Others

అన్నం పరబ్రహ్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆహారం తిన్నందే ఏ జీవి కూడా ప్రాణాలతో ఎక్కువ సేపు ఉండలేదు. ఆరోగ్యం కోసం ఉపవాసాలు చేస్తారు. కాని ఆ ఉపవాసాలు ఎక్కువైతే ఆహారం తక్కువై మనిషి నీరసించి పోతాడు. అందుకే మనకు ముఖ్య ఆహారం అన్నం కనుక అన్నాన్ని పరబ్రహ్మ స్వరూపం అని చెప్పారు.
అన్నంమానవ దేహంలోని అన్నికోశములలోను ప్రవేశించి అంతిమంగా ధాతురూపంలోకి మారి వేరొక క్షేత్రములో ప్రవేశించి మానవ రూప మరియు వివిధ రూప ఉపాదులను సృష్టిస్తోంది. భూమినుండే ఆహారం లభిస్తోంది. దీని అర్థం భూమియే ఆహారం. భూమిచుట్టూ ఆకాశం ఆవరింపబడి ఉండడం వలన ఆకాశం యొక్క ఆహారమే భూమి అని తైత్తరీయోపనిషత్తు తెలియచేస్తోంది. .ఆహారాన్ని విస్తారంగా ఉత్పత్తి చేయాలి అని తైత్తరీయోపనిషత్తు తెలియజేస్తోంది. ఈ సత్యాన్ని లోతుగా విశే్లషిస్తే మనకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక రహస్యం గోచరమవుతుంది. అనంత అంతరిక్ష ఆకాశమే ఆ పరాత్పరుని మహా ఉదరంగా భావించవచ్చు. అనంతమైన నక్షత్ర రాశులు, వాటిచుట్టూ పరిభ్రమించే గ్రహాలు, ఉపగ్రహాలు, సమస్తమూ విష్ణువుయొక్క ఆహారమని గ్రహించవచ్చు. ఈ అద్భుత భావననే ‘విశ్వం విష్ణుః’ అని విష్ణు సహస్రనామారంభము విశదపరచింది