AADIVAVRAM - Others

అక్షరాల తోటలో పరిమళాలు.. పరిచయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మామూలుగా పండుగ ఒక రోజే ఉంటుంది. కానీ పుస్తకాల పండుగ మాత్రం పనె్నండు రోజుల వేడుక. అన్ని పండుగల కంటె నాకు నచ్చిన పండుగ విజయవాడలో జరిగే పుస్తక మహోత్సవం.
పుస్తకాల ఉత్సవంలో కొలువుతీరిన ప్రపంచ ప్రసిద్ధి చెందిన రచయితల పుస్తకాలు చూస్తుంటే అదృశ్య రూపంలో ఆ రచయితలు మనతో సంభాషణ చేస్తున్నట్లనిపిస్తుంది. గోర్కీ, టాల్‌స్టాయి, కీట్స్, షేక్స్‌స్పియర్, వర్డ్స్‌వర్త్, ప్రేమ్‌చంద్, రవీంద్రనాథ్ టాగూర్ మొ. విశ్వవిఖ్యాత రచయితల పుస్తకాలను చూసినపుడు మనసు పరవశిస్తుంది.
ప్రతి ఏటా పుస్తక ప్రదర్శనశాలలో 300 దాకా స్టాల్స్ ఉంటాయి. అన్నిటిలో సాహిత్య అకాడెమీ స్టాల్‌లో భారతీయ భాష లన్నిటిలో రచించిన వివిధ భాషల అనువాదాలు, ఎకాడెమీ అవార్డులు వచ్చిన కవితా సంకలనాలు, కథా సంకలనాలు దొరుకుతాయి. మూల భాషల్లో మనం చదవలేక పోయినా, తెలుగు అనువాదంలో ఆయా రచనల సోయగాన్ని ఆస్వాదించవచ్చు. ఇంకా తెలుగు అకాడెమీ, విశాలాంధ్ర, ప్రజాశక్తిల ప్రసిద్ధ రచయితల పుస్తకాలు కనువింద చేస్తాయి. ముఖ్యంగా కొత్త పుస్తకాల పేజీలు తాకుతున్నపుడు ఆ పరిమళం పరమాద్భుతంగా ఉంటుంది.
శ్రీశ్రీ, చలం, తిలక్, మహీధర రామమోహనరావు, కొడవటిగంటి, కాళీపట్నం రామారావు, చాసో, శ్రీపాద, బుచ్చిబాబు, అడవి బాపిరాజు, మొ. ప్రముఖ రచయితల పుస్తకాలు ఒకేచోట చూడటం చాలా అపురూపంగా ఉంటుంది. విశాలాంధ్ర, ప్రజాశక్తిలలో ఈ పుస్తకాలతోపాటు రంగురంగుల బొమ్మలతో బాల సాహిత్యాన్ని చూస్తున్నపుడు మనం కూడా పిల్లలమై ఆ పుస్తకాలు చదివి ఆనందించాలనుకొంటాం.
ఈ పుస్తకాల కొలువులో పుస్తకాలతోపాటు ప్రతిరోజు నిర్వహించే సాహితీ సభలు, రచయితలకు, కవులకు ప్రత్యేక ఆకర్షణ. అభిమాన కవులను, రచయితలను చూడడం, వారి ప్రసంగాలు వినడం, వారితో మాటలాడటం ఒక గొప్ప అనుభూతి.
పుస్తకాలు మనిషి జీవన గమనాన్ని మార్చేస్తాయి. కొన్ని పుస్తకాలు మనను వెంటాడుతాయి. రాజకీయ నాయకులకైనా, సామాన్యులకైనా కొన్ని ఇష్టమైన పుస్తకాలుంటాయి. మనను ప్రభావితం చేస్తాయి. అలా నన్ను ప్రభావితం చేసిన పుస్తకంపై కొందరు రాజకీయ నాయకులతో ఈ సంవత్సరం కార్యక్రమం చేయడం బాగుంది.
తెలుగు భాష - వికాసంపై, ఆయా రంగాలలో ప్రముఖులే చర్చ తెలుగు భాషా ప్రియులను అలరించింది.
సమాజంలోనే కాదు సాహిత్యంలోను పురుషాధిక్య ధోరణి కొన్ని శతాబ్దాలుగా పెత్తనం చేస్తోంది. 20వ శతాబ్దంలో మహిళలు కూడా కలం పట్టి తమ ప్రతిభను చూపించారు. ‘సాహితీ సృజనలో స్ర్తిలు’ అంశంపై ఓల్గా కీలకోపన్యాసం, పి.సత్యవతి, విమల, మల్లీశ్వరి ప్రసంగాలు, కథ, నవలలపై ప్రముఖుల ప్రసంగాలు అలరించాయి.
ఈ అన్ని రోజుల కార్యక్రమంలోను తెలుగు సాహిత్యంలో యువ స్వరాలు కార్యక్రమం నన్ను బాగా ఆకర్షించింది. వేంపల్లి గంగాధర్, వేంపల్లి షరీఫ్, మంత్రి కృష్ణమోహన్, మెర్సీ మార్గరెట్, అపర్ణ తోట, చైతన్య పింగళి మొ. వారు రచనలు చేయడానికి తాము పొందిన ప్రేరణలు, అనుభవాలు మనసును కదిలించాయి. ముఖ్యంగా వెనుకబడిన రాయలసీమ ప్రాంతం, అక్కడి కరువు పరిస్థితులను కళ్లకు కట్టినట్లుగా ఆర్తిగా వివరించిన అప్పిరెడ్డి హరినాథరడ్డి ఉపన్యాసం ఆలోచింపజేసింది. ఈ యువ రచయితలు వారి సృజన వెనుక నేపథ్యాన్ని వివరించిన తీరు మనసుకు హత్తుకొంది.
ఆ మర్నాడు శివారెడ్డి అధ్యక్షతన జరిగిన కవి సమ్మేళనం, డా.పాపినేని శివశంకర్, దేవీప్రియ, గుంటూరు లక్ష్మీ నరసయ్య, శిఖామణి, సీతారామ్‌ల కవిత్వ ప్రసంగాలు ఎంతో ఆకట్టుకొన్నాయి.
ఇతర కవుల కవితలను ఉదాహరణలుగా తీసుకొని కవిత్వంలో మానవ సంబంధాలు, మట్టి వాసనలు గురించి సీతారామ్ గారు విశే్లషించిన తీరు మంత్రముగ్ధం. కొప్పర్తి, మందరపు హైమవతి, ఎండ్లూరి సుధాకర్, నామాది శ్రీ్ధర్, కొండేపూడి నిర్మల, పాటిబండ్ల రజని, అనిల్ దాని ల కవితలు మరో లోకంలో విహరింపజేసాయి. తెలుగు వారికే ప్రత్యేకమైన ప్రక్రియలు పద్య నాటకం, అవధానం, చాటువులు, జావళీల గురించి ఉపన్యాసాలు తానా మంచి పుస్తకం నిర్వహించిన నవలల పోటీ బహుమతి పొందిన పుస్తక పరిచయ సభలు రాత్రి తొమ్మిదైనా ఇంటికి వెళ్లకుండా ఆపేసాయి.
సి.వి. సాహిత్య వేదిక పైనే గాకుండా వేరువేరు స్టాళ్లలో పుస్తక ఆవిష్కరణ సభలు జరిగాయి. ప్రజాశక్తి బుక్‌హౌస్ వారి పిల్లల కోసం కమ్యూనిజం, స్టూడెంట్స్ క్యాపిటల్ మొ. పుస్తకావిష్కరణలు దోర ప్రసాద్ అధ్యక్షతలో జరిగిన సభలు, ఉన్నతోపన్యాసం, ప్రభావితం చేసిన పుస్తకాల గురించి ప్రసంగాలు విభిన్నంగా ఉన్నాయి.
ఈ కార్యక్రమాలన్నిటిలో ‘తెలుగు సాహిత్యంలో హాస్యం’ గురించి పన్నాల సుబ్రహ్మణ్య భట్టుగారి కీలకోపన్యాసం, ముంజులూరి కృష్ణకుమారి గారి నిర్వహణలో హాస్య ప్రసంగాలు, ముఖ్యంగా రెంటాల వెంకటేశ్వరరావు, సింధు మాధురి, సశ్రీల ప్రసంగాలు సంవత్సరానికి సరిపడ నవ్వుల జల్లుల్ని కురిపించాయి.
సాహిత్య అకాడెమీ నిర్వహణలో కవి సమ్మేళనం ఈ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణ. మణిపురి, బోడో, నేపాలీ, తమిళ, కన్నడ, తెలుగు కవితలు వినడం సంతోషకరమైన అనుభవం. మెమచుబి, రభౌ బసుమతరి కవితలు వారి ప్రాంతీయ సౌందర్యాన్ని పరిమళింపజేసాయి.
ప్రతిరోజు సాహితీ సభలు, పుస్తకాలు చూడడం, కొనడం, ఒక మంచి జ్ఞాపకం. అనల్ప, అనేక, చినుకు, సాహితీ మిత్రులు, కృష్ణాజిల్లా రచయితల సంఘం స్టాల్స్‌లో కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఒక మంచి అనుభూతి. ప్రతిరోజు ఎవరో ఒకరు మిత్రులు కలవడం, మిర్చి బజ్జీల స్టాల్‌లో వేడివేడి బజ్జీలు తింటూ సాహిత్య చర్చలు చేయడం ఆహ్లాదకరమైన అనుభవం.
ముఖ్యంగా ఈ ఉత్సవాలలో ఎప్పుడో పదేళ్ల క్రిందట సాహిత్య అకాడెమీ గౌహతిలో నిర్వహించిన కవి సమ్మేళనంలో పాల్గొన్న మెమచుబీని కలవడం చాలా సంతోషకరమైన అనుభూతి. పుస్తకాలు, పుస్తకాలు రచించిన రచయితలతో కబుర్లు అంతకంటే ఆనందం ఏముంటుంది?!
వాసిరెడ్డి నవీన్ నిర్వహణలో యువ సాహితీకారుల కార్యక్రమం, కవి సమ్మేళనం వంటి కార్యక్రమాలు బాగున్నాయి. ఈ సంవత్సరం ఎస్.బి.టి. వారి స్టాల్ లేకపోవడం లోటు. సాహిత్య అకాడెమీ స్టాల్‌లో ఇండియన్ లిటరేచర్ పుస్తకాలు ఉంటే బాగుండేది. 1వ తారీఖున అన్ని స్టాల్స్ ప్రారంభం కాకపోవడం ఒక లోపం. ముఖ్యంగా స్టాల్ నంబర్లు సూచించే కరపత్రాలు రెండు ప్రవేశ ద్వారాల్లో ప్రముఖంగా కనపడేలా వుంచితే, పుస్తక ప్రేమికులకు బాగుంటుంది. ఈ సం. పోలీసు రచయితలు రాసిన రచనలతో సురక్ష - ఎ.పి. పోలీసు మాసపత్రిక వారి స్టాల్ కొత్తగా పెట్టినప్పటికీ ఎంతో మంది పుస్తక ప్రియులను ఆకర్షించింది.
పిల్లల కార్యక్రమాలు జరిగే వేదిక రెండవ తారీఖు నాడైనా ఏర్పాటు చేయకపోవడం పిల్లల ఆసక్తిపై నీళ్లు చల్లినట్లనిపించింది.
ఏది ఏమైనా కొన్ని చిన్నచిన్న లోట్లు వున్నప్పటికీ ఈ పుస్తక మహోత్సవాలు జరిగిన పనె్నండు రోజులు పనె్నండు నిమిషాల్లా గడిచిపోయాయి. మళ్లీ వచ్చే సంవత్సరం వచ్చే పుస్తకాల పండుగ గూర్చి ఎదురుచూస్తూ.
* పుస్తకాలంటే కొందరికి ఇష్టం. కొందరు చూసి వదిలేస్తారు. కొందరు చదవనిదే వదలరు. అలాంటివారిని పుస్తకాల పురుగులంటారు గోముగా. అచ్చుయంత్రం వచ్చాక కానీ పుస్తకాల ప్రచురణ మొదలు కాలేదు. ఆ తరువాత ప్రపం చం తీరుతెన్నులనే పుస్తకం మార్చేసింది. ఎన్నో వింతలు విశేషాలు రికార్డులను నమోదు చేసింది. హైదరాబాద్ పుస్తక మహోత్సవం సందర్భంగా అలాంటి కొన్ని విశేషాలను తెలుసుకుందాం.

* అచ్చుయంత్రం కనుగొనక ముందు రాళ్లు, మార్బుల్స్, తాళపత్రాలపై రాసేవారు. అలా పూర్తిస్థాయి పుస్తకం తయారైనది 1453లో. గుటెన్‌బర్గ్ బైబిల్ అది. ప్రింటింగ్‌ప్రెస్‌ను కనుగొన్న అతడే స్వయంగా ఆ పుస్తకాన్ని ప్రచురించాడు. అతడి పూర్తిపేరు జోహెనె్నస్ జెన్‌ప్లెచ్ జుల్‌లాడెన్ జుమ్ గుటెన్‌బర్గ్.

* టైప్‌రైటర్‌పై పూర్తిస్థాయి పుస్తకాన్ని ప్రింట్ చేసిన తొలిపుస్తకం మార్క్ ట్వైన్ రాసిన లైఫ్ ఆఫ్ మిసిసిపి (1882)

* ప్రపంచంలో ప్రతీ సంవత్సరం 755,755 కొత్త పుస్తకాలు ప్రచురితమవుతుంటాయని అంచనా.

* 2017 మధ్య నాటికి ఈ ప్రపంచంలో 134,399,411 పుస్తకాలున్నట్లు ఓ అంచనా.

-మందరపు హైమవతి 9441062432