Others

కాళీయుని గర్వం.. కృష్ణ పాదస్పర్శతో దూరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యమునానదిలో ఒక చోట కాళీయుడు తన నివాసాన్ని ఏర్పరుచుకున్నాడు. ఉండగా ఉండగా స్థానబలిమి పెరుగుతున్నట్లుగా కాళీయునికి బలం పెరిగింది. తనకే విషము అనే బలాన్ని పరమేశ్వరుడిచ్చినట్లు అది తన గొప్పతనం అనుకొనేస్థాయికి ఎదిగాడు. తన భార్యలతో, బిడ్డలతో ఆ నివాసాన్ని మరొకరు కాలు పెట్టకుండా చేశాడు.విషపు జ్వాలలతో యయున నీటినంతా కలుషితం చేసేశాడు. ఎవరి ఆ నీటిని ముట్టుకున్నా వారు ఆ కాళీయుని విషపు బారిన పడేట్లుగా చేసేశాడు. రానురాను ఆ కాళీయుడున్న ప్రదేశంలో పైన పక్షులు ఎగురినా అవి కూడా ఈ విషపుజ్వాలలు ఎగిసి ఆ పైన ఎగిరే పక్షులు సైతం ఆ విషజ్వాలలకు బలియై చనిపోయేవి.అంతగా తన విషాన్ని విరజిమ్మే ఆ కాళీయుని అహం తగ్గించాలని శ్రీకృష్ణుడు అనుకొన్నాడు. వెంటనే యమునా నది ఒడ్డున ఉన్న కడిమి చెట్టును చూశాడు. ఆ చెట్టు శాఖోపశాఖలుగా విస్తరిల్లి అందరికీ నీడ నిస్తూ ఉంది. కాని ఆ నీడను కూడా కలుషిత వాయువులతో నాశనం చేసే కాళీయుడు బలిమి యై తిరుగాడుతున్నాడు.
శ్రీకృష్ణుడు ఆ కడిమి చెట్టు పైకి ఎక్కి ఉన్నట్టుండి బలంగా ఆ నదిలో దూకాడు. విషపూరిత జలాలను తన బాహువులతో వేగంగా కదిలిస్తూ అటు నుంచి ఇటు ఈదసాగాడు. అట్లా అల్లకల్లోలం చేస్తున్న నీటిని వేగ శబ్దాన్ని విన్న కాళీయుడు చిరాకు పడ్డాడు. తానుండగా ఎవరీ నీటిలో అడుగు పెట్టి శబ్దాన్ని పుట్టిస్తున్నారు అనుకొని పైకి వచ్చాడు. ఓ చిన్న బాలకుడా ఇంత సాహసం చేస్తున్నాడు వీడిని ఒక్కసారి నా తోకతో తాటిస్తే చాలు వాడు ప్రాణాలు ఉగ్గబడ్తాడు అనుకొని తన తోకను తలను ఆడిస్తూ కృష్ణున్ని కమ్మివేశాడు. జగన్నాటక సూత్రధారి ఆ కాళీయుని బలానికి అడ్డుకోలేనట్టుగా ఒదిగిపోయాడు. సొమ్మసిల్లినట్టు అయ్యా డు కుర్రవాని బలహీనతనుచూసి మరింతగా రెచ్చిపోయాడు కాళీయుడు.
అంతలో తమతో పాటు రావాల్సిన కృష్ణుడు కనిపించలేదని గోపబాలకులు చూసుకొన్నారు. అయ్యో మనం ఆ కాళీయుని చెర నుంచి తప్పించుకుని వచ్చేశాము. కాని ఆ కృష్ణుడు రాలేదే అని వారు కన్నీరు కారుస్తూ తమ పెద్దలకు జరిగిన విషయం చెప్పారు. ఆ సంగతి విని హతాశులయ్యారు గోపజనం.
అంతగా నందయశోదలతో చేరి పరుగుపరుగున కృష్ణుని వెతకడానికి బయలు దేరారు. బలరాముడు వారితో వచ్చాడు. నడవగా నడవగా వారికి గోపబాలకుల అడుగుజాడలు, వాటి మధ్యలో కృష్ణుని అడుగులు కనిపించాయి. ‘ఇదిగిదిగో కృష్ణుని అడుగులు పడి ఉన్నాయి. ఇక్కడికి దగ్గరలో ఎక్కడైనా ఉన్నాడేమో చూడండి’అంటూ అందరూ తలా ఒక దిక్కుకు పరుగెత్తారు.
అంతలో వారికి కాళీయుని బాహువుల్లో చిక్కిన కృష్ణుడు కనిపించాడు. అదిగో ఆ కృష్ణుడిని పాము చుట్టేసి ఉంది. అయ్యో దాని విషం చేత కృష్ణయ్యకు అపాయం వాటిల్లినట్టు ఉంది అని అరిచారెవరో. యశోద ఆ దృశ్యం చూసి కనులు తిరిగి పడిపోయింది. నందుడు ఆమెను పట్టించుకోకుండా కృష్ణా కృష్ణా అంటూ ముందుకు ఉరకపోయాడు. మిగతావారు అతన్ని పట్టుకొని ఎలుగెత్తి కృష్ణా అని అరుస్తున్నారు. ఆ అరుపులకు యశోదకు తెలివి వచ్చింది. కృష్ణుని స్థితిని చూసింది. అయ్యో కృష్ణా ఇదేమి విధి. నేడు ఇలా మారింది. ఆపదలు వచ్చిన ప్రతిసారి నీవు రక్షించబడేవాడివి కదా. ఇపుడు నీవే కనులు మూసి పడుకొంటే ఇక మాకు దిక్కెవరు? అని వాపోయారు.

- చరణ శ్రీ