Others

ఆదిదంపతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవదానవులు కలసి అమృతాన్ని సాధించడం కోసం సముద్రాన్ని మధించారు. ఆ సముద్ర మథన సమయంలో వెలువడిన (గరళం) హలాహలాన్ని మ్రింగిన శివుడు, ఆ విషవాయువుల ప్రభావంతో కుంచించుకున్నాడా అన్నట్లు సగమై చిక్కితే, ఎపుడూ భర్తనంటి ఉండే ఆది యిల్లాలు ఆ శైలపుత్రి, భర్త ఒంటిలోని వేడికి తానూ సగమైనదట. ఆ యిరువురి సగాలు కల్సి ఒక శరీరంగా మారినాయట. అదియే అర్థనారీశ్వర రూపం. ఇద్దరి అర్ధ శరీరాలు ఒకటైన మహేశ్వరుడు, అపర్ణామాత అర్ధనారీశ్వరూపంలో గోచరిస్తూ, విపరీతమైన ఆ విషవాయు వేడితో పాలిపోయినట్లుగా ఉంటే చూసి తట్టుకోలేని దేవతలు శివుని తలపై గంగనుంచారట. మరింత శీతలోపచారానికై శీతాంశుకిరణున్ని(చంద్రుని) అలంకరించారట. అయినను తాపము భరించలేకున్న ఆ ఆది దంపతులకు రామనామామృతమును త్రావించినారట. అపుడు కుదుటబడిన శివపార్వతులు రామాయణ కావ్యమునకు రక్షణగా నిలిచి, రామాయణ కథా పారాయణము గానము చేసిన వారలకు నిత్య శుభములను, సర్వాభీష్టములను నెరవేరుస్తారని ఐతిహ్యం.