Others

పద్యఆలాపనలో కొత్తబాణికి ఆద్యులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాటకం ఒక యజ్ఞం. ఆ యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలంటే రచయిత కథాకథన సంభాషణా కౌశలం; దర్శకుని ప్రతిభా పాటవం, నటుని నటనా వైదుష్యం, రంగోద్దీపనం, రంగాలంకరణం సంగీతం ఇవి అన్నీ సమపాళ్లల్లో పండాలి. ఇందులో ఏ ఒక్కటీ లేకపోయనా ఆ యజ్ఞం పరిపూర్ణ ఫలాన్ని ఇవ్వదు. అలాంటి నాటకాల్లో అద్వితీయులు హరి ప్రసాద్ రావు గారు నాడు మహోజ్వలంగా వెలిగిన పద్యనాటకాల్లో భావస్ఫోరకంగా; సర్వజన సుబోధకంగా, రాగాన్ని పద్యంలోనే ఇమిడ్చి పద్యంతోపాటు రాగం ముగిసే విధంగా నూతన సంప్రదాయానికి హరిప్రసాదరావు శ్రీకారం చుట్టారు. దీనే్న హరిప్రసాద్‌రావుగారి బాణీగా నేటికీ స్థిరపడి ఉంది. హరిశ్చంద్రుడు, సారంగధరుడు, నలుడు, దుర్యోధనుడు వంటి పాత్రలను అద్భుతంగా పోషించేవారు. ఆనందభైరవి, భైరవి, ముఖారి, మోహన, బారువ, పున్నాగ, శహానీ, శ్రీ, పూరీ కళ్యాణి, ఆరభి, వరాళీ రాగాలను ఆలపించడం లో ఈనాటికి హరిప్రసాదరావు గారు అగ్రగణ్యులే.