనకి అంత రెట్టింపు సొమ్ములు వస్తాయని బురిడీ కొట్టించి జెండా ఎత్తేసేవాడు. పేరుకి కోయంబత్తూరులో అతనికి ఒక ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ వుంది. కాని అసలు బిజినెస్సు ‘పెళ్లిచేసుకుని ఆస్తి గుంజుకొని హాయిగా జీవించోయ్.. నువ్వు కోట్లాది రూపాయలు స్వాహా చేసెయ్యవోయ్’ అన్నదే ధ్యేయం.. ఈ ఇందిరాగాంధీని ముంచేసేకా మరో నలుగుర్ని దోచేసుకున్నాడని పోలీసు రికార్డులో వుంది. ఈమెగాక ఉషారాణి (స్కూలు టీచరు), సబితా, శాంతిని, ఈరోడ్‌కు చెందిన చిత్రా, కుముదవల్లి, సుశీల మొత్తానికి ఎనమండుగురు అయ్యారు. అంతా కోట్ల ఆస్తుల్ని కోల్పోయి పెళ్లికోసమై వలలో పడిరే.. పాపం! మహిళామణులు అన్నట్లు పోలీసుల ముందుకు వచ్చారు. పెళ్లిళ్ల కంపెనీ జంటని మాత్రం పోలీసులు ప్రస్తుతానికి మూసేశారు. పురుషోత్తముడు ఈపాటికే కేవలం నలభై ఎనిమిది చీటింగ్ కేసుల్లో మాత్రం నమోదై- దొరక్కుండా పోయాడు. నీతి: మ్యూరేజ్ బ్యూరోలతో జరభద్రం!

-వీరాజీ