Others

తరగని సంపదిదే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభూతి ధారణ వల్ల ముక్తి లభ్యం. ఇది అందరకూ తెలిసిన విషయమే. పునర్జన్మ కలుగదు. విభూతి అనే మాట కు సంపద అనే అర్థం ఉంది.సంపదలు రెండు రకాలు. లౌకికము, అధ్యాత్మికము అని వీటిని చెప్పుకోవచ్చు. భగవంతుని అనుగ్రహం కూడా సంపదే. శైవ సంప్రదాయంలో విభూతికి చాలా ప్రాధాన్యం ఉంది. షట్కాల శివపూజ అంటే శివుణ్ణి ఆరుసార్లు పూజించడం అనిఅర్థం. అష్టావర్ణములు అనగా భస్మ, రుద్రాక్ష, పాదోదకం, వంటి ఎనిమిది ముఖ్య శివాచారములు. శైవులకు రుద్రాక్షలు, బిల్వము ఎంత ముఖ్యమో భస్మధారణ కూడా అంతే ముఖ్యం. ఈ భస్మమును తయారు చేసే పద్ధతులు కొన్ని ఉన్నాయి. ఒక్కొక్క రకమైన ఆవు పేడ నుండి తీసే భస్మమునకు ఒక్కో రకమైన శక్తి ఉంటుందని శాస్త్ర ప్రమాణం. ఇందుకు సంబంధించి మనకు ముఖ్యమైన గ్రంథాలు కూడా ఉన్నాయి. సిద్ధాంత శిఖామణి అనేది ఇందులో ముఖ్యమైంది. దీనిని శివాచార్యులువారు సంస్కృతంలో వేయి యేళ్లకు పూర్వం రచించారు. ఇందులో విభూతి ప్రకరణములు చాలా వివరంగా శుద్ధ, సిద్ధ, ప్రసిద్ధ భస్మముల గురించి ఉంది.
పాల్కురికి సోమనాథుడు సోమ నాథ భాష్యములో కూడా విభూతి మాహాత్మ్యము వివరించబడి ఉంది. ఇతడు 13 శతాబ్దంలోని కాకతీయ సామ్రాజ్యములోని మహాపండితులు. భస్మమును ముఖంపైన కంఠమునకు, చేతులకు, భుజములకు, ఉదరభాగమునకు ఇలా శరీరంలో 32 స్థానములలో ధరించవలెనని చెప్పారు. ఇది ముప్పైదిరెండు తత్వములకు ప్రతీక. లౌకికంగా చూస్తే ఆవుపేడతో తయారు చేసిన విభూతి రోగ నిరోధక శక్తి కలది. విభూతిలో కాల్షియం ఉంటుంది. విభూతి ధారణ వల్ల శరీరానికి చల్లదనం కలుగుతుంది.

- ప్రొ. ముదిగొండ శివప్రసాద్