Others

ధేనుకుని గర్వభంగం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘ఆగండి ఆగండి ముందుకు వెళ్లకండి. ఇక్కడికి దగ్గరలోనే తాటివనం ఉంది. అందులోనుండి ఈ పండ్ల వాసన వస్తోంది. కాని మనం అక్కడికి వెళ్లవద్దు. అక్కడ ఒక గొప్ప రాక్షసుడు వున్నాడు. వాని పేరు ధేనుకాసురుడు. అందుకే మనం అక్కడికి వెళ్లవద్దు. అసలే మన పెద్దవాళ్లు ఆపదలదగ్గరకు వెళ్లవద్దు అని చెప్పి పంపారు కదా’అన్నారు.
ఆ మాట వినడంతోనే ‘ఓహో మన కృష్ణుడు మన దగ్గర ఉంటే ఇక మనకు భయమెందుకు పెద్దలు ముసలి వారు కనుక వారికి భయమెక్కువ. అంతే మనం ముందుకు వెళ్లవచ్చుకదా’అంటూ ఒకరిని ఒకరు తోసుకొంటూ ముందుకు వచ్చారు. ‘బలరామా మీరిద్దరూ మా దగ్గర ఉంటే మాకు భయమనేది తెలీదు. మేము చెప్పేది నిజమే కదా. పదండి వెళ్దాం’అన్నారు.
‘ఓ కృష్ణా! ఓ బలరామా! మీరు చెప్పండి. మనకు భయం లేదని ఒకవేళ ఆ ధేనుకాసురుడు వస్తే వాని రెండూ కాళ్లు వెనుక నుంచి పట్టుకొని తాటి చెట్టు కేసి కొట్దాం. అనిచెప్పండి’ అన్నారు.
కృష్ణబలరాములు వారి ఉత్సాహం చూసి బలరామ కృష్ణులూ ‘సరే మీ ఇష్టాన్ని మేము ఎందుకు కాదంటాం పదండి ’ అంటూ ముందుకు వెళ్లారు.
ఆ వనం అంతా మాగిని తాటిపండ్ల వాసనతో గుబాళించిపోతోంది. బలరాముడు ఓ చెట్టును చూసి దాన్ని పట్టుకొని గట్టిగా ఊపాడు. టపటపా తాటిపండ్లు ఒకదానిపైన ఒకటి పడ్డాయి. ఆ శబ్దానికి నిద్రపోతున్న ధేనుకాసురుడు భయపడి కండ్లు తెరిచాడు. ‘ఏమిటీ నా వనం లోకి ప్రవేశించిన అర్భకులు ఎవరు? ’అంటూ గట్టిగా గాండ్రిస్తూ పరుగెత్తి గోపబాలుర చెంతకు వచ్చాడు. అంతే గాడిద శరీరంతో ఉన్న ధేనుకుడ్ని చూసి అమితమైన కోపంతో బలరాముడు రెండు కాళ్లు పట్టు గిరగిరా తిప్పి తాటి చెట్లకేసి కొట్టాడు. వాడి శరీర బరువుకు ఒక చెట్టు వెనుక మరోచెట్టు అలా వంద చెట్లు ఒకదానిపై ఒకటి పడ్డాయి. వాటికింది ధేనుకాసురుడు పడ్డాడు. ఒక్క దెబ్బతోనే వాడు అసువులు బాసాడు. దాన్ని చూసి గోపాలురంతా ఆనందంతో వెర్రి కేకలు వేసారు. ఈ ధేనుకాసురుని అరుపు, గోపబాలుర కేరింత విని ధేనుకాసురుని బంధుగణమంతా తమ రాక్షసబలంతో బలరామకృష్ణులపైకి పరుగెత్తి వచ్చారు. వారినంతా అన్నదమ్ములిద్దరూ చీల్చి చెండారు. వారి పీడ విరగ డ అయింది. గోపాలురు ఆనందంతో బలరామకృష్ణులను తమ చేతులతో ఎత్తుకొని వీపులపైన ఎక్కించుకుని అమితానందంతో ఊరేగారు. మీరే అందరికన్నా బలవంతులూ అంటూ వారిని మెచ్చుకున్నారు. ఇక ఎంతోమంది ఈ తాటివనంలోకి యథేచ్చగా తిరుగుతారు. దానికి కారణం మీరిద్దరే అంటూ వారిని మరీ మరీ పొగిడారు. అట్లా ధేనుకాసురుని బలరామ కృష్ణులు యమపురికి పంపారు.
గోపాలురంతా కలసి ఇంటికి బయలుదేరారు.
గోపాలుర రాకకోసం ఎదురుచూస్తున్న గోపకాంతలంతా వారికి ఎదురేగి తీసుకువచ్చి స్నానపానాదులు చేయించారు. పొద్దుటినుంచి కష్టపడి వచ్చారని ఎంతో ఆత్మీయంగా, ప్రేమగా అన్నాదులను తినిపించారు. రకరకాల పిండివంటలు పెట్టారు. వారి అమ్మల దగ్గర గోరుముద్దులు తింటున్న గోపబాలురు అడవిలో బలరాముడు ధేనుకాసురుణ్ణి చంపిన వైనాన్ని కథలు కథలుగా చెప్పారు.విన్నవారంతా భయపడి పోయారు. వారికేమీ కాలేదుగా అని వారిని తడిమి చూసుకున్నారు. వెంటనే యశోదమ్మ దగ్గరకు పరుగెత్తివచ్చారు. వారు వచ్చేటప్పటికీ రోహిణీ యశోదలు ఇద్దరికీ అన్నం తినిపిస్తున్నారు. ‘అమ్మా యశోదమ్మా నీ ముద్దుల పట్టీ కృష్ణయ్య ఏం చేశాడో చెప్పాడా లేదా? అతగాడు ఎలా ఉన్నాడు. బలరాముడు ఎలా ఉన్నాడు. వీరిద్దరూ కలసి అక్కడ ఒక రాక్షసుణ్ణి చంపారట. ఆ సంగతి మీకు తెలిసిందా. మనం ఇంత దూరం వచ్చినా ప్రతిరోజు ఏదో ఒక ఆపద మన పిల్లల్ని చుట్టుముట్టుతూనే ఉంది. ఏరి వారిని ఒకసారి మా కనులారా చూసుకోనివ్వండి’ అంటూ దగ్గరకు వచ్చి కృష్ణుని బలరాముని దగ్గరకు తీసుకొని ముద్దులు పెట్టారు. వారి ఒళ్లంతా తడిమి చూశారు.
మీకు ఆపద వస్తుందని కదా మేము వెళ్లద్దు అంటే వినకుండా వెళ్లారు. ఆ రాక్షసుని వల్ల మీకు ఏ కష్టమూ కలుగలేదు కదా అని అడుగుతున్న గోపకాంతల వల్ల నిజమేదో తెలుసుకొని మ్రాన్పడిపోయారు అమ్మలిద్దరూ. వారిద్దరూ తమ బిడ్డలకు దిష్టి తీసేశారు. ఎంతో పెద్ద ఆపదను తిరిగీ ఆ దేవుడే తీర్చాడని దేవునికి పదేపదే మొక్కుకున్నారు.
***