Others

నిర్మలమైన మనస్సే భగవంతుని ఆవాసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ధ్రువా! ఎందుకంత ఆవేదనతో ముందుకు వెళ్లుతున్నావు. పాలుకారే ఆ బుగ్గలు ఎండవేడిమి తట్టుకోలేక ఎర్రబారిపోతున్నాయి’అన్నాడు.
నమస్కారం చేసి ‘ఓత్రిలోకసంచారి! మహానుభావా! నేను మా పినతల్లి చేత పడరాని మాటలు పడ్డాను. ఆ మనస్సంతా పుండు అయిపోయింది. ఆ పుండును భగవంతుడనే ఔషధంతో మాన్పుకోవాలని వెళ్లుతున్నాను. మీరు నా ఆశీస్సులు అందచేయండి’అని మళ్లీ నమస్కారం చేశాడు ధ్రువుడు. ‘నాయనా! ధ్రువకుమారా! ఏది జరిగినా దానికంతటికీ కారణం ఆ దేవాదిదేవుడే. నీవు యమునా నదీతీర ప్రదేశంలో ఉన్న మధువనానికి వెళ్లి అక్కడ కూర్చుని సుఖదుఃఖాలను దూరంగా తరిమివేయి నీవు అన్నింటికీ కారణుడైన శ్రీహరిని మనస్సున నిలుపుకొని ‘‘ఓం నమో భగవతే వాసుదేవాయ’’ అనే వాసుదేవ మంత్రాన్ని జపం చేయి నీకు మేలు జరుగుతుంది. ఆ వాసుదేవుని దర్శనం పొందుతావు.’అని నారదుడు అన్నాడు. నారదుడు చెప్పిన మంత్రాన్ని మనసున నిలుపుకుంటూ ‘స్వామీ నీవు నాకు మంచిమార్గాన్ని చూపావు. నీవు చూపిన దారిలో నడిచి ఆ వాసుదేవుని మెప్పించి ఎవరూ పొందలేనటువంటి ఉన్నత స్థానాన్ని నేను పొందుతాను’అని అంటూ నారదునికి ముమ్మారు ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసి ముందుకు వెళ్లాడు. నారదుడు చెప్పినట్లుగా మనస్సును, చిత్తాన్ని ఏకాగ్రం చేసి వాసుదేవునిపైన నిలిపాడు. చిన్నవాడైనా చిన్మయునిపై అపారమైన అచంచలమైన నమ్మకంతో స్వామిని ప్రార్థించసాగాడు. ఒంటికాలుపై తపస్సు చేస్తున్నాడు. తులసిమాలలు ధరించిన స్వామిని తన మనసున నిలిపి తదేకచిత్తంతో వాసుదేవుని మంత్రం జపిస్తున్నాడు.
ధ్రువుని తపోగ్నితో లోకాలన్నీ తల్లడిల్లిపోసాగాయి. సర్వదేవతలు హాహాకారాలు చేశారు. దీనికి కారణం బాలుడైన ధ్రువుని తపస్సు అని తెలుసుకొని అందరూ నారాయణుని దగ్గరకు పరుగెత్తారు. వారిని చూడగానే ‘మరేంభయంలేదు. ధ్రువుడు నా దర్శనంకోరి నాపై నమ్మకంతో తపస్సు చేస్తున్నాడు. అతని కోరికను నేను తీరుస్తాను. మీరు చింతించకండి’అని అభయం ఇచ్చాడు.
గరుడారూఢుడై స్వామి ధ్రువుని చెంత నిలిచాడు.

- డా. రాయసం. లక్ష్మి