Others

ఆరోగ్యానికి ఛింత చిగురు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సీజన్‌లో మాత్రమే లభించే చింతచిగురులో రుచికి పుల్లగా ఉంటుంది. పోషక పదార్థాలతోపాటు, ఔషధ గుణాలు ఉన్నాయి. ఆరోగ్యపరంగా చింతచిగురు ఎంతగానో ఉపయోగిస్తుంది. అజీర్తిని తొలగించి జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేస్తుంది. నెత్తురు పట్టేలా చేస్తుంది. ఇందులో విటమిన్ సి, ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లూ ఉంటాయి. కామెర్ల వ్యాధి నివారణకు సాయపడుతుంది. కడుపులోని నులిపురుగులను చంపేసి వ్యాధుల నివారణకు తోడ్పడుతుంది. గుండె జబ్బులు రాకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. కాన్సర్ గడ్డల నివారణకు దోహదం చేస్తుంది. చెడు కొలెస్టరాల్‌ను తగ్గిస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబుకు ఉపశమనాన్ని కలిగిస్తుంది. మలబద్ధకాన్ని పోగొడుతుంది. చింత చిగురును నమిలితే నోటి పూత తగ్గుతుంది. ఎర్ర రక్తణాల ఉత్పత్తికి సహకరిస్తుంది. మధుమేహ వ్యాధి ఉన్నవారి రక్తంలోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. ఎముకల సమస్యలతో ఏర్పడే బాధను పోగొడుతుంది. చింతచిగురు పేస్టును కీళ్ళమీద పట్టులా వేస్తే కీళ్ళనొప్పులు తగ్గిపోతాయి.

-కె.నిర్మల