Others

సువర్ణసుందరి..స్వర్ణమంజరి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘అమ్మా! వాల్మీకి రామాయణంలో మహాపతివ్రతామతల్లి సీతాదేవిని గురించి వ్రాయగా చదివామేగాని చూడలేదమ్మా! నిన్ను చూస్తూంటే ఆ సీతమ్మతల్లి సాక్షాత్కరించినట్లయింది. మీ నటనకు ముగ్ధుడనయ్యాను. ‘లవకుశ’ విడుదల తర్వాత ఒకానొక సందర్భంలో ఒక ప్రేక్షకుడు అన్నమాటలివి. ఆ చిత్రంలో అపర సీతమ్మగా నటించిన అంజలీదేవి తెలుగు ప్రేక్షకుల అంతులేని అభిమానాన్ని చూరగొంది. సీత పాత్రకే కాకుండా అనసూయ, రుక్మిణి, సుమతి, సులోచన, సక్కుబాయి వంటి పతివ్రతల పాత్రలకు కూడా ప్రాణంపోసింది. అందుకే ఆమె చాలా పౌరాణిక చిత్రాలలో నటించారు. అంజలీదేవి పేరువినగానే చాలామంది మహిళలకు ప్రాణం లేచివచ్చేది అంటే అతిశయోక్తికాదు.
అంజలీదేవి ధరించినన్ని రకరకాల పాత్రల్ని మరెవ్వరూ ధరించి వుండరు. సహజంగాను, సజీవంగాను ఆయా పాత్రలకు రూపునందించడంలో ఆమెకామెయేసాటి అని చెప్పాలి. అసలు ఆమె వాంప్ పాత్రలలోనే తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. గొల్లభామ, మదాలస, కీలుగుర్రం, రక్షరేఖ వంటి చిత్రాలలో ఆమె వాంప్ పాత్రలు ధరించింది. అందుకు భిన్నంగా తొలి దశలోనే శ్రీలక్ష్మమ్మకథ, పరదేశి, ఇలవేల్పు వంటి చిత్రాలలో బరువైన పాత్రలు ధరించి మెప్పించిన అసాధారణ నటి అంజలీదేవి. భర్త ఆదినారాయణరావుగారి ప్రోత్సాహంతో 1946లో ‘గొల్లభామ’ చిత్రంతో మోహిని పాత్రద్వారా తెలుగుతెరకు పరిచయమై, అంచెలంచెలుగా యెదిగి కథానాయికగా చివరకు అగ్రనటిగా మారిన అరుదైన నటి ఆమె. 1950 దశకంలో యన్.టి.ఆర్, ఏ.యన్.ఆర్.ల సరసన గ్లామరస్ నటిగా పేరుగాంచిన తొలి నటి అంజలీదేవి. ‘సువర్ణసుందరి’ (1957) పాత్రకు దక్షిణ భారతదేశంలోనే కాదు ఉత్తర భారతంలోకూడా పండితులు, విమర్శకులు ఎంతగానో మెచ్చుకున్నారు. ఆమె నటన, సంభాషణ అంతగా వాళ్లని ముగ్ధుల్నిచేసింది. ఎదుటి పాత్ర చెప్తున్న డైలాగ్‌కి బ్రహ్మాండమైన రియాక్షన్ ఇవ్వగల నటి ఆమె. సంభాషణలు చాలామంది చదువుతారు. మరికొంతమంది పలుకుతారు. ఇంకొంతమంది అనేస్తారు. కాని అంజలీదేవి పోకడ వీరందరికంటే విలక్షణమైనది. పాత్ర తాలూకు హృదయ స్పందనని సంభాషణగా వినిపింపజెయ్యడమే అంజలీదేవి ప్రత్యేకత. డైలాగ్‌ని, నటనని మిళితం చేసి ప్రేక్షకుల్ని రసపట్టులోకి లాక్కోగల కళామూర్తి అంజలీదేవి.
అంజలీదేవి మంచి నర్తకి. తన అద్వితీయమైన నృత్యాలతో ప్రేక్షకులను ఉర్రూతలూగించింది. స్వప్నసుందరి (1950), అనార్కలి (1955), రేచుక్క (1954), పెళ్లిసందడి (1959), జయభేరి (1959), సువర్ణసుందరి (1957), రాణీరత్నప్రభ (1960), స్వర్ణమంజరి (1962), జయసింహ (1955), రుణానుబంధం (1960) చిత్రాలలో ఆమె చేసిన నృత్యాలు ప్రేక్షకుల్ని మైమరపించాయి. తెలుగు, తమిళ చిత్రాలలో దాదాపు రెండు దశాబ్దాలు హీరోయిన్‌గా నటించిన ఘనత ఆమెది. నిర్దోషి (1951), స్ర్తిసాహసం (1951), పేదరైతు (1952), పక్కింటి అమ్మాయి (1953), సంఘం (1954), సంతోషం (1955), వదినగారి గాజులు (1955), పల్లెటూరి పిల్ల (1950), చరణదాసి (1956), జయంమనదే (1956), పాండురంగ మహాత్మ్యం (1957), చెంచులక్ష్మి (1958), రాజనందిని (1958), శోభ (1958), జయభేరి (1959), బాలనాగమ్మ (1959), భట్టివిక్రమార్క (1960), భక్తజయదేవ (1961), భీష్మ (1962) చిత్రాలు ఆమె ప్రతిభకు గీటురాళ్లు. తెలుగు, తమిళ చిత్ర సీమలలో ఒక వెలుగు వెలిగి, స్వంత బ్యానర్‌పై తెలుగు, తమిళ, హిందీ చిత్రాలు నిర్మించి, అనేక క్యారెక్టర్ పాత్రలకు జీవంపోసి, తన చివరి శ్వాసవరకు చిత్ర పరిశ్రమకే అంకితమైన అంజలీదేవికి కేంద్ర ప్రభుత్వం ‘పద్మశ్రీ’ ఇవ్వకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. పరిశ్రమలోని పెద్దలు, రాష్ట్ర ప్రముఖులు అంజలీదేవిని పట్టించుకోకపోవడం దురదృష్టకరం. దీనివల్ల ఫాల్స్‌ప్రిస్టేజికి ప్రాకులాడకుండా సృజనాత్మకతతో తెచ్చుకున్న అంజలీదేవి కీర్తికి ఎలాంటి నష్టంలేదు. తెలుగు చలనచిత్ర చరిత్రలో ఒక సువర్ణ్ధ్యాయం అంజలీదేవిది.

-పూజారి నారాయణ, అనంతపురం