Others

కోరుకొనేది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భగవంతుడు 21 అవతారాలు దాల్చాడు. తాను సృష్టించిన మానవులకు బుద్ధివివేక విచక్షణాలను ఇచ్చాడు. ధర్మం చేయమని చెప్పాడు. సత్యంపలుకమని చెప్పాడు. మనిషి తన అజ్ఞానమనే అంధకారం నుంచి బయటకు రాలేకపోయాడు. అపుడు భగవంతుడే శ్రీరామునిగా వచ్చాడు. మనిషిగా పుట్టి మనిషిగానే ఎదిగాడు. రాజకుమారుడైనా సామన్యవ్యక్తిగా మసలుకున్నాడు. రాజకుమారుడైనా రాజ్యాన్ని తృణప్రాయంగానే చూశాడు. భరతునికి రాజ్యం కావాలనే అమ్మకోరికను నాన్న వేదవాక్యంగా భావించి అడవులకు పయనమైనాడు. భర్తను బట్టే భార్య అన్నట్టుగా అపురూపంగా పెరిగిన జనకుని కూతురు జానకి రాముని వెంట సీతమ్మగా పయనమైంది. సోదరుని ప్రేమకు మచ్చుతునక లక్ష్మణుడు. అన్నావదినలే అమ్మనాన్నలుగా భావించినవాడు. వారు కష్టపడుతుంటే తాను మాత్రం హంసతూలికాతల్పంపై ఎలావిశ్రమిస్తాననుకొన్నాడు. అన్నవెంట అరణ్యాలకు బయలుదేరాడు. కష్టసుఖాల్లో పాలుపంచుకున్నాడు. వేదనచెందే రామునికి తోడుగా నిలిచాడు. లక్ష్మణుడు ఆదర్శసోదరుడుగా చరిత్రలో నిలిచాడు.
రావణుడు అపహరించిన సీతమ్మను వెతికి తెచ్చుకోవడానికి రాముడు వానరులతో స్నేహం చేశాడు. సుగ్రీవునికున్న చింతను దూరం చేశాడు. వారి స్నేహాన్ని బలోపేతం చేసుకొన్నాడు. ఆంజనేయుడు రామునికి నమ్మిన బంటుగా నిలిచాడు. శత్రురాజ్యంలోని విభీషణుడు రాముని గుణగణాలను మెచ్చుకుని రాముని చెంతకు వచ్చి నిలిచాడు. రాముడు రావణునితో పోరు సల్పి విజయుడై నిలిచాడు.సీతారాములుగా తిరిగి అయోధ్యాప్రయాణం చేశారు. భరతుడు తనకుతానే రాజ్యాన్ని రామునికి అప్పగించాడు. రామలక్ష్మణభరతశత్రుఘు్నలు అయ్యోధనేలారు. రామరాజ్యం సుస్థిరంగా 11వేలయేండ్లు సాగింది.రాముని చరిత్రలో ఉన్నవారంతా కీర్తిమంతులు అయ్యారు.రాముడు చారిత్రిక పురుషుడుగా కీర్తనలందుకుంటున్నాడు. విద్యావివేకాలతో విలసిల్లిన త్రేతాయుగ రామరాజ్యాన్ని నేడు కూడా కోరుకుంటున్నారు.