Others

‘ఉషో’దయం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెబ్బయ ఎనిమిదేళ్ల ఏళ్ల ఉషా సోమన్ గురించి తెలియని వారుండరు. భారతదేశ ఐరన్‌మ్యాన్, మోడల్, నటుడు మిలింద్ సోమన్ తల్లి. కొడుకును పరుగుల రాకెట్‌గా తీర్చిదిద్దిన ఏడుపదులు దాటిన ఈ తల్లి ఈనాటికీ ఫిట్‌నెస్‌కు పర్యాయపదంగా నిలిచిందంటే అతిశయోక్తి కాదు. ఇటీవల ఓ మారథాన్‌లో కుమారుడితో పాటు పాల్గొని ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. లక్షల్లో లైక్ చేశారంటే ఈ బామ్మకున్న క్రేజీ అంతా ఇంతా కాదు. వంద కిలోమీటర్ల నడకను 41 గంటల్లో పూర్తి చేసి ( అది చీర కట్టుకుని) తనకు సాటి ఎవ్వరూ లేరని సవాల్ విసిరింది. బయోకెమిస్ట్రీ ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేసిన ఉషా సోమన్ 16 ఏళ్ల వయసు నుంచే ట్రెక్కింగ్ చేశారు. ఇందులో భాగంగా వౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంపును కొలిచింది. అంతేకాదు ఎత్తయిన పర్వతం కిలిమంజారో సైతం ఈ బామ్మ ముందు చిన్నబోయింది. అరవై ఏళ్లు దాటినా ఇరవై ఏళ్ల అమ్మాయిల కంటే ఎంతో ఉషారుగా ఉండే ఈమె ఫిట్‌నెస్ గురించి ఇలా చెబుతున్నారు..
* ఉషోదయం వేళల్లో ప్రతిరోజూ ఐదు కిలోమీటర్ల దూరం ఇప్పటికీ నడుస్తాను. ఎక్కడకి వెళ్లాలన్నా కారు అసలు ఉపయోగించను. ఎక్కువ శాతం నడుచుకుంటూనే వెళ్లి అవసరమైన వస్తువులు తెచ్చుకుంటాను.
* యుక్తవయసులో ఉన్నపుడు అన్నీ తిన్నాను. కార్బోహైడ్రేట్లు, అధిక ప్రొటీన్లు అని అంటూ కొలతలు వేసుకుని తినలేదు.
* మనం ప్రతిరోజూ వండుకునే సాంప్రదాయ వంటలే సమతుల్యమైన ఆరోగ్యాన్ని అందిస్తాయి.
* ప్రస్తుతం జీవనశైలి మారింది కాబట్టి మన అవసరాలకు తగ్గట్టు మనం ఉండాలి. ఎంత బిజీగా ఉన్నా సంతోషంగా ఉంటే మంచిది.
* ఫిట్‌నెస్‌గా ఉండాలంటే శారీరకంగా ఉంటే సరిపోదు. మనసును కూడా ఉంటే అపుడే ఫిట్‌నెస్‌గా ఉంటారు. మనసును ఎల్లప్పుడు ప్రశాంతంగా..స్వచ్ఛంగా ఉంచుకునేటట్లు శిక్షణ ఇవ్వండి. వయసు కేవలం సంఖ్య మాత్రమే.