Others

ఆసరా కోరే కళలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు నేలలో అన్ని జానపద కళారూపాలతోపాటు హరికథా గానం ఒక వెలుగు వెలిగి, ప్రజాభిమానాన్ని పొందింది. ఆంధ్రుల హరికథా చరిత్రలోనే హరికథ గానం ఒక అపురూపమైన స్థానాన్ని, అపారమైన గౌరవాన్ని పోగేసుకుంది. ఈ కళా ఖండాన్ని ఒక విశిష్ట కళారూపంగా తీర్చిదిద్దిన వారు విజయనగరం జిల్లాలోని ఆదిబట్ల నారాయణదాసు. ప్రజలు కాలంతో పరుగిడుతూ జానపద కళలను ఆదరిం చడం మరుస్తున్నారు. కాని నేటి తెలంగాణ ప్రభుత్వం జానపద కళలను జాగ్రత్త చేయాలన్న బాధ్యతతో సాంస్కృతిక శాఖ వారు జానపద కళరూపాలను సేకరించడం ప్రారంభించారు. అటు ప్రభుత్వం చేస్తున్నట్టుగానే ప్రజలు కూడా జానపద కళలను ఆదరించడం ఆరంభిస్తే అటు ఆ కళాకారులకు భుక్తి ఇటు కళామ తల్లి సేవ చేసిన వారు అవుతారు. అపుడు హరికథలు, ఒగ్గుకథలు లాంటి ఎన్నో జానపద కళారూపాలు వెలుగులీనుతూ మన సంస్కృతీ వైభవానికి తార్కాణాలుగా నిలుస్తాయ.