Others

మూలం కుదురే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఏ పని చేయాలన్నా ఏ పని సిద్ధించాలన్నా నెరవేరాలన్నా సాధన అవసరం. ఏ కళ రాణించాలన్నా కూడా సాధననే అవసరం. జ్ఞానం పొందాలన్నా, భగవంతుని సాక్షాత్కారం పొందాలన్నా సాధన మార్గం. ఎన్నో వేలయేండ్లు తపస్సు లు సాగిస్తే భగవంతుని వ్యక్తరూపాన్ని చూడగలిగేవారు. ఎంతో కృషి చేస్తే ఒక కళలో నేర్పరితనాన్ని అలవర్చుకొంటారు. ఈ సాధన సాగించడానికి మనిషికి కుదురు ఉండాలి. కుదురు అంటే ఏకాగ్రత. ఏకాగ్రత అనుకొన్నవెంటనే సాధ్యపడదు. మనస్సు అతి చంచలమైంది. ఎన్నో ఆలోచనలు,మరెన్నో సందేహాలతో మనసు నిలవదు.
కృషితో నాస్తి దుర్భిక్షం , సాధనమున పనులు సమకూరు ధరలోన అనేవి కృషి గురించి సాధన గురించి చెప్పే పెద్దల వాక్యాలు. ఏకాగ్రత కావాలంటే గురువు అవసరం. సందేహ నివృత్తి చేసుకొని అనుకొన్న పనిలో అవగాహనను తెచ్చుకుని కార్యాన్ని సాధించడానికి సులువైన మార్గం గురువుగారి బోధనే.
ఈ గురుఅనుగ్రహం పొందాలన్నా సాధన కావాలి. ధ్యానం ద్వారి జ్ఞానం లభిస్తుంది అనడంలోని ఆంతర్యం అదే. మనసు చంచలమైంది కనుక అనుకొన్న పనిని తప్ప మరో ఆలోచన చేయకపోవడం, ఉదాహరణకు భగవంతుని ధ్యానం చేయాలనుకొంటే కేవలం భగవంతుని గురించి ఆలోచనే చేయాలి. భగవంతుని రూపవిన్యాసాలను, ఆరూపంలోని దాగున్న అంతరార్థాలను తెలుసుకోవాలి. భగవంతుడు ఇంతకు ముందు భక్తులను ఎట్లా రక్షించాడో వారి జీవిత చరిత్రను అడిగో, చదివో తెలుసుకోవాలి. భగవంతుణ్ణి పూర్తి విశ్వాసంతో నమ్మాలి. ఒక గోపవనిత రోజు పక్క ఊరికి వెళ్లే ఒక శివభక్తుని ఇంట్లో పాలు పోసి వచ్చేది. ఆ శివభక్తుడు ప్రతిరోజు శివాజ్ఞ లేనిదే ఏది జరుగదు. ఏది తలుచుకుంటే దాన్ని శివుడు ఇచ్చేస్తాడు. శివుడు మనకు ఎల్లవేళలా తోడు ఉంటాడు అని చెప్పేవాడు. ఈ గోపవనిత అట్లాంటి శివభక్తుల కథలను వింటుండేది. ఒకసారి గ్రామంలోని చెరువు కట్ట తెగింది. పక్క ఊరికి వెళ్లడానికి లేకుండా నీరు అమిత వేగంతో ప్రవహిస్తూ ఉన్నాయి. ఆరోజు శివభక్తుడు రుద్రాభిషేకం చేయాలి త్వరగా ఆవుపాలు తెచ్చివ్వు అని ఈ గోపవనిత చెప్పివున్నాడు. ఈ వనిత పాలు పితికింది. వెళ్దామంటే నీరు ఉప్పెనగా ప్రవహిస్తోంది. ఎలాఅనుకొని ‘ఆ నాకెందుకు నేను ఓం నమశ్శివాయ ’అనుకొంటూ వెళ్తాను. ఆ శివుడే ఈ పాలను ఆ భక్తునికి ఇస్తాడు. ఆయనకే కదా శివాభిషేకం చేసేది ’అనుకొంది వెంటనే ఓం నమశ్శివాయ అనుకొంటూ వెళ్లింది. అలా ఆ ఉప్పెనలోనే నడుచుకొంటూ వెళ్లి పాలు ఇచ్చింది. ఈ ఉప్పెన సంగతి శివభక్తునికి కూడా తెలసింది. అయ్యో ఎలా వచ్చావు అంతా నీళ్లు కదా అని ఆశ్చర్యంతో పాలు తెచ్చిన గోప వనిత ఆయన అడిగాడు.
‘ఏముంది స్వామి శివయ్య ను తలుచుకుంటూ వచ్చాను. శివుడే నాకు దారి చూపాడు. మీరే కదా శివుడే అన్నీ చేస్తాడు, చేయిస్తాడు అని చెప్పారు. మరి మీ చేత శివాభిషేకం చేయించుకోవాలి అనుకొన్నాడు కదా. మరి నేను పాలు తీసుకుని రావాలంటే ఆయనే కదా దారి చూపాలి అందుకే చూపాడు. వచ్చాను మీకు పాలిచ్చాను. ఇక అభిషేకం చేయండి’అందట. ఆమె నమ్మకానికి ఆశ్చర్యపోయిన ఆ శివభక్తుడు ఆమెనే శివస్వరూపంగా భావించి పూజించాడు. అట్లా నమ్మకం అనేది ఉంటే సాధన కుదురుతుంది. ఆ కుదురు మనిషికి ఉండే మహనీయుడు అవుతాడు.

- కూకుట్ల యాదయ్య