Others

అత్యుత్సాహం.. ఆశనిపాతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేవహూతి కర్థములు ఒకసారి తమకు పుత్రుడు కావాలని కోరుకున్నారు. మహావిష్ణువే తమకు సంతానంగా వస్తే బాగుంటుందనుకొన్నారు. మహావిష్ణువు తమకు కుమారుడిగా పుట్టాలని వారిద్దరూ తపస్సు ఆరంభించారు. వారి తపస్సుకు మెచ్చి మహావిష్ణువు వారికి కపిలునిగా జన్మించారు. ఆయన పుట్టుకతోడనే మహాజ్ఞాని. కపిలుడే తన తల్లికి జ్ఞానబోధ చేశారు.
ఒకసారి కపిలుడు దీర్ఘతపస్సు చేసుకొన్నాడు. అక్కడి సగరుని కుమారులు తమ తండ్రి యాగాశ్వాన్ని వెతుకుతూ వచ్చారు.వారికి కపిలుని వెనుక వారి యాగాశ్వం కనిపించింది.వారి పొరపాటున ఇదిగోఈ దొంగసాధువే మన యాగాశ్వాన్ని దొంగలించుకుని వచ్చి ఇక్కడ ముక్కుమూసుకొని తపస్సు చేస్తున్నట్టు నటిస్తున్నాడని అన్నారు. వెంటనే అత్యుత్సాహంతో కపిలునిమీదకు వెళ్లారు. సగర పుత్రుల రణగొణ ధ్వనికి కపిలుని ధ్యానభంగం కలిగింది. ఆయన కనులు తెరిచి వీరిని చూచి ఒక్క హుంకారం చేశారు. వారంతా ఆ హుంకారానికి మాడి మసైపోయారు. ఆ తర్వాత సగరుని మనుమడు శివుని మెప్పించి ఆకాశ గంగను నేలమీదకు తీసుకొని వచ్చినపుడు ఆ భస్మరాశులుగా ఉన్న సగరుని పుత్రులు పునీతులై స్వర్గానికి చేరుకొన్నారు. మాఘ పూర్ణిమ నాడు కపిలునికథామృతం ఆస్వాదించినవారికి పాపరాశి నశిస్తుంది.

- సుశీల