Others

సింహాల నోటికి చిక్కాలనుకున్నాడు! ( వార్త-వ్యాఖ్య)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చావుకి చచ్చినన్ని కారణాలుంటాయ్. కానీ, ఆత్మహత్యకి అది చేసుకోవాలనుకున్నవాడికి- సింహాల నోట్లో తలపెట్టి వాటికి విందు భోజనంగా చావాలని కోరుకోవడం చిత్రాతి చిత్రం!
చిలీ రాజధాని శాంటియాగోలో ఒక ఇరవై ఏండ్లు కుర్రాడు ఫెర్రాడో రోమన్- పోయిన శనివారం జంతు ప్రదర్శనశాలకు వెళ్లి, టికెట్ కొనుక్కొని మరీ సింహాలశాల (బోను)కి వెళ్ళాడు. ఆటవిడుపురోజు కాబట్టి పిల్లా పాపలతో వందలాది కుటుంబాలు చూస్తూండగా- రుూ కుర్రాడు సింహాల బోనులు వున్న దగ్గరికి పోయి- దుస్తులు విడిచిపెట్టి- పైకప్పుమీదకి పాకాడు. ఒక్కతాడు మాత్రం తనతో తీసుకుపోయాడు. దాని సాయంతో, దిశమొలతో సింహాలమధ్యకు దూకాడు. వాటితో కొంచెంసేపు చెలగాటమాడాడు. ఐతే ఒక మగసింహం, ఆడసింహం నరమాంస వాసనకు యింక వుండబట్టలేక, అతడిమీద పడి చీల్చి చెండాడడం మొదలెట్టాయి. ఇంతలో జూ అధికారిణి, రక్షక సిబ్బంది హుటాహుటిన వచ్చి- రుూ ‘రోమన్ ది యింగ్‌మాన్’ని కాపాడాలని కొదమ సింహాలమీద మత్తు తుపాకీ గోళీలు సంధించారు. అవి వాటిమీద ప్రభావం చూపించలేదు. ఒక మనిషి ప్రాణం కాపాడడం జంతువు ప్రాణంకన్నా ముఖ్యం అనుకుని రెండు సింహాలనీ తుపాకీలతో కాల్చిచంపేశారు. కుర్రవాడు కేవలం మాంస ఖండాలు, ఖండాలుగా మిగిలివున్నా చావలేదు. ఆసుపత్రికి తీసుకుపోయారు. అతను ఆత్మహత్యకు పూనుకున్నట్లుగా అతని జేబులో వున్న ఉత్తరం చెబుతోంది- కానీ టైము రావాలిగా.
ఇదే మాదిరి సంఘటన మొన్న ఆదివారంనాడు హైదరాబాద్‌లో కూడా జరిగింది. మెట్రో రైల్వేలో కార్మికునిగా పనిచేస్తున్న రాజస్థానీ వాసి ముఖేష్ (35) తప్పతాగి, హైదరాబాద్ జూలో ప్రవేశించి సింహాల లోగిలిలోకి దూరిపోయాడు. ఒక ఆఫ్రికన్ సింహం జంటని కవ్వించాడు. కాకపోతే ముఖేష్‌కి నేలమీద నూకలున్నాయి. పాపయ్య అనే జంతు పరిరక్షక ఉద్యోగి ఆ సింహాలను ఏమార్చి మరోవైపుకిపోయేలాగా చేసి, రుూ తాగుబోతుని రక్షించాడు.
ముఖేష్‌కి మతిస్థిమితం దిట్టంగా వున్నదని తేలింది. కాకపోతే అతనికి ఎంతోకాలంగా సింహం దగ్గరికిపోయి ‘హాయ్ నేస్తం!’’ అంటూ షేక్‌హ్యాండు చేయాలన్న బలీయమైన కోరిక వుందిట. త్రాగినప్పుడు ఆ కోరిక చెలరేగిపోతుందిట.
శాంటియాగో యువకుడు తాను చావబోయి రెండు అపురూపమైన సింహాలను బలి తీసుకున్నాడు. శాంటియోగో జూ లేడీ ఆఫీసర్- ‘‘ఈ సింహాలు ఇరవై సంవత్సరాలుగా మా సొంత సంతానంగా చూసుకుంటున్నాము. కానీ మనిషి ప్రాణం ముఖ్యం కదా?’’ అన్నది. కానీ జీవకారుణ్య సంఘం (చిలీ) వారు ఆమె మీదా, సిబ్బందిమీదా కేసు పెట్టారు. అదీ తాజా వార్త!
‘సూప్’కి అంత రుచి ఎలాగా?
రైల్వే భోజనంమీద ఫిర్యాదులూ, పశ్చాత్తాపాలూ మామూలేగానీ, మొన్న ఆదివారం ‘దురాంతో’ ఎక్స్‌ప్రెస్ రైల్లో హాయిగా ఎర్నాకుళం నుంచి ముంబాయికి ప్రయాణం చేస్తున్న ప్రయాణీకులలో కొందరికి టొమాటో సూప్ మహా రుచిగా అనిపించి, లొట్టలేస్తూ తిన్నారుగానీ, బి4 కోచ్‌లో ప్రయాణం చేస్తున్న ఒక బృందానికి యింత రుచిగా ఇంత కమ్మగా సూప్ ఎలా చేస్తున్నారబ్బా? అన్న ఆశ్చర్యం వేసి, వాళ్లు కుతూహలం చంపుకోలేక పాంట్రీకారు కిచెన్‌లోకి వెళ్ళారు. షాక్ అయిపోయారు. పాంట్రీ కిచెన్‌లోని సిబ్బంది టొమేటో సూప్‌లో టాయ్‌లెట్ పంపులోని నీళ్లు కలుపుతూ దొరికిపోయారు. అంతా డోక్కున్నంత పనిచేస్తూ ఖాజీకోడ్ స్టేషన్‌లో స్టేషన్ మాస్టర్‌కి లిఖితపూర్వకంగా ఫిర్యాదు రాసి ఇచ్చారు. ఒక లేడీ ప్యాసింజరు, ‘‘అన్నట్లు ఫిర్యాదు బుక్కు వుంటుంది కదూ?’’ అంటూ రైల్లోని ఫిర్యాదుల పుస్తకం అందుకుంది. ఆశ్చర్యం! దాన్నిండా కుప్పలు కుప్పలు ఫిర్యాదులు. చూసేనాధుడు (దిక్కు)లేక మూలుగుతున్నాయి. బిర్యానీలో బొద్దింకలు మొదలు స్లీపర్ కోచ్ పరుపుల్లో నల్లులదాకా లెక్కలేనన్ని ఫిర్యాదులున్నాయ్.
‘‘పొరపాటున టాయిలెట్ పంపు నీళ్లు కలిశాయేమోగానీ సాధారణంగా మంచినీరే వాడతాం’’ అన్నారు సిబ్బంది. రైల్వే అధికారులు- ‘‘సాధారణంగా మేం పాంట్రీ కారులో తయారుచేసిన పదార్థాలను ఒక అధికారికి రుచి చూపిస్తాం. అలాగే చేశాం. రుచి విషయంలో పేజీ ఏమీ లేదు కదా?’’ అన్నారు.
అందుకే పంజాబీలు రొట్టెల దొంతర్లు, కర్రీలు, చెట్నీలు భారీగా పట్టుకుని మరీ రైలెక్కుతారు’’ అన్నాడో ప్యాసింజరు. అతను ఢిల్లీ వాసి. ‘దురంతో ఎక్స్‌ప్రెస్’ దేశంలోని ప్రతిష్ఠాత్మకమైన రైలుబండ్లలో ఒక్కటి కదా? మరి ఇలా ఉందేమ్?
ఎండకన్నా తీవ్రం ఒంటె కోపం!
మనదేశంలో రుూసారి కనివినీ ఎరుగని ఎండలు కాస్తున్నాయ్. 1956లో 50.6 డిగ్రీల ఎండ రికార్డయిది. ఈసారి ఆ రికార్డు వెనుకబడిపోయింది. 51 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది! అని మన వాతావరణ శాఖ అధికారికంగా వెల్లడించింది. పైగా రుూసారి అదనపు బాధ ‘ఉక్కబోత’లు.
ఈ ఎండ తీవ్రత జంతువులమీద మరీ వున్నది. ఒంటెని లొట్టిపిట్ట అనీ, ఎడారి ఓడ అనీ అంటారుగానీ- అవి కూడా జంతువులే కదా? నీడకోసం పరుగులు తీస్తాయ్. రాజస్థాన్‌లోని బర్మార్ జిల్లాలోని ఓ గ్రామంలో ఉర్జారాయ్ అనే పెద్దమనిషి తన లొట్టిపిట్టని కాళ్ళకి బంధాలు వేసి మరీ రాటకి కట్టి, ఎండలో వదిలేశాడు. శనివారం రాత్రి చుట్టపక్కాలతో మజాగా గడుపుతున్న సమయంలో ‘‘అరె! నా ఒంటెని ఎండలో కట్టి వదిలేశానే?’ అని నాలిక్కర్చుకుని బయటికి పరుగులు తీశాడు. అప్పటికే ‘లొట్టిపిట్ట’ అగ్గిబరాటా అయిపోయింది. దాని కట్లు విప్పాడో లేదో అది దాని భాషలో తిడుతూ, పళ్లు కొరుకుతూ- నోటితో ఉర్జారాయ్ మెడ పట్టుకుని విసిరి అవతల పారేసింది. ‘‘ఏనుగా? ఒంటా?’’ అనుకునేలోగానే కసాపిసా మట్టేసింది. ఖండ ఖండాలుగా అతని శరీరం మారింది. అతని తలకాయను కొరికిపారేసింది. చివరికి పాతికమంది నానాతంటాలు పడి దాన్ని నిలదీశారు. ఎడారి ఓడ ఒంటె పరిస్థితే అలా వుంటే ఎండలకి మరి మిగతా జంతువుల మాటేమిటి? ‘జూ’లో ఎయిర్‌కూలర్లు, ఎ.సి. యూనిట్‌లు, ఫ్యాన్‌లు వగైరా జంతువుల కోసం ఏర్పాటుచేస్తున్నారులెండి...
బాబోయ్! బంగారు నాణేలు!
మధ్యప్రాశ్చ్య దేశాలనుంచి వచ్చే ఏ విమానంలోనైనా కిలోలకొద్దీ బంగారం, బంగారు నాణాలు దొరుకుతాయి. దోహా-అమృత్‌సర్‌లమధ్య నడిచే ఖతార్ ఎయిర్‌లైన్స్ విమానం ప్రయాణీకుల చెకింగ్ పూర్తి అయింది గానీ బంగారం దొరకలేదు. కాకపోతే కస్టమ్స్ అధికారులు విమానం టాయలెట్స్ చెక్ చేశారు. 246 బంగారు నాణాలు దొరికాయి. వాటి విలువ యాభై ఏడు లక్షల రూపాయలుంటుంది. సాధారణంగా దుబాయ్ ఖతార్‌లాంటి దేశాలనుంచి వచ్చే విమానాల్లో బంగారం బిస్కెట్లు దొరకకపోతేనే ఆశ్చర్యం! ఇది పోయిన ఆదివారం సంఘటన

-వీరాజీ