Others

బాల్యం.. భాషలు.. తరగతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనిషి మాతృభాష నేర్చుకోవడానికి కష్టపడవలసిన అవసరం ఉండదు. అది సహజసిద్ధంగా వస్తుంది. కొంతమందికి ఒక భాష నేర్చుకుంటే రెండో భాష నేర్చుకోవడం సులభం కావచ్చును. భాషల్లో కూడా సారూప్యత ఉంటుంది. తెలుగువచ్చిన వారికి కన్నడం వస్తుంది. దానినే మనం సోదర భాషలు అంటాం. మాతృభాష మరచిపోయే అవకాశం ఉంటుందా? అని అడగవచ్చును. రెండు సంవత్సరాల వయసులో మాతృభాష మాట్లాడతాడు. కానీ అది అలా గుర్తుండిపోతుందని లేదు. అట్లాంటి పిల్లలను పరాయిదేశానికి తీసుకువెళితే తన మాతృభాష మరచిపోవచ్చును. ఇతర భాషలు మాట్లాడే అవకాశం లేకపోతే అది క్రమంగా మరచిపోవచ్చును. కానీ అది మాతృభాషకు మాత్రం వర్తించదు. చిన్నప్పుడు పిల్లలు ఇతర భాషలు సులభంగా నేర్చుకుంటారు. ఇతర దేశాల్లో పిల్లలు రెండుమూడు భాషల్లో కూడా మాట్లాడతారు. పెద్దలకన్నా చిన్న పిల్లలకు తొందరగా భాషలు అబ్బుతాయి. భాషలు నేర్పటానికి తగిన సమయం బాల్యదశే. కానీ తరువాత ఉపయోగించే అవకాశం ఉండాలి. మూడు భాషలు నేర్చుకోవడం వల్ల పిల్లలపై భారం పెరుగుతుందనడం వాస్తవం కాదు. పెద్దలకన్నా చిన్నలకు భాషా పరిజ్ఞానం తొందరగా అలవడుతుంది. 3 నుంచి 5 సంవత్సరాల మధ్య పరాయి భాషను నేర్పించడం ఒత్తిడేమీ కాదు. కానీ మాతృభాషను మాట్లాడకుండా నిరాకరిస్తే మాత్రం అది ప్రమాదం. ఇతర భాషలను నేర్పడానికి ఎవ్వరూ వ్యతిరేకం కాదు. మాతృభాషను నేర్పకపోతే మాత్రం అది ఆటంకంగా మారుతుంది. తరగతి గది అన్ని భాషలు నేర్చుకునే అవకాశం ఇస్తుంది. తరగతి గది ఔన్నత్యం, గొప్పతనమే అది. ఇల్లు మాతృభాషను నేర్పితే, తరగతి గది అన్ని భాషలు నేర్పుతుంది. తరగతి గదికి ఒకటే ద్వారం ఉండదు. అనేక భాషలు, శాస్త్రాలు నేర్పే ద్వారాలు ఉంటాయి.
తరగతి గది కవచం.. స్కూల్ కల్చర్
తరగతిలో తాను చెప్పదలచుకున్న విషయం అందరికీ అందాలన్నది ఉపాధ్యాయుని కోరిక. కొందరు ఏకసంధాగ్రాహులుంటారు. వారు ఒక్కసారి చెప్పగానే అర్థం చేసుకుంటారు. మిగతావారికి కూడా అర్థం అయ్యే అవకాశం మాత్రం ఉంది. అయితే అది ఆ స్కూల్ కల్చర్‌పై ఆధారపడి ఉంటుంది. పాఠశాలలో పిల్లలకు భయం ఉండకూడదు. ప్రేమ, ఆదరాభిమానాలు ఉంటే ప్రతివారి బుద్ధికుశలత పెరుగుతుంది. సామాన్యంగా ఉపాధ్యాయులకు ఏకసంధాగ్రాహులపైనే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. కానీ మిగతా పిల్లలకు ఎందుకు అర్థం కాలేదని విచారించే ఉపాధ్యాయుడే గొప్పవాడు. విద్యార్థి నేపథ్యం తెలిసి ఉంటే ఉపాధ్యాయుడికి మానవతా లక్షణాలు అలవడతాయి. అప్పుడే ఆ విద్యార్థుల జీవితంలో ఉన్న చీకటి కోణాలు చూస్తాడు. అది ఛేదించాలంటే ఉద్రేకం కన్నా ప్రేమదయతో ఛేదించవచ్చను. ప్రేమ దయవలన విషయంలో ఉన్న క్లిష్ట విషయాలను కనుక్కునే అవకాశం చిక్కుతుంది. అంటే విషయ లోతుల్లోకి పోతాడు. అలాంటి విద్యార్థే ఉపాధ్యాయునికి గురువు. తెలివిగల పిల్లలు ఉపాధ్యాయునికి ప్రేరణ ఇవ్వవచ్చును. ఉపాధ్యాయుని జ్ఞానాన్ని పెంచేది మాత్రం అవగాహన కాని పిల్లలేనని గుర్తించాలి. అందుకు ఉపాధ్యాయునికి సామాజిక కోణం ఉండాలి. దానివలన ఆ పాఠశాలకు కల్చర్ ఏర్పడుతుంది. ఈ సుహృద్భావమైన వాతావరణమే బుద్ధి కుశలతను పెంచడానికి దోహదపడుతుంది. కాబట్టి బుద్ధి కుశలత పెంచేది స్కూల్ కల్చర్. అది తరగతి గది కవచం. ద్వేషం, కోపం స్కూల్ కల్చర్‌కు హాని కలిగిస్తాయి.

-డా.చుక్కా రామయ్య