Others

షోడశావతారుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దత్తాత్రేయుడు అత్రి చేసిన తప్ఫఃలం, అనసూయ చేసిన కర్తవ్యనిష్ఠా ఫలం రెండూ కలసి దత్తాత్రేయులుగా రూపుదిద్దుకొంది. అనుసూయ పాతివ్రత్యాన్ని పరీక్షించాలి లక్ష్మీపార్వతీసరస్వతులు ముచ్చటపడ్డారు.వారికి నారదుడు తోడయ్యాడు. అమ్మా ఆ అనసూయమ్మ ఇనుపగుగ్గిళ్లను ఉడికించిన తల్లి. ఆమెను పరీక్షించాలనుకొంటే ఏదైనా ఉపద్రవం వస్తుందేమో అని కూడా తన తప్పులేకుండా చెప్పాడు. కాని ఆ ముగ్గురమ్మలు తమ తమ పతిదేవులను అనసూయ దగ్గరకు పంపించారు.
త్రిమూర్తులు వివస్తవ్రై తమ ఆకలిని తీర్చమని కోరారు. అనసూయ సరేనంది. తన పతిదేవుని స్మరించుకుంది.త్రిమూర్తులను పసిబాలురుగా మార్చింది. వారికి స్తన్యమిచ్చింది. వారి ఆకలి తీరింది. వారిని ఊయల్లో పడుకోబెట్టింది. తాను తన పని చేసుకొంటూ ఉంది. కాని ముగ్గురమ్మలమే తమకు పతిభిక్ష పెట్టమని వచ్చారు. అక్కడ ఆ ఊయల్లో ఉండేవారే మీ వారు తీసుకొని వెళ్లండి అంది అనసూయమ్మ. వారు విచిత్రంతో చూసి ఆపని మాకు రాదు నీవే దయతలచి మా పతిదేవులను అనుగ్రహించుము. మా అజ్ఞానంతో ఇలా ప్రవర్తించాము అని చెప్పుకున్నారు. చిరునవ్వుతో వారిని చూసింది. తన పతిదేవుని స్మరించుకొని బాలకులపై నీళ్లు చల్లింది. వారు త్రిమూర్తులగా యథారూపం ధరించారు. సతీసమేతులైన త్రిమూర్తులు అత్రి అనసూయల కోరిక తీరుస్తామన్నారు. మీ ముగ్గురు మాకు తనయుడై పుట్టమని అడిగారు. ఆ త్రిమూర్తుల వరఫలమే దత్తాత్రేయులు. ఆ దత్తాత్రేయులే షోడశావతారులు.ఆ షోడశ అవతారాలు
యోగరాజు: కార్తిక పున్నమి బుధవారం మొదటి ఝాములో మొదటి యామంలో యోగిరాజుగా అవతరించారు.
అత్రివరదుడు: అత్రివతాశనుడై ఇంద్రియాలను, మనస్సునూ నిగ్రహించి ఒంటికాలుపై యోగిరాజునే ధ్యానించాడు. నీవంటి పుత్రుడు కావాలని కోరుకున్నాడు. ఆయన తపస్సుకు మెచ్చి త్రిమూర్తులు దర్శనం ఇచ్చారు. వారు అత్రికోరికానుసారం అత్రివరదులుగా దర్శనం ఇచ్చాడు.
శ్రీ దత్తాత్రేయుడు ; అత్రిఅనసూయలు చేసే లోకోపకారానికి ముగ్ధుడైన దత్తాత్రేయులే కార్తిక బహుళ విదియ మృగశిర నక్షత్రం నాడు దత్తాత్రేయులుగా ఉద్భవించారు.

- ఇంకా ఉంది