Others

ఉమాచండీ గౌరీశంకరుల కథ (ఫ్లాష్‌బ్యాక్@50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవంతమైన పలు చిత్రాల నిర్మాణంతో ఒక ప్రత్యేకతను నిలుపుకున్న సంస్థ విజయా ప్రొడక్షన్స్. ఈ సంస్థ తొలి చిత్రం ‘షావుకారు’ ‘పెళ్లిచేసి చూడు’ (తెలుగు, తమిళ), ‘మిస్సమ్మ’ (తెలుగు, తమిళ), ‘అప్పుచేసి పప్పుకూడు’ చిత్రాలకు ఎల్.వి.ప్రసాద్ దర్శకత్వం వహించారు. తోటరాముడిగా ఎన్‌టిఆర్‌ని సాహస యువకునిగా ‘పాతాళభైరవి’ని ఆబాలగోపాలాన్ని మురిపింపచేస్తూ, ఓ అద్భుత చిత్రరాజంగా నిలిచిన ‘మాయాబజార్’ను రూపొందించిన దర్శకులు కె.వి.రెడ్డి. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై ‘జగదేకవీరుని కథ’ ‘సత్యహరిశ్చంద్ర’ తరువాత వీరు రూపొందించిన చిత్రం ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’. కె.వి.రెడ్డి జయంతి పతాకంపై ‘పెళ్లినాటి ప్రమాణాలు’, ‘శ్రీకృష్ణార్జున యుద్ధం’, ‘్భగ్యచక్రం’ నిర్మించారు. అన్నపూర్ణావారి ‘దొంగరాముడు’, ఎన్.టి.రామారావు ‘శ్రీకృష్ణసత్య’కు దర్శకత్వం వహించారు. విజయవంతమైన చిత్రాల దర్శకునిగా వాసిగాంచారు కె.వి.రెడ్డి (కదిరి వెంకటరెడ్డి).
‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ చిత్రానికి కథను రచయిత పింగళి నాగేంద్రరావు, కె.వి.రెడ్డి, సంగీతం శ్రీనివాసరావు కలిసి సిద్ధం చేసారు. నృత్యం-పసుమర్తి కృష్ణమూర్తి, కళ-గోఖలే,కళాధర్, ఛాయాగ్రగహణం- మాధవ్ బుల్‌బులే, సంగీతం- పెండ్యాల నాగేశ్వరరావు, కూర్పు-జి.కల్యాణ సుందరం, డి.జి.జయరాం, మాటలు,పాటలు- పింగళి నాగేంద్రరావు, స్పెషల్ ఎఫెక్ట్స్- హర్బాన్‌సింగ్, సినిమ అనుసరణ-కె.వి.రెడ్డి, నిర్మాత- దర్శకుడు- కె.వి.రెడ్డి. 11-01-1968 సంక్రాంతి నాడు విడుదల.
నైమిశారణ్యంలో మహర్షులందరూ ఉండగా ఏది సత్కద అని చర్చ వస్తుంది. జమదగ్ని (దూళిపాళ) శ్రీకరంబైన కథ ఏది అని ప్రశ్నించగా, భృగుమహర్షి (ముక్కామల) పార్వతీ, పరమేశ్వరులలో ఎవరు గొప్పవారో తేల్చుకోవాలని కైలాసం వెళతాడు. అక్కడ శివభటులు (మోతుకూరి సత్యం, జూ.్భనుమతి) వానిని అడ్డగించడం, శంకరుడు పార్వతితో నృత్యం చేస్తూ మహర్షి రాకను గమనించినా పార్వతి నృత్యం పూర్తి చేయమని ముమ్మారు వారిస్తుంది. దానికి భృగుమహర్షి కోపించి, పార్వతిని మూడు రూపాలలో జన్మించమని శపిస్తాడు. ఆగ్రహించిన పార్వతి (బి.సరోజాదేవి) భృగుమహర్షిని రాక్షసునిగా మారమని ప్రతి శాపం ఇస్తుంది. ఈశ్వరుడు పార్వతికి అభయం ఇవ్వగా ఆమె భూలోకంలో భృగుమహర్షి భార్య పులోమి (ఋష్యేంద్రమణి)కి ముగ్గురు ఆడపిల్లలుగా జన్మిస్తుంది. లంబకర్ణుడనే రాక్షసునిగా మారి భృగు వలన ఆ పిల్లలు పకృతి విలయానికి లోనై వేరవుతారు. ఒకరు కోయదొర (డా. శివరామకృష్ణయ్య)కు మరొకరు ఆనంద భూపతి మహరాజు (రేలంగి), ఇంకొకరు మనోరంజని (్ఛయాదేవి) వేశ్యకు లభిస్తారు. కోయగూడెంలో చండీగా, రాజువద్ద ఉమగా, వేశ్యవద్ద గౌరీగా పిలవబడతారు. ఈశ్వరుడు, శంకరుడనే బాలునిగా పులోమి వద్ద పెరుగుతాడు. శివభటులు ఇద్దరూ హాహాహుహు అదే దెయ్యాలుగా లంబకర్ణుని వద్ద చేరతారు. శంకరుడు యుక్త వయస్కుడై అనుచరుడు బాలకృష్ణతో కలిసి ఋషుల రక్షణ చేస్తుంటాడు. లంబకర్ణుని బాధలనుంచి విముక్తి కలిగించాలని బయలుదేరి, హాహాహుహు దెయ్యాల వలన తొలుత ఉప వద్దకు, ఆపైన చండీ, గౌరీలను కలుసుకుని వారిని ప్రేమించి వారి ప్రేమను పొందుతాడు. లంబకర్ణుడు ఉమను చిలకగా మార్చి గుహలో బంధిస్తాడు. ఓ అనాథ ప్రేతానికి శవ సంస్కారం చేసిన శంకరకు, యక్షుడు ప్రత్యక్షమై ‘పరరూపధారణ’ శక్తిని ప్రసాదిస్తాడు. అంతేకాక ఆ మంత్రం వలన, దానిని ఎవరిపై ప్రయోగిస్తే వారి రూపం శంకర్, శంకర్ రూపం వారికి వస్తుందని తెలియచేస్తాడు. లంబకర్ణునిగా మారిన శంకర్ అతని గుహకు వెళ్లి ఉమను కాపాడగా, శంకర్ రూపం వచ్చి మహిమలు లేని లంబకర్ణుని రాజభటులు బంధించి హింసిస్తారు. ఉమతో ఆశ్రమానికి వచ్చి తల్లికి నిజరూపం చూపిన శంకర్ తిరిగి లంబకర్ణుని వద్దకు వెళ్లి ఋషులను హింసిస్తున్న దానిని అంతం చేసి భృగు శాపం తొలగించి మూడు రూపాలలో వున్న ఉమ, చండీ, గౌరీలను స్వీకరించి ఆకసం నుంచి భృగుమహర్షి దంపతుల నాశ్వీరదించటంతో చిత్రం శుభంగా ముగుస్తుంది.
ఈ చిత్రంలో ఉమ చెలికత్తె చతురికగా మీనాకుమారి, లేఖల్ పాఠక్‌గా అల్లు రామలింగయ్య, వంగర, సీతారాం, విటునిగా పద్మనాభం అతని భార్యగా సూర్యకళ, ఛాయాదేవి తమ్మునిగా రమణారెడ్డి, మహరాణిగా గిరిజ ఇతర పాత్రలు పోషించారు. విజయవారి షావుకారు నుంచి రాజేశ్వరి విలాస్ కాఫీక్లబ్ వరకు ఒక్క సిఐడికి తప్ప పసుమర్తి కృష్ణమూర్తిగారే నృత్య దర్శకులు. ఈ చిత్రానికి కూడా తొలుత శివపార్వతులపై (ఎన్.టిఆర్, బి.సరోజాదేవి)లపై చిత్రీకరించిన ‘్థల్లాన’ నృత్యం, ఆపైన ఎన్.టి.ఆర్. కోయగూడెం జానపద శైలిలో అభినయించిన ‘అబ్బలాలో ఓయబ్బలాలో (ఘంటసాల), మరో గీతం ‘ఓ సిగ్గు లొలికే సింగారి పిల్లా’ (ఎన్.టి.ఆర్. బి.సరోజాదేవి (ఘంటసాల, ఎల్.ఆర్.ఈశ్వరి), బి.సరోజాదేవి బృందంపై గీతం ‘నన్నూ వరించు ధీరుడు’ (ఎల్.ఆర్.ఈశ్వరి బృందం) చెప్పుకోదగినంత స్థాయిలో అలరించాయి. మాధవ్ బుల్‌బులే చక్కని ఛాయాగ్రహణంతో చిత్రాన్ని తీర్చిదిద్దారు. ముఖ్యంగా ఉమాశంకరుల విరహగీతం ‘ఏమిటో ఈ మాయా కలలోని కథవలె’ (ఘంటసాల, సుశీల) మరోగీతం ప్రకృతిలో, వనంలో, ఆరుబయట వెనె్నలలో చిత్రీకరించిన గీతం ‘నీ లీలలోనే ఒక హాయిలే నీ ప్రేమ లాలనలో ఒక మాయలే’ (ఘంటసాల, సుశీల) పరవశింపచేస్తాయి. మిగిలిన గీతాలు ‘కలగంటివా చెలి’ ఎన్.టి.ఆర్ (ఘంటసాల) గౌరీపై గీతం ‘ననే్నల మరచినావో దేవా (ఎస్.జానకి), ఉమ చెరులపై గీతం ‘ఆహా సఖి ఈ వనమే’ (సుశీల బృందం), గౌరీపై గీతం ‘సుందరేశ్వరా ఇందు శేఖరా’ (సుశీల) ఋషేంద్రమణిపై గీతం ‘శ్రీ గౌరి నాపాపలై’ (లీల) చివర మాధవపెద్ది బృందం శివస్తుతి, జయజయశంకర ఉమామహేశ్వర (ఘంటసాల).
ఈ చిత్రంలో బి.సరోజాదేవి మూడు పాత్రలకు, ముగ్గురు గాయనీమణులు పి.సుశీల, ఎస్.జానకి, ఎల్.ఆర్ ఈశ్వరి పాడడం. ఘంటసాల ఎన్‌టిఆర్‌కే కాక ధూళిపాళకు ‘శ్రీకరంబై’ పద్యం, చిత్రం చివరి గీతం ‘జయశంకర’ (ముక్కామలపై) పాడడం విశేషం.
ఈ చిత్రానికి సందర్భోచిత మాటలు, పాటలులో పింగళి నాగేంద్రరావు చక్కని స్వరాలతో పెండ్యాల నాగేశ్వరరావు ఆకట్టుకున్నారు.
శంకరునిగా అటు కైలాసంలో ఇటు పార్వతిగా అండగా భూలోకంలో మూడు రూపాల్లో వున్న ఉమ, చండీ, గౌరీలను అలరించే ప్రియునిగా తనదైన చక్కని చిరునవ్వుతో కూడిన, సందర్భోచిత భావప్రకటనలలో ఆకట్టుకునే ఆభినయం చూపారు. అందాల నటి బి.సరోజాదేవి పార్వతితోసహా నాలుగు పాత్రలను చక్కగా మెప్పించినా ఆమె ఆహార్యంలోని కొంత మార్పువలన కొన్ని సన్నివేశాలు ఆకట్టుకోలేక పోయాయి. మిగిలిన పాత్రధారులందరూ, పాత్రల పరిధుల మేరకు నటించారు.
సర్వశక్తిమంతులు ఒక్క క్షణం సహనం కోల్పోతే జరిగే అనర్ధాలను తెలియజేసే ఈ చిత్ర కథను ముగ్గురు ప్రజ్ఞావంతులు పింగళి, కె.వి.రెడ్డి, సింగీతం శ్రీనివాసరావులు రూపొందించగా, ప్రతిభావంతుడైన దర్శకునిగా వాసిగాంచిన కె.వి.రెడ్డి సారథ్యం చేపట్టినా, సన్నివేశాల మధ్య ఉమ, చండీ గౌరీ పాత్రల మధ్య సమన్వయం లేకపోవడం, బాలకృష్ణ, మీనాకుమారి వున్నా చక్కని కామెడీ కుదరకపోవడం, కొంత లోపంగా తోస్తుంది. ఈ చిత్రం నిర్మాతలకు పరాజయం మిగిల్చింది కాని సంగీతపరంగా జనామోదం పొందింది. ఈ చిత్రంలోని కొన్ని గీతాలు నేటికీ సంగీతప్రియులకు ఆనందం కలిగిస్తున్నాయి. పెండ్యాలవారి సంగీత మధురిమలు, పింగళివారి సాహితీ విశిష్టత అట్టివి. జయాపజయాలతో పనిలేకుండా ఓ మంచి ప్రయత్నం- ‘ఉమా చండీ గౌరీ శంకరుల కథ’ చిత్రం సాగిందని భావించాలి.

-సి.వి.ఆర్.మాణిక్యేశ్వరి