Others

రెండు తరాలకు వారధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరగతి గది కొన్నిసార్లు గత తరానికి అంజలి ఘటించే స్థలంగా మారిపోతుంది. సైన్స్‌లో ఎం.జి.కె. మీనన్ అపారమైన సేవచేసి ఐదు దశాబ్దాలుగా విజ్ఞాన రంగంలో ప్రముఖమైన పాత్ర వహించి 88 సంవత్సరాల వయసులో మరణించారు. ఉపాధ్యాయుడు ఆనాడు పాఠాన్ని అక్కడ పెట్టి జీవనయానంలో ప్రపంచానికి విజ్ఞాన శాస్త్రం ప్రసాదించిన మహానుభావుల యొక్క సేవలను ప్రస్తావిస్తాడు. సైంటిఫిక్ కల్చర్‌ను నేర్పిస్తాడు. కొన్నిసార్లు తరగతి గది ఒక తరం నుంచి మరొక తరానికి సంస్కృతిని తీసుకువెళ్లే వంతెనగా మారిపోతుంది. పిల్లలు ఎంజీకే మీనన్‌ను చూడలేదు. ఉపాధ్యాయులు మీనన్ సేవలను ప్రస్తావిస్తున్నప్పుడు ఈ విజ్ఞాన శాస్త్రం ఎంతమంది మహనీయుల కృషి అని తలచుకోవడమేగాకుండా ఈ భవనంలో నేను కూడా ఒక ఇటుకను కావాలని అతడిని ఆరాధిస్తారు. తరగతి గది గత సంస్కృతికి నీడనిచ్చే వృక్షంగా మారుతుంది. ఆ నీడే ఆ పిల్లలకు పునాదిగా నిలుస్తుంది. గత తరం త్యాగాలు సేవలు వచ్చే తరానికి పునాదులు. తరగతి గది కొన్నిసార్లు మహనీయుల జీవనయానానికి వారికి అంజలి ఘటించడానికి క్షేత్రంగా మారిపోతుంది. ఉపాధ్యాయుడు తన పాఠాన్ని కొన్ని నిముషాలు పక్కనపెట్టి ఇలాంటి ప్రస్తావనలు చేస్తూ ఉంటాడు. తరగతి గది రెండు తరాల భావనలకు వేదికగా, వారధిగా నిలుస్తుంది.
ప్రాణమున్న ప్రతిజీవి పెరిగినట్లే తరగతి గది కూడా పెరుగుతుందని డాక్టర్ బెరోల్డ్ ఈక్ అన్నారు. స్టాన్‌ఫోర్డ్‌లో మానసిక శాస్త్ర ఆచార్యుడు ఈక్ తన పరిశోధనలో తరగతి గదికి కూడా ఎదుగుదల ఉంటుందని, ఈ ఎదుగుదల శ్రమ, పట్టుదల, పునర్వేదనలతో ఉంటుందని, దీనివల్ల విద్యార్థి బుద్ధి తెలివి కూడా పెరుగుతుందని ఆ ఆచార్యుడు ప్రయోగాత్మకంగా చూపించాడు. విద్యార్థికి అవగాహన పెరుగుతున్న కొద్ది మెదడులో ఉన్న నాడులు ప్రేరణ పొందుతాయని ప్రయోగాత్మకంగా చూపించాడు. దానికి ఉపాధ్యాయుడు తన ప్రేరణతో దాన్ని వేగవంతం చేయవచ్చునని కూడా చూపించాడు. అన్ని జీవరాసుల మాదిరిగానే తరగతి గది కూడా పెరుగుతుంది. యాబయి సంవత్సరాల క్రితం గురుశిష్యుల మధ్య జరిగిన సంభాషణ ఈనాడు జరుగుతున్న సంభాషణ ఒకే విధంగా ఉండదు. ఇద్దరూ కలిసి తరగతి గది ఎదుగుదలకు ప్రతిక్షణం పాటుపడవచ్చును. ఉపాధ్యాయుని దీక్ష విద్యార్థి అవగాహనకు తోడైతే తరగతి గది ఎదుగుదల వేగవంతం అవుతుంది.
ఉపాధ్యాయుడి జీవితం...
ఉపాధ్యాయుడు తన జీవితాన్ని విద్యార్థుల కళ్లల్లో చూసుకుంటాడు. అదే మాదిరిగా విద్యార్థి తన జీవితాన్ని ఉపాధ్యాయుని నడకలో చూస్తూ ఉంటాడు. వీళ్లిద్దరి మధ్య ఉన్న సంబంధం చాలా సున్నితమైంది, ఇష్టమైనది. ఉపాధ్యాయులు విద్యార్థులను స్మరించుకుంటుంటే వాళ్ల మాటల్లో ప్రేమ, అనురాగం అద్దం పడుతుంది. ఉపాధ్యాయుడు తను నిర్మించుకున్న ఆశయాలను తన విద్యార్థి ఆచరణలో చూపిస్తుంటే ఉప్పొంగిపోతాడు. దానికి ఏమాత్రం భంగమైనా చలించిపోతాడు. పిల్లలు సాధించిన విజయాలను చూసి ఉపాధ్యాయుడు అవే తమకు ఘనమైన సన్మానంగా భావిస్తారు. ఉపాధ్యాయులు తీసుకునే జీతాలకన్నా, సన్మానాల కన్నా విద్యార్థుల విజయాలే వారి కలలను నిజరూపంగా నిలుస్తాయి. ఉపాధ్యాయుల నియామకాలు చేసేటప్పుడు ఉన్నత ఆదర్శాలుకల వారిని ఎన్నుకోవాలి. అప్పుడే భవిష్యత్ సమాజం పరిపుష్టం అవుతుంది. ఉపాధ్యాయులు విద్యా కార్యక్రమంలో కీలక భాగస్వాములు.

-డా.చుక్కా రామయ్య