Others

దుష్టులకు దండన తప్పనిసరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొద్ది కాలం గడిచింది.
యథావిధిగా అందరూ ఎవరి పనులు వారు చేసుకొంటున్నారు. ఒకరోజు గోపాలురంతా కలసి దగ్గరనున్న అడవికి వెళ్లారు. దినమంతా బాగా అలసిపోయేట్టుగా ఆడుకున్నారు. ఇక ఇంటికి తిరిగి వెళ్దామనుకొన్నారు. దాహం వేసింది. దగ్గర ఎక్కడైనా నీటి చెలమ ఉందా అని చూస్తూ చూస్తూ కాళింది నదీతీరానికి వచ్చారు. ఆ కాళింది నీటిని చూసి వారు ఎంతో సంతోషంతో ఆ నీటిలో దిగి కాళ్లు చేతులు కడుక్కుంటూనే నీరు తాగారు. అంతే గోపాలురంతా ఆ కాళింది నీటిలోని విషానికి బలయ్యారు. అందరూ అసువులు బాసారు. పశువులూ ఆ నీటిని తాగబోయి ప్రాణాలు పోగొట్టుకున్నాయి. దాన్ని చూసిన బలరామకృష్ణులు హతాశులైనారు. కృష్ణుడు మనసులో కాళీయుని పని పట్టాల్సిందే కదా అనుకొన్నాడు. కాళీయుడున్న నది గట్టుననే ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. శాఖోపశాఖలుగా విస్తరించి ఉంది. దానిపైకి కృష్ణయ్య చేరుకున్నాడు.

- చరణ శ్రీ