Others

ఏకాగ్రత కోసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆలయాలు ఆధ్యాత్మిక శాస్త్భ్య్రాస కేంద్రాలు. సత్య విజ్ఞాన సాధనాలయాలు. జీవిత రహస్య పరిశోధనాశాలలు. మానసిక రోగ వైద్యశాలలు. మానవాత్మను జాగృతంచేసే మాతృ నిలయాలు. సహస్రాబ్దాలనాడు భారతీయ ఆధ్యాత్మికతను అధ్యయనం చేయడానికి, విజ్ఞాన శాస్త్రాన్ని ఆకళింపు చేసుకోడానికీ ప్రాచ్య, పాశ్చాత్య దేశాల నుండి ఎందరెందరో వచ్చారు. వారికి ఈ ఆలయాలు విశ్వవిద్యాలయాలుగా రూపుదిద్దుకున్నట్లు చరిత్ర చెబుతుంది.
దేవుని సగుణ రూపంలో చూడడానికి ఆస్కారమిచ్చేవి దేవాలయాలు. అక్కడ దేవుని రూపాన్ని చూసి చంచలమైన మనస్సుపై అదుపు సాధించవచ్చు. ఏకాగ్రతను కుదుర్చుకోవచ్చు. మనోవీధిలో దేవాలయంలోని దేవునే రూపునే తీర్చిదిద్దుకుని ప్రతిరోజూ పూజించుకోవచ్చు. స్థూల సూక్ష్మకారణ శరీరాలవలె ముఖ మండపం, అంతరాలయం, గర్భాలయం నిర్మాణం జరిగింది. హృదయం వంటిది గర్భాలయం. అక్కడ విరాట్ స్వరూపుడు అధిష్టానమై ఉంటాడు. అదే ఈశ్వర పీఠం. విరాట్ కదలదు. అందుకే ఉత్సవ విగ్రహం. ఒకటి నిర్గుణం రెండవది సగుణం. రెండూ ఒక్కటే. ఒకటి వ్యక్తం. రెండవది అవ్యక్తం. ఇది అర్థంచేసుకుని హృదయంలో దైవాన్ని దర్శించాలి. గుడులనుండి మనం గ్రహించవలసిన సందేశం ఇదే!