Others

పంచాయతీరాజ్ చట్టంలో మార్పు మంచిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామాల అభివృద్ధితోనే దేశం అభివృద్ధి చెందుతుంది. రాజ్యాంగం ప్రకారం స్థానిక సంస్థలను బలోపేతం చేసే నూతన పంచాయతీరాజ్ వ్యవస్థను ఏర్పాటు చేయాల్సి ఉంది. నిధులు, విధులు లేక ఇన్నాళ్లూ గాడితప్పిన ఈ వ్యవస్థను చక్కదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించడం అభినందనీయం. కానీ ఈ వ్యవస్థను సమూలంగా మార్చడం, గ్రామ పంచాయతీ ఎన్నికలు పరోక్ష పద్ధతిలో నిర్వహించాలన్న ఆలోచనలపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పెద్దఎత్తున చర్చకూడా జరుగుతున్నది. తెలంగాణలో కొత్త చట్టం తీసుకురావడం మంచిదే. 1981 వరకు సర్పంచ్ ఎన్నిక వార్డు సభ్యుల ద్వారా పరోక్షంగా సాగేది. గ్రామాల్లో రాజకీయ గందరగోళానికి ఈ విధానం కారణమైంది. 1981 తరువాత సర్పంచ్‌ను ప్రత్యక్ష విధానంలో ఎన్నుకున్నారు. ఇది మంచి ఫలితాలను ఇచ్చింది. ప్రస్తుత వ్యవస్థలో సర్పంచ్‌లు తమ విధులను సక్రమంగా నిర్వహించడం లేదు. పంచాయతీ సిబ్బందికి జవాబుదారీతనం లేదు. ప్రజాప్రతినిధుల అవిద్యవల్ల పంచాయతీ కార్యదర్శులదే పాలన. ఆరునెలలకు ఒకసారి జరుగుతున్న గ్రామసభలు నెలకు ఓమారు నిర్వహిస్తే మేలు. సర్పంచ్ పదవికి పోటీ చేసేవారికి విద్యార్హత పెట్టడం, ప్రత్యక్ష ఎన్నికలో ఎంపికవడం వంటి సంస్కరణలు అవసరం. పరోక్షపద్ధతివల్ల అక్రమాలు, బేరసారాలకు అవకాశం ఇచ్చినట్లే. పంచాయతీరాజ్ వ్యవస్థలో సంస్కరణలకు బల్వంతరాయ్‌మెహతా జీవీకేసింగ్ వంటివారి నివేదికలను తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేయాలి. రాజకీయ ఆధిపత్యం కోసం లోపభూయిష్టమైన మార్పులను చేయడం సరికాదు. కొత్త చట్టంలో మార్పులవల్ల ఇకముందు వార్డు సభ్యుడికికూడా అధికారాలుంటాయి. గ్రామసభకు హాజరయ్యే సభ్యులకు సిట్టింగ్ ఫీజు ఇవ్వాలన్నది ఎన్నికల తాయిలమే. వచ్చే జూలై 31 వరకు ప్రస్తుత పాలకవర్గాలే పంచాయితీల్లో పాలన నిర్వహించవచ్చు. మూడునెలల ముందు ఎన్నికలకు వెళ్లొచ్చు. అయితే సర్పంచ్‌ల ఎన్నిక ఎప్పుడో? ఏ పద్ధతిలో నిర్వహిస్తారో? 200 ఓటర్లు ఉన్న తాండాలను గ్రామ పంచాయతీలుగా మారుస్తామన్నమాట ఏమైంది? సర్పంచ్‌కు నెలకు 5 వేల గౌరవ వేతనం ఇవ్వనుండటంతో ఆ పదవికి ఎన్నడూలేని గిరాకీ ఏర్పడింది. గతంలో రూ. 750 మాత్రమే ఇచ్చేవారు. ఇది ఒకరకంగా మంచిదే. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న జెడ్‌పిటిసి, ఎమ్‌పిటిసి సభ్యులు ఉత్సవ విగ్రహాలే. బాధ్యతలు, అధికారాలు లేవు. ప్రొటోకాల్ కూడా లేదు. ఈ విధానంలో మార్పులు అవసరం. ఈ పదవులను రద్దు చేస్తామని కేసీఆర్ ఎప్పుడో ప్రకటించారు. ఈ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. నూతన పంచాయతీరాజ్ చట్టం ముసాయిదా సిద్ధమైనా పూర్తివివరాలు ఇంకా వెలుగులోకి రావలసి ఉంది. జిల్లాల సంఖ్య పెరగడం వల్ల జెడ్‌పిటిసి, ఎంపిటిసి సభ్యుల ప్రాధాన్యత మరింత తగ్గిపోయింది. ఒకవేళ ఈ పదవులను కొనసాగిస్తే వీరికి, సర్పంచ్‌లను ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకునేలా చూడాలి. శాసనసభలో ఈ ముసాయిదాబిల్లు పెట్టేలోగా గ్రామ, మండల, జిల్లా పరిషత్ సభల్లో విస్తృత చర్చ నిర్వహించడం అవసరం. హడావుడిగా కొత్త చట్టాన్ని తీసుకురావడం అంత మంచిది కాదు.

-ఆర్.రాజేశం