Others

కాళీయుని కష్టాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ భగవంతుడా! నీవు మాప్రాణాలు తీసుకో అంతేకాని ఈ చిన్ని కృష్ణుని ప్రాణాలకు ఆపద రానివ్వకు. ఈ కాళీయుని విషజ్వాలలకు మా ప్రాణాన్ని బలిపెట్టకు. కృష్ణుడు లేకపోతే మేము లేము. ఓ కృష్ణా! ఎన్నో సార్లు మేము పలుకగానే నీవు ఓ అని పలికేవాడివి గదా. మరి ఇపుడు ఏమైంది నీవు అట్లా సోయ లేకుండా పడుకుని ఉన్నావే. ఒక్కసారి నీవు కనులు తెరిచి మా వైపు చూడు’’అంటూ పరిపరివిధాల భగవంతుడిని కోరుకుంటున్నారు. ఒక్కొక్కరు విధిని భగవంతుడిని కష్టాలు పెట్టాడని తిట్టుతున్నారు. మరొకరు ఎలాగైనా తమ ప్రాణాలకు ముప్పుకలిగినా మాకు అంత బాధలేదు గాని మాప్రాణం అయిన యశోదానందునునికి ఎగ్గు తల పెట్టవద్దని పదేపదే వేడుకున్నారు.
అందరూ పెద్దలు కలసి ఇంకఏమి లాభం కనిపించడం లేదు. ఏదైనా ఒక కర్ర తీసుకొని వచ్చి ఈ కాళీయుని తలపై మోది మన కిష్టయ్యను మనం కాపాడుకుందాం. కృష్ణుడే లేకపోతే ఇక మనలో ఎవరికి శ్వాస ఉంటుంది అని వారంతా ముందుకు కదులుతున్నారు. ఒక్కసారిగా అందరి గొంతుకలు మూగవోయినట్లు అందరి కళ్లల్లో కన్నీరు ఉబికి వచ్చింది. ఏడుస్తూనే కృష్ణుని పలుమార్లు పిలుస్తున్నారు. బలరామా ఇది గో మీ తమ్ముడు విషానికి బలయ్యాడే. ఆనాడు పూతన విషానివ్వడానికి వస్తే ఆ పూతనే ప్రాణాలు కోల్పోయే ట్టు భగవంతుడు చేశాడు కదా. ఆ భగవంతుడు నేడు చూడడేమి కనడేమి అయ్యో గారాల పట్టీ నంద వ్రజ పాలకుడు, చిన్నివాడు, చిన్మయుడు అయిన ఆ నంద నందుడు లేవడేమి అని ఆక్రోసించారు.
బలరాముని కూడా భగవంతుని అంశయే కదా. కృష్ణుని శక్తి తెలిసిన వాడు కదా. అమాయకులైన యాదవుల భయం చూసి ‘‘తండ్రుల్లారా, తల్లులారా మీరు కాస్త ఓపిక పట్టండి. ఇంతలో ఆ భగవంతుని దయ వల్ల మన కృష్ణుడు కాళీయుని చెరనుంచి విముక్తుడవుతాడు. మనందరమూ ఆనందించే ఘడియ రానే వస్తుంది’ అని వారికి మంచి మాటలు చెప్పాడు వారిలో జారిపోతున్న ఆశను బతికించాడు.
అప్పటిదాకా ఏమీ తెలియని అమాయకునివలె, ఆ కాళీయుని విషానికి తలవొగ్గిన వాడికి మల్లె కృష్ణయ్య స్పృహను కోల్పోయినట్లు పడుకున్నాడు. వారంతా బాధపడడం చూసి అయ్యో నా కోసం ఎదురుచూసి ఎదురుచూసి వీర కండ్లు కాయలు కాచాయి.
వీరు ఏడ్చి ఏడ్చి కళ్లల్లో నీరు ఇంకి పోయాయి. ఇక వీరు బాధపడితే నేను చూడలేను. ఎలాగైనా ఈ కాళీయుని దుష్టత్వాన్ని కాలరాయాలని నిశ్చయించుకున్నాడు.
దిగ్గున లేవడానికి కాళీయుడు సహస్ర ఫణాలను నిలబెట్టి ఉన్నాడు. వీని పని పట్టాల్సిందే అనుకొని వెంటనే తన శరీరాన్ని అమితంగా పెంచేశాడు. కాశీయుడు తన బాహువులలో కృష్ణుడు అదిమి పెట్టలేక గావు కేకలు వేసి దూరంగా జరిగిపోయాడు. కృష్ణుడు లేచి ఎగిరి ఆ కాళీయుని దృష్టి మీద నిలిపాడు. ఆ కాళీయుని పడగలపై కుప్పించి ఎగిసి దూకాడు. ఆ దెబ్బకు కాళీయుడు పక్కటెముకులు విరిగినట్లు కృంగిపోయాడు. అక్కడ గుమికూడిన జనం దాన్ని చూశారు.
‘అదిగో మన కృష్ణుడు అదిగో కృష్ణుడు లేచాడు లేచాడు. ఇక మనకు భయంలేదు. ఈ దుష్టుడైన కాళీయుడు ఇక మనలను ఏం చేయలేడు’ అని అందరూ సంతోషంతో కృష్ణా కృష్ణా నీవు త్వరగా బయటకు వచ్చేయి వచ్చేయి అని అరుస్తున్నారు.
కాళీయుని పడగలమీద నిల్చిన కృష్ణయ్య తన చిన్ని పాదాలచేత కాళీయుని మదం అణచడం ప్రారంభించాడు.

- చరణ శ్రీ