Others

ఆశ ఖరీదు అణా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యు: ఏం మిగిలిందండి?
తా:చెప్పానుగా! శరీరంలో రకరకాల జబ్బులూ, తొమ్మండుగురు పిల్లలూ, వాళ్ళకి నామీదుండే వల్లమాలిన అభిమానం. ఇదీ నా ఆర్జన!
యు:జరిగిందానికంతకీ యిప్పుడు విచారిస్తే ఏం లాభం చెప్పండి!
తా:్ఛఛా! ఎంతమాటన్నావు! విచారమా! అది నా జన్మలో లేదు. జరిగింది చెప్పానంతే. లాటరీ వేశాం, ఓడిపోయాం! ఇంకోరకం లాటరీ ఉందేమో ప్రయత్నించి చూడమంటున్నాను.
యు:కనీసం ఇదంతా లాటరీ అని మీ నమ్మకం?
తా:అది నా అనుభవం. సిద్ధాంతం కాదు. చూడబ్బాయ్! నా తత్వానికి సరిపడని విషయాలు నా చేత పేలిస్తున్నావు. మామూలు విషయాలేమైనా చెప్పు.. భోజనం అయిందా?
యు:ఎప్పుడో అయిదండి. మళ్లీ ఎప్పుడో తెలీదు.
తా:చాలా విషయాలు అలా తెలియకుండా వుంటేనే మంచిది. ప్రతిదీ తెలిసిపోతే ఆరోగ్యం బాగుండదు.. ఎవరదీ ఆ చీకట్లో(గట్టిగా) ఎవరక్కడా?
కృష్ణమూర్తి: (సమీపిస్తూ) నేనండీ కృష్ణమూర్తిని. ఎరగరూ- బాంకులో పని.
యు:ఓహో ఇందాకా సైకిల్ తీసుకెళ్ళారుమీరేనా?
కృ: మరేనండి! కొత్త సైకిలు కొని ఇంకా నెల కాలేదు.. అది సరేకానండి, ఇప్పుడెక్కడేనా దుకాణాలుంటాయా, దుకాణాలు?
తా:ఎందుకు నాయనా ఆ కంగారూ? ఏవొచ్చింది? ఏం దుకాణం కావాలి?
కృ:మా ఆవిడండి, ఇందాక భోంచేసేవరకూ హాయిగానే ఉంది. ఉన్నట్టుండి వచ్చేశాయండి బాబూ! చంపేస్తోంది!
యు:ఏంవొచ్చేశాయి?
కృ:మెల్లిగా అంటారేవిటండీ బాబూ! చస్తూంటేనూ! తుమ్ములండీ తుమ్ములు! ఏకతుమ్ములు! దానిమీద జలుబూ! ఊపిరాట్టంలేదనుకోండి! ఏం చెయ్యమంటారు తాతగారూ!
తా:ఓ అరగంట ఊపిరి పీల్చడం మానెయ్యమనండి! అదే తగ్గుతుంది!
కృ:అదెలా కుదురుతుందండీ! చెప్పండీ! దుకాణాలు ఉంటాయా?
యు:ఉంటే ఏం చేస్తారు?
కృ:ఏదైనా మందు కొనుక్కొస్తాను. వెంటనే మందు పడితే మంచిది చూడండి!
యు:ముందు తక్షణం ఏం చేశారు?
కృ:ఏం చెయ్యనూ? స్వెట్టరు తొడుక్కోమన్నాను. తలకి మఫ్లరు చుట్టుకోమన్నాను.
తా:అబ్బే అలా అశ్రద్ధ చేయకండి.
కృ:అయితే ఇంకేం చెయ్యమంటారు?
తా:కిటికీ తలుపులన్నీ వేసెయ్యండి. ఒక్క పిసరు గాలి తగిలినా ప్రమాదం-
కృ:అవునండి-అసలే అర్భకురాలు.
తా:నాకు తెలియదుటయ్య! రోజూ చూస్తున్నానుగా. అవునా- గది నిండా సాంబ్రాణి పొగ వేసి దీపాన్నీ వెలిగించెయ్! ఆ తరువాత మందుల షాపునుండి మందు కొనుక్కెళ్ళు!
కృ:అలాగేనండి! వెళ్లొస్తాను మరి!
యు:చూడండి! ఇంకో చిన్న జాగ్రత్త తీసుకుంటే ఇంకా మంచిది. మీ ఇంట్లో గరుడ పురాణం వుందా?
తా:ఇప్పుడప్పుడే కాదులే అది- నే చెప్తాగా- ముందు నువ్వు వెళ్లిరా నాయనా!
కృ: వస్తానండి మరి!
యు:అభిమానం అంటే అలాగుండాలి తాతగారూ! నాకే గనక ఇలాంటి నాన్నుంటేనా?
తా:ఉంటే?
యు:బతుకు ఇంతకంటే ఇంకొంచెం రుచిగా ఉండేదేమో! మా నాన్న ఏం చేసేవాడో తెలుసా తాతగారూ! ఇంట్లో ఎవరికైనా కాస్త జబ్బుగా వుంటే వెళ్లి వీధరుగుమీద కూర్చునేవాడు. అమ్మకి జ్వరం వస్తే కోరి తెచ్చుకున్నానని పట్టుకు తనే్నవాడు.
తా:సబబుగానే వుంది. జబ్బు తెచ్చుకోవడం నేరం- నేరానికి శిక్షవేసేవాడు- తప్పేం?
యు:బాగా చెప్పారు. ఈ ధర్మసూక్ష్మం నాకిన్నాళ్లూ తెలియలేదు.
తా:సరే- ఒక్కసారి లోపలికి వెళ్లి పరిస్థితి ఎలా ఉందో చూసొస్తాను. ఇంక వెళ్లి పండుకుంటావా?
యు:నిద్రరావడంలేదు. మీరు వెళ్లిరండి. బహుశా మీరు తిరిగి వచ్చేవరకూ ఇక్కడే ఉంటాననుకుంటాను.. చెప్పలేను.
తా:సరేలే- నిద్రపో! దాన్ని మించిన సుఖం లేదు.
***
యు:అంటాడు తాతగారూ. కాని నిద్ర రావద్దూ! ఆ అమ్మాయి కృష్ణవేణి చెప్పినట్లు ఇలాంటప్పుడు రెండో ఆటో, లేకుంటే మూడో ఆట సినిమా చూసి, నడిచి ఇంటికి వస్తే ఎంత హాయిగా ఉంటుంది! సినిమాకి డబ్బులే ఉంటేనా! అంతపనీ చేసుండేవాణ్ణి. ఇన్ని కబుర్లూ చెప్పి రుూపాటికి గుర్రుపెట్టి నిద్రపోతూ ఉండుంటుంది. ఆ ఇందిర ఎవరో గాని ఆవిడకి ఇవాళ నిద్రాభంగం ఉండకూడదు మరి!
***
కృష్ణవేణి:ఇందిరా?
ఇంది:ఏం కృష్ణవేణీ! రా, లోపలికి రా! ఇంత రాత్రివేళ వచ్చావేం? ఏదైనా కావాలా?
కృ: అబ్బే ఏం తోచక వచ్చాను. నిద్రపోతున్నారా? అమ్మ వంట్లో ఎలా వుందీ?