Others

బహుమతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రేమ స్వరూపుడు యేసు. ప్రేమను పంచటమే ఆయన తత్వం. పాపం చేయడం మనుష్యుల సహజ గుణం. పశ్చాత్తాపం చెందటం, పరివర్తన చెందటమూ మనుషులకు సహజమే. కాని పరివర్తన చెందటం అంత సులభం కాదు. యేసు పాపం చేసినవారికి శిక్ష విధిస్తే పాపమనేది మరణించడం జరగదు. పాపం అనేది జీవించే ఉంటుంది. అసలు శిక్ష అనేది పాపానికే వేయాలి అంటారు. నీకు జన్మనిచ్చిన తల్లి దండ్రులను, నీ క్షేమంకోరే బంధువులను,నీ ఉన్నతిని కోరే స్నేహితులను, నీకు విద్యాబుద్ధులు చెప్పి జ్ఞానోపదేశం చేసే గురువులను నిర్లక్ష్యం చేయకు. వారిని ప్రేమతో చూడు. నీ తోటివారికి ప్రేమను పంచుము ఈ అమృతవాక్కులే యేసు చెప్పింది... నువ్వు నిన్ను ప్రేమించుకుంటున్నట్లే నీ పొరుగువాణ్ణి ప్రేమించు . ఈ అద్భుతమైన ఆనందకరమైన సందేశాన్ని యేసు ప్రతివారికీ ఇచ్చాడు. సన్మార్గులను, దుర్మార్గులను, పాపం చేసినవారిని, పుణ్యం చేసినవారిని ఒక్కలాగే చూడగలిగితే నిజమైన యేసుక్రీస్తు ప్రేమను పొందగలిగిన జీవివి అవుతావు. మరి నీకు యేసు ప్రేమ కావాలంటే ఇక నీవెలా జీవించాలో నీవే నిర్ణయించుకో... యేసు ఎవరినీ దేనికీ బలవంతం చేయడు. నీవు ఏమిచ్చినా యేసు మాత్రం ప్రేమనే పంచుతాడు... నీవు ప్రేమ, కరుణ, క్షమ కలిగినట్లయితే యేసు మార్గంలో ఉన్నట్లే ... యేసు ఒకసారి తన శిష్యులకు ఇలా చెప్పారు.. ఒకసారి ఓ గొర్రెల కాపరి వంద గొర్రెలను మేపుతుండగా ఒక చిన్న గొర్రెపిల్ల తప్పిపోయింది. ఆ చిన్న గొర్రె పిల్లకోసం అతడు తల్లడిల్లిపోయాడు. ఈ తొంభైతొమ్మిది గొర్రెలు ఒకచోట ఉంచి తాను తప్పిపోయిన గొర్రె కోసం వెదుకులాట ప్రారంభించాడు. గిరులు, తరులు, పొదలు, వాగులు, వంకలు ఇలా అన్ని చోట్ల గొర్రె కోసం గాలించాడు. చివరకు ఒకచోట అలసిపోయి పడుకొని వున్న తన గొర్రెపిల్లను చూశాడు. ఎంతో ఆనందంతో దాన్ని రెండు చేతులతో ఎత్తుకొన్నాడు. తన భుజాలపై ఎక్కించుకున్నాడు. ఆనందంతో తిరిగి తన గొర్రెల మంద దగ్గరకు వచ్చాడు. ఆ గొర్రెపిల్ల ఎలా తప్పిపోయింది తాను ఎలా కనుకొన్నది కథలు కథలుగా తన స్నేహితులకు చెప్పాడు.
అదేవిధంగా మీరు ఏవేవో ఊహలతో ఎక్కడెక్కడ తిరిగినా నేను మిమ్ములందరినీ ఒకదరికి చేరుస్తాను. నా ప్రేమతోనే మీరంతా నా చెంతకు వస్తారు. మీరంతా కూడా ప్రేమను పంచుతూ మన వాళ్లందరినీ ఒక దరికి చేర్చండి.. ఇది యేసు ఇచ్చిన సందేశం.. కనుక మనమందరమూ యేసు చూపిన దారిలో నడుద్దాం.. యేసు పంచుమన్న ప్రేమను పంచుదాం.