Others

జనన మరణ రహస్యం (ప్రసాదం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ చరాచర సృష్టిలో ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువు, పుట్టుకకి ఓ లక్ష్యం ఉంది. ఓ తత్త్వముంటుంది. ఉత్కృష్టమైన మానవులుగా పుట్టిన మనం ఎందుకు పుడుతున్నాం? ఎందుకు మరణిస్తున్నామనీ- ప్రశ్నలకి సమాధానం కోసం కొంచెం లోతుగా పరిశీలించాలి. పరిశీలన చేయాలి.
‘‘మనిషి మళ్లీ మళ్లీ పుట్టకపోతే అతడు స్వర్గద్వారాలు చేరుకోలేడు’’ అంటుంది బైబిల్. ‘‘మనం ఎందుకు పుడుతున్నాం అంటే మరిక పుట్టుక లేకుండా చేసుకోవడానికి. మనం ఎందుకు మరణిస్తున్నాం అంటే- మరిక మరణం లేకుండా చేసుకోవటానికి’’ అని అంటున్నాయి హిందూ శాస్త్రాలు.
బైబిల్ ఆ రకంగా చెప్తోంది. హిందూ శాస్త్రాలు ఈ రకంగా చెబుతున్నాయి. ఏమిటి తేడా? రెండూ చూడటానికి వైరుధ్యంగా అనిపిస్తాయి. వ్యతిరేకంగా ఉన్నట్టు కనిపిస్తాయి. కొంచెం లోతుగా మూలాల్లోకి వెళ్లి ఆలోచిస్తే.. రెండూ ఒక్కటే!
ఎలాగో చూద్దాం! నీలో ఉన్న అన్ని బంధాలని బంధనాలని తెంచుకున్నావనుకుందాం. అంటే, బంధనాలు లేని నువ్వుగా తయారయ్యేవు. అది ఒక పుట్టుక. ఆ తర్వాత నీలో ఉన్న దుర్గుణాలన్నింటినీ తొలగించుకున్నావనుకుందాం. సద్గుణాల నువ్వుగా పుట్టేవు అన్నమాట. అవలక్షణాలను, అరిషడ్వర్గాలను ఒక్కటొక్కటిగా నిర్మూలించుకుంటున్న ప్రతి పర్యాయం, అవి లేని నువ్వుగా మళ్లీ పుడుతున్నావన్నమాట. చివరికి అలా.. అలా.. కొత్త కొత్త పుట్టుకలు పుట్టిన నువ్వు, నీలో ఉన్న ‘నీవే’ అయిన దివ్యత్వంగా మిగిలిపోతావు, నిలిచిపోతావు.
అప్పుడు నీకు చేరువ అయ్యేది ఆ ‘కింగ్‌డమ్ ఆఫ్ హెవనే’! అదే మనం అనుకునే బ్రహ్మలోకం. ఇదీ- బైబిల్ చెప్పే సూక్తి వెనుక దాగున్న అంతరార్థాం.
ఇపుడు హిందూ శాస్త్రాలు చెప్పే విషయాన్ని పరిశీలిద్దాం. మానవులుగా పుట్టేం. పుట్టేం కదా అని ఏ రకమైన దిశా నిర్దేశం లేకుండా ఏమిటేమిటో చేస్తాం. ఫలితంగా ‘కర్మలు’ అనే చిక్కులలో చిక్కుకుంటాం. తత్పలితంగా మళ్లీ మళ్లీ పుడతాం.
అలా కాకుండా, సత్కర్మలతో, సచ్చింతనతో, సర్వేశ్వర ప్రత్యీర్థంగా జీవితాన్ని గడుపుతూ, పునర్జన్మకి తావిచ్చే ఏ రకమైన చర్యలు చేయకుండా జన్మరాహిత్యం పొందగలిగే స్థితికి మనం చేరుకుంటే- అపుడు మనకి మిగిలేది అమరత్వమే! అందుకునేది అమృతస్థానమే! ఇదీ- మనం ఎందుకు పుడుతున్నామంటే, మరిక పుట్టుక లేకుండా చేసుకోవడానికి అనే దాంట్లోని గూఢార్థం. ఇపుడు- మరణిస్తున్నామంటే మరిక మరణం లేకుండా చేసుకోవడానికి అనే విషయాన్ని విచారిద్దాం. మనం మరణిస్తున్నాం. కానీ... బతికినన్నాళ్లు చేసిన కర్మలవల్ల రుణగ్రస్తులమై మళ్లీ పుడుతున్నాం. పుట్టేం కాబట్టి తెలిసి కొన్ని, తెలియక కొన్ని ఏవేవో పన్లు చేస్తాం.
ఆ కారణంగా మళ్లీ పుడతాం. అలా కాకుండా జీవిస్తున్న కాలంలోనే సాధనతో జన్మరాహిత్య స్థితికి చేరుకుని మనం మరణించినట్లైతే మళ్లీ మనం పుట్టం. పుట్టుకే లేనపుడు మళ్లీ మరణించవలసిన అవసరమే ఉండదు. అప్పుడు మరణం అనేది ఉండదు. ఇదీ- మనం ఎందుకు మరణిస్తున్నామంటే- మరిక మరణం లేకుండా చేసుకోవటానికి అనే దాన్లో దాగున్న ఆధ్యాత్మికార్థం! ఆ యోగ స్థితిని మనం పొందటానికి మనం ప్రయత్నించాలి. జన్మరాహిత్యం పొందటానికి మనం జీవించే కాలమంతా జాగరూకతతో మెలగాలి. జీవితమంతా సాధన చేయాలి. సాధన ద్వారా జన్మరాహిత్య యోగం పొందగలగాలి.
అదే మన జీవన గమన్యం! అందుకు మనం మహనీయుల బోధల్ని అర్థం చేసుకోవాలి. మహాగ్రంథాలు అందించే ప్రబోధనల్ని ఆకళింపు చేసుకోవాలి. మహనీయుల మార్గాలను అనుసరించాలి. ఆ మహనీయుల్ని అనుకరించాలి. వాళ్ళందించిన దివ్య బోధనల్ని ఆచరించాలి. ఆచరణలో పెట్టాలి. అనుభవించాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలి. మనం తరించాలి, మన జీవితాలను తరింపచేసుకోవాలి.

- రమాప్రసాద్ ఆదిభట్ల 9348006669