Others

లోకోపకారం .. పార్వతీ కల్యాణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పరమేశ్వరుని పతిగా పొందిన సతి పరదైవంగా సేవించేది. సతి తండ్రి యైన దక్షుడు ఒకానొక కాలంలో అహంకారానికి లోనైనాడు. నాకన్నా గొప్ప వారెవరూ లేరని అహంకరించడం మొదలు పెట్టాడు. ఆఖరికి శివుడు కూడా తన తరువాతనే నేనే పోనీలే అని నా అల్లుడిని చేసుకొన్నాను కనుక ఈ మాత్రమైనా ఆయనకు పేరు వచ్చింది అనేవాడు. ఇలా క్రమంగా శివదూషణ చేయడానికి కూడా ముందు కురికాడు. యజ్ఞం చేయాలని అనుకొన్నాడు. ఆ యజ్ఞానికి శివుని పిలవకూడదని నిశ్చయించుకున్నాడు. తన పుత్రిక పై కూడా మమకారాన్ని వదిలివేసుకొని శివునికి ఆహ్వానం అందించకుండానే యజ్ఞాన్ని తలపెట్టాడు. సర్వలోకాలు దక్షయజ్ఞం గురించి మాట్లాడుకొంటున్నా తమకు ఆహ్వానం పలుకరేమని సతి వాపోయింది. చివరకు యజ్ఞసమయం దాకా చూచి తన తండ్రినే గదా పిలువకపోయినా ఫర్వాలేదు వెళ్లి ఆ యజ్ఞసంబరాన్ని చూచి వస్తానని తన పతితో చెప్పింది. పిలవని పేరంటం తగదు అని ఆదిభిక్షువు చెప్పాడు. కాని పతి మాట వినక సతి దక్షయజ్ఞానికి వెళ్లింది. అక్కడ నేను పిలవకపోయనా శివుడు సిగ్గు లేక తన పత్నిని పంపించాడు అన్నాడు దక్షుడు. ఇలా శివనింద చేస్తూ పోయాడు. ఆ శివనిందను సతి వినలేకపోయంది. తన పతి చెపితేతాను మాట విననందుకు తన్ను తాను నిందించుకుంది. పతియే ప్రత్యక్ష దైవం అనుకొంది. తాను చేసిన పనికి శిక్ష విధించుకోవాలని నిర్ణయంచుకుంది. వెంటనే అగ్నిగుండంలో దూకింథి. సతి తనువు చాలిం చింది. ఈవిషయం శివుడు విన్నాడు. అపర రుద్రుడ య్యాడు. వెంటనే తన జటాజూటం నుంచి వీరభద్రుని సృష్టించాడు. దక్షునికి దండన విధించమని చెప్పాడు. వీరభద్రుడు శివావేశంతో యజ్ఞవాటికకు వచ్చాడు. యజ్ఞ్ధ్వంసం చేస్తున్నాడు. ఆయన ధాటికి తట్టుకోలేక దేవతలు, మునులు ఎక్కడ వారక్కడ మెల్లగా జారుకున్నారు. శివాదేశంతో వీరభద్రుడు దక్షుని పీచమణిచాడు .
శివుడు సతి మళ్లీ హిమవంతుని కుమార్తెగా పుట్టింది. హిమవంతుడు శివుని తపస్సు చేస్తుంటే పరిచారికగా పార్వతిని పంపించాడు. ఆ తల్లి శివునికి శుశ్రూష చేసింది. శివునిపై అపార ప్రేమను పెంచుకుంది. శివుణ్ణే వివాహం చేసుకోవాలని నిఠ్ణయంచుకుంథి. తల్లిదండ్రుల అనుమతి తీసుకొంది. ఆ తల్లి అడవి బాట పట్టింది. కఠోరమైన తపస్సు ప్రారంభించింది. అపర్ణయై శివునికోసం దీర్ఘ తపస్సు చేసింది. శివుడు వటువు వేషంలో వచ్చాడు. పార్వతిని పరీక్షించాడు. మాయా శివుని పార్వతి మెప్పించింది. శివునిలో ప్రేమోదయమయంది. శివ కల్యాణం కోసం ఎదురుచూసే దేవతలు, మానవులు సంతోషించారు. మేనకా హిమవంతులు శివుని అల్లుని చేసుకోవడానికి దేవతల సాయం కోరారు. అందరూ కలసి శివునికి పార్వతి గురించి చెప్పారు. శివామోదం లభ్యమైంది. అందరి కోరికప్రకారం పార్వతీ కల్యాణం అంగరంగ వైభోగంగా జరిగింది.

- చివుకుల రామ మోహన్