Others

మాఘం మార్కండేయుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మృకండ మహర్షి మనస్వినులు శివభక్తులు. అపుత్రవంతులు. ఎన్నో యాగాలు , యజ్ఞాలు చేశారు. కాని పుత్రసంతానం కలుగలేదు. శివుడే ఈపిత్సాలను తీర్చువాడు కామితార్థప్రదాయుడు అనుకొని వారు శివుడ్నే పూజించేవారు. వారికి ఒకసారి శివదర్శనం కలిగింది. శివుడు మీకోరిక ఏమిటి అనిఅడిగినప్పుడు పున్నామ నరకం నుంచి తప్పించగలిగే పుత్రుడు కావాలని కోరారు. శివుడు మీకు పుత్రుడ్నిస్తాను కాని, అల్పాయుష్కుడు అవుతాడు అని చెప్పాడు. శివుడుండడగా మాకు భయంలేదు. శివుడే అన్నింటికీ కారణభూతుడు అని వారు ఆ పుత్రుడ్నే కోరారు. శివాజ్ఞ అయంది. వారికి పుత్రోదయం అయంది. ఆ పుత్రునికే మార్కండేయుడు అని పేరు. ఈ మార్కండేయుడు బాల్యం నుంచే శివభక్తునిగా ఎదిగాడు. ప్రయాగలో పుణ్యస్నానమాచరించి శివుణ్ణి మెప్పించి చిరంజీవి అయ్యాడు. శివా అని నోరారా పిలిస్తే చాలు అపారకృపా వాత్సల్యాన్ని కురిపిస్తాడు శివుడు.