Others

వయసు పనె్నండేళ్లు... మూడు డిగ్రీ పట్టాలు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనె్నండేళ్ల తనిష్కా అబ్రహాం పిన్న వయసులో డాక్టర్ పట్టా పుచ్చుకునేందుక ఉవ్విళ్లూరుతున్నాడు. తనకు 18 ఏళ్లు వచ్చేసరికి డాక్టర్ పట్టా పుచ్చుకుని వైద్యం చేయాలని కలలుకంటున్నాడు. ఇందుకు రెండు విశ్వ విద్యాలయాలు సైతం ఈ చిన్నారి ప్రతిభకు అచ్చెరవొంది సీటు ఇచ్చేందుకు ముందుకు రావటం గమనార్హం. వివరాల్లోకి వెళితే... కేరళకు చెందిన తనిష్కా అబ్రహాం కుటుంబం అమెరికాలోని కాలిఫోర్నియాలో స్థిరపడింది. తండ్రి బిజో అబ్రహాం సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. తల్లి తాజీ వెటర్నరీ వైద్యురాలు. ఆరేళ్ల అబ్రహాం తాను కాలేజీకి వెళ్లి చదువుకుంటానన్నపుడు తొలుత తల్లిదండ్రులు ఆశ్చర్యపోయారు. ఆ చిరుప్రాయంలోనే కన్నవారికి నచ్చజెప్పి అమెరికన్ రివర్ కాలేజీలో చేరాడు. ఆ కాలేజీలోని ప్రొఫెసర్లు మొదట్లో అంగీకరించలేదు. చివరకు ఒకేఒక ప్రొఫెసర్ అంగీకరించాడు. ఈ బుడతడు ఏం చదువుతాడులే అని అనుకున్నారు. కాని అధ్యాపకుల అంచనాలను తలకిందులు చేస్తూ ఆ కాలేజీలోని టాప్‌లో నిలిచాడు. చిన్నారి అబ్రహాం ప్రతిభా పాటవాలు గురించి విన్న ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సైతం ఆశ్చర్యపోయి అభినందనలు తెలియజేయటం గమనార్హం. తొమ్మిదేళ్లు వచ్చేసరికి అమెరికాలోని కాలేజీకి వెళ్లి చదువుకోవటం ప్రారంభించాడు. పదకొండేళ్లు వచ్చేసరికి మ్యాథ్స్, సైన్స్, విదేశీ భాషలలో డిగ్రీలు సంపాదించాడు. ప్రస్తుతం పనె్నండేళ్ల అబ్రహాం తనకు 18 ఏళ్లు వయసు వచ్చేనాటికి ఎండీ (మెడికల్ డిగ్రీ) సాధిస్తానని ఆత్మవిశ్వాసాంతో టివీ ఇంటర్వ్యూలో వెల్లడించటం విశేషం.