Others

ఇదిగో సంక్రాంతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శీతాకాలం చలి పిల్లగా మారి
భోగిమంటల వెచ్చదనంలో
సిగ్గుమొగ్గలేస్తూ కళ్ళు తెరుస్తున్నది
భానుడి కిరణాలు పొగల్లోంచి పొంచి చూసి
మెల్లగా దూసుకొస్తున్నాయి
సంక్రమణ వేళ క్రాంతి కాంత
మబ్బులోంచి మొగ్గలేస్తున్నది

వ్యవసాయ కృషికి ఫలసాయం అందుకుని
విశ్రాంతి సమయాన్ని పబ్బంగా చేసుకుంటున్న రైతన్నలు
అనూర సారథ్యంలో ఉత్తరాన కనే్నసిన సూర్యభగవానుడు
బొబ్బట్లు, పొంగళ్ళతో తమ బొజ్జలకు
శ్రీరామరక్ష
అంటున్న పిల్లా పెద్దలు
భోగిపండ్లు పోస్తూ దృష్టి పరిహారం
చేస్తూ పిల్లలను దీవిస్తున్న కన్నతల్లులు
అంతటా పసుపుపచ్చదనం,
పడుచుదనం
ముంగిళ్ళలో మురిపిస్తున్న
చెమ్మచెక్కలాటలు
ఎటుచూసినా ఆనంద కోలాహలం
గోమాతకు పసుపు, కుంకుమలు, పూజలు
రంగులప్పుకున్న డూడూ బసవన్నల ఘల్లుమనే గజ్జెల సంగీతాలు
హరే హరేలో రంగ అంటూ
హరిదాసుల అలవోక నాట్యపదాలు
ఎంతో కొంత అందరికీ పంచి పెట్టాలనే తహతహతో
ఆకలి వున్నవాడు యికపై బాధ
వుండరాదని
సౌభాగ్యం అందరికీ యిమ్మని
ప్రార్థిస్తున్నా సంక్రాంతి లక్ష్మిని.

-ఎ.ఎస్.ప్రభాకర్ 9963887346