Others

కోపమొచ్చింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలు సహజంగా లేకపోతే కృత్రిమంగా సృష్టించైనా సరే అవకాశాలు రాబట్టడంలో బాలీవుడ్ స్టార్లది అందెవేసిన చేయి. గతంలో కొంతమంది హీరోయిన్లు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తమ అందాలను మరింత పెంచుకొని అవకాశాలను పొందారు. ఇప్పుడు ఆ వంతు అనుష్క శర్మకు వచ్చింది. గతంలో ఆమె తన పెదాలు బాగోవని అనేక ఇంటర్వ్యూల్లో కూడా చెప్పింది. అయితే దానికి ప్లాస్టిక్ సర్జరీ చేయించిందని బాలీవుడ్‌లో మీడియా కథనాలు రాస్తోంది. అయితే ఆ ప్లాస్టిక్ సర్జరీ సరిగా లేకపోవడంతో ఆమె పెదాలు మరింత లావుగా కనిపించాయని, దాని గురించి ఆరా తీయపోతే ఆమె ఎటువంటి సమాచారం ఇవ్వలేదట! అయితే కొన్నాళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు అనుష్కశర్మ అధరాలు అద్భుతంగా అందాలు చిమ్ముతున్నాయట. ఈమధ్యే బయటికి వచ్చి అప్పుడప్పుడు చిలక పలుకులు కూడా పలుకుతోంది. సమయం చూసి మళ్లీ ప్లాస్టిక్ పెదాల గురించి అడిగితే, ఒక్కసారిగా కోపమొచ్చేసింది ఆమెకి. తన పెదవులపై కత్తులుపెట్టి బాగుచేయించాల్సిన అవసరం లేదని, ఇంకోసారి ఇలాంటి విషయాలు తనవద్ద మాట్లాడవద్దని చెడుగుడు ఆడేసింది. మొదట్లో తనకి మేకప్‌పై సరైన అవగాహన లేకపోవడంతో పెదవులు లావుగా కనిపించాయని ఇప్పుడు మేకప్ పర్‌ఫెక్ట్ అవడంతో మీకు తేడా కనిపిస్తోందని వివరణ కూడా ఇచ్చింది. అదీ సంగతి!